పెళ్లి దుస్తుల్లో కలెక్టరేట్‌కు వెళ్లిన జంట... ఎందుకో తెలుసా..
posted on May 19, 2021 @ 1:16PM
దేశం లో కరోనా విలయతాండవం చేస్తున్న వేళా.. ప్రభుత్వాలు ఓడిపోయాయి. పాలకులు ఓడిపోయారు. అవును ఓడిపోయాయి. ప్రజలు గెలిచారు. ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేయాల్సిన ప్రభుత్వాలు చేతులు ఎత్తేశాయి. పాలకులు తడిగుడ్డ వేసుకొని పడుకున్నారు. ప్రజలతో, నాయకులకు ఓట్ల అవసరం తప్పా. ప్రజా ఆరోగ్యం అవసరం లేదని మరో సారి తేలింది. కానీ ప్రజలు ముందుకు వచ్చి తోటివాడికి సహాయం చేస్తూ, మనోధైర్యాన్ని ఇస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మహామ్మరితో పోరాటానికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తీసుకుంటున్నారు. తమకు చేతనైన సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. సహాయం చేయడానికి మనసుదడాలిగానీ, మారేది అవసరంలేదని గుర్తుచేశారు. మొన్నటికి మొన్న నాగ లక్ష్మి తన పెన్షన్ డబ్బులు సోను సూద్ ట్రస్ట్ కి ఇచ్చింది. ఇంకా ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది పరోక్షంగా, ప్రతిక్షంగా తమ వంతు సహాయం చేస్తున్నారు. ఈ కోవలోనే తమిళనాడులో రెండు కొత్త జంటలు సీఎం కోవిడ్ ఫండ్‌కు విరాళం ఇచ్చాయి.
కరోనా మహామ్మరితో పోరాటంలో ఎంతోమంది బాధ్యతగా వ్యవహరిస్తూ సాటివారికి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రముఖులు, సెలబ్రెటీల నుంచి సామాన్యులు సైతం తామున్నామంటూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. వాళ్లు చేసే సాయం చిన్నదే అయినా ఎందరికో స్ఫూర్తి కలిగిస్తోంది. ఈ కోవలోనే తమిళనాడులో ఓ నూతన జంట చేసిన సాయం ప్రశంసలు అందుకుంటోంది. నాగపట్నంకు చెందిన షరీన్ రాజ్, సూర్యల వివాహం సోమవారం జరిగింది. అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్ చర్చిలో ఉంగరాలు మార్చుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట పెళ్లి దుస్తుల్లోనే నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లింది. అక్కడ కలెక్టర్ ప్రవీణ్ పీ నాయర్‌ను కలిసి సీఎం కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ కోసం 50 వేల రూపాయల చెక్ అందించారు.
ఈ సందర్భంగా వరుడు షరీన్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి ప్రపంచ సంక్షోభ సమయంలో మేము వివాహం చేసుకున్నాం. మా పెళ్లి విందుకు అయ్యే మొత్తాన్ని కరోనా రోగుల సహాయార్ధం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకే సీఎం కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌కు ఆ మొత్తాన్ని విరాళంగా ఇచ్చాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులను కలెక్టర్ పి నాయర్ ప్రశంసించారు.
మరో ఘటనలో విల్లుపురం జిల్లా మనంపూండి అనే చిన్న పట్టణంలో వివాహం చేసుకున్న జంట కూడా ఇదే విధంగా మానవత్వం చాటుకుంది. పెళ్లయిన వెంటనే ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పోన్ముడిని కలిసిన నూతన జంట కరోనా రోగుల సహాయార్ధం రూ.51,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వరుడు హరిభాస్కర్ మాట్లాడుతూ... మేం వివాహం ఘనంగా చేసుకోవాలనుకున్నాం. కానీ లాక్‌డౌన్ కారణంగా సింపుల్‌గా జరుపుకోవాల్సి వచ్చింది. మా పెళ్లి ద్వారా ఆదా అయిన డబ్బులో కొంత మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చాం’ అని చెప్పారు.