ప్రియుడితో కలిసి భర్తను చంపి.. సినిమా సీన్ క్రియేట్ చేసింది..
posted on Jun 2, 2021 @ 4:58PM
ఓపెన్ చేస్తే.. ఆమె పేరు రషీదా షేక్ వయసు 28 ఏళ్ళు. ఆమె భర్త రయీస్ షేక్ కొన్ని రోజులుగా కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ కి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఫార్మాలిటీస్ ప్రకారం ఆమెను కొన్ని ప్రశ్నలు సంధించారు. నీ భర్తకు ఎవరైనా ఎవరైనా శత్రువులు ఉన్నారా? గతం లో అప్పులు ఉన్నాయా? మీ బంధువులతో గానీ, మీ భర్త ఫ్యామిలీలో ఆస్తి గొడవలు ఉన్నాయా..? ఇలాంటి ప్రశ్నలు పోలీసులు ఆమెను అడిగారు. ఆమె ఆలోచించడం మొదలు పెట్టింది. చాలా దీర్ఘాంగా, చాలా లోతుగా ఆలోచించి. ఆమె కొంతమందిపై అనుమానం ఉందని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు. కేసుకు సంబందించిన దర్యాప్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా. రయీస్ షేక్ సోదరుణ్ని స్టేషన్‌కు పిలిపించారు. అతనిపై కూడా పోలీసులు వారి లా ప్రకారం ప్రశ్నలు విసిరారు. మీ తమ్ముడు మిస్సింగ్ గురించి మీకు తెలియదా.? ఆ విషయంపై కంప్లైంట్ ఇవ్వాలని మీకు అనిపించలేదా? అని. అంతే రయీస్ షేక్ అన్న మాట్లాడం స్టార్ట్ చేశాడు. ఇవ్వాలనే అనుకున్నాను సార్.. నాకు ఫీవర్ ఉండి నిన్న రావడం కుదరలేదు. ఇంతలో ఆమె ఇచ్చేసింది అని చెప్పాడు. అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగిన పోలీసులు. మేం పిలిచినప్పుడు స్టేషన్‌కి రావాలి. అన్నారు. సరే సార్ అంటూ వెళ్లిపోయాడు. అయినా పోలీసులకు ఆ మిస్టరీ ఏంటో అర్థం కాలేదు. ఎవరు చేసి ఉంటారో అంతు చిక్కలేదు. పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత పోలీసులు కొంచం టెక్నికల్ గా ఇన్వెస్ట్ చెయ్యడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే రషీదా షేక్ , రయీస్ షేక్. మొబైల్ నంబర్ల కాల్ లిస్ట్, వాట్సాప్ చాటింగ్ అన్నీ చెక్ చేశారు.
కట్ చేస్తే.. అప్పటి వరకు రహస్యం గా ఉన్న ఒక విషయం తెలిసింది. అదేంటంటే ఆమెకు మరో యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. ఆమెను పోలీసులు మరోసారి స్టేషన్‌కు పిలిపించారు. ఈసారి డోసు పెంచి కాస్త గట్టిగా అడిగితే... అప్పుడు కూడా ఆమె. తనకేమీ తెలియదని.. ఆ యువకుడితో పరిచయం ఉన్నట్లు ఒప్పుకుంది, ఆ సంబంధం మాత్రమే ఉందంటూ బోరున ఏడ్చింది. మహానటి మాదిరి నమ్మబలికింది. కట్ చేస్తే.. ఇందులో మరో ట్విస్ట్ ఉండి. అదేంటో మీరే చూడండి. ఆమె వెంట ఉన్న టీనేజ్ పాప అంటే ఆమె కూతురు మాట్లాడుతూ .. "మా నాన్నను అమ్మ, అతను చంపేశారు" అంది. అంతే... ఇక అంటే ఆ తల్లి ముఖం మాడిపోయింది. వెంటనే కూతురి నోరు మూసింది. ఇంకేం మాట్లాడనివ్వకుండా చేసేందుకు ట్రై చేసింది. అప్పటి వరకు క్లూ దొరికాక పోలీసులు ఒక్కసారిగా క్లూ దొరికితే ఊరుకుంటారా పోలీసులు.. లేడీ కానిస్టేబుళ్లను రంగంలోకి దింపారు ..రషీదాకు కోటింగ్ ఇప్పించారు.
ఇలా కోటింగ్ స్టార్ట్ అయ్యిందో లేదో... నిజం ఒప్పేసుకుంది. తమ మధ్య సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడనీ... అతన్ని చంపేయాలని ఇద్దరం నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్లాన్ ప్రకారం... 12 రోజుల కిందట... భర్తకి పెట్టే భోజనంలో నిద్రమాత్రల పొడి వేసింది. భోంచేశాక... మద్యం తాగకుండానే మత్తులోకి వెళ్లిపోయాడు. చీకటి పడ్డాక ప్రియుడు వచ్చాడు. ఇద్దరూ కలిసి... భర్త తలను నరికేశారు. ఆ తర్వాత... బెడ్‌రూంలోనే... గొయ్యి తీసి... శవాన్ని పూడ్చిపెట్టేశారు. దానిపై దుప్పట్లు, పాత వస్తువుల వంటివి పెట్టి... ఎలాగో కవర్ చేశారు. కానీ... పక్క గదిలో నిద్రపోతున్న పాప... నిద్రలేచి... తలుపు సందులోంచీ... జరిగిన దారుణాన్ని చూసేసిందనే విషయం వాళ్లకు తెలియదు.