న్యూజిలాండ్ మంచి స్కోర్.. టీమిండియా సెమీస్ ఛాన్సెస్ ఫసక్?
posted on Nov 5, 2021 @ 5:25PM
టీ20 వరల్డ్ కప్ ఇండియన్స్‌కు ఉత్కంఠగా మారింది. మనం గెలుస్తామా లేదా అనేది ఎంత ఆసక్తికరమో.. న్యూజిలాండ్ ఓడుతుందా లేదా? అనేది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ విషయంగా మారింది. ఎందుకంటే.. భారత్ సెమీస్‌లో అడుగుపెట్టాలంటే.. కివీస్ ఓ మ్యాచ్‌లో తప్పక ఓడాల్సి ఉంటుంది. లేదంటే.. మనకు ఛాన్సెస్ తగ్గిపోతాయి. అందుకే, న్యూజిలాండ్ వర్సెస్ నమీబియా మ్యాచ్‌పై టెన్షన్ నెలకొంది.
వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న న్యూజిలాండ్‌ను భారీ స్కోరు సాధించకుండా నమీబియా బౌలర్లు అడ్డుకున్నారు. అయితే ఆరంభంలో కట్టడి చేసిన నమీబియా.. ఆఖర్లో చేతులెత్తేయడంతో కివీస్ మెరుగైన స్కోరు చేసింది. సెమీస్‌కి వెళ్లాలంటే.. న్యూజిలాండ్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ హ్యాండ్స్-అప్ అనడం టీమిండియా ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపింది. కీలకమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నమీబియా టార్గెట్ 164 రన్స్.
అఫ్గాన్ మీద భారీ ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (18) ఈసారి తుస్సుమన్నాడు. నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ధాటిగా ఆడలేకపోయాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (28) ఫర్వాలేదనిపించినా.. కీలక సమయంలో ఔటయ్యాడు. డారిల్ మిచెల్ (19) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. డేవన్ కాన్వే (17) విఫలమయ్యాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (39), నీషమ్ (35) వేగంగా ఆడటంతో 163 స్కోరునైనా న్యూజిలాండ్ సాధించగలిగింది. నమీబియా బౌలర్లలో బెమార్డ్, వైజ్, ఎరాస్మస్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోవాలని ఇండియన్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.