మంత్రుల తిట్ల పురాణం వెనుక ఉన్నదెవరో తెలిసిందిలే..!
posted on Dec 28, 2022 @ 2:29PM
జగన్ తొలి కేబినెట్‌లో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు ఎక్సెట్రా ఎక్సెట్రాలు.. అలాగే మలి కేబినెట్‌లోని మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు, గుడివాడ అమరన్నాథ్ వగైరా వగైరాలు.. ప్రెస్ మీట్ పెట్టి తిట్ల పురాణం వల్లించడం వెనుక ఉన్నది ఎవరో తెలిసిపోయిందని నెటిజన్లు సామాజిక మాధ్యమం సాక్షిగా స్పష్టం చేస్తున్నారు.
వైయస్ జగన్ కేబినెట్‌లో ఆయా శాఖల మంత్రులుగా కంటే.. వీరంతా బూతులతోనే ఫేమస్ అయ్యారని గుర్తు చేస్తున్నారు. అయితే సదరు మంత్రులు అలా మాట్లాడుతున్నా.... ముఖ్యమంత్రి వైయస్ జగన్ కానీ, ఆయన సలహాదారులు కానీ.. ఏ రోజు ఇది తప్పు.. ఇలా మాట్లాడడం తప్పు అంటూ వారిని వారించిన దాఖలాలు లేవని అంటున్నారు.
కానీ తాజా పరిణామాల నేపథ్యంలో వీరి వెనుక ఉన్న శక్తి, వ్యక్తి ఎవరన్నది తమకు అర్థమైందని వారు సోషల్ మీడియా సాక్షిగా చెబుతున్నారు. తాజా జగన్ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ 250 రూపాయిలు పెంచిందని.... ఈ పెంపు 2023, జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని... అయితే ఈ పెన్షన్ అందుకొంటున్న వారికి 300 యూనిట్లు దాటి కరెంట్ బిల్లు వచ్చినా.. అలాగే వెయ్యి చదరపు గజాల విస్తిర్ణంలో వారు నివాసముంటున్నా.. అలాంటి వారికి ఇకపై పెన్షన కట్ చేయాలంటూ జగన్ సర్కార్ స్సష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై ప్రతిపక్షాల నుంచే కాదు.. ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెన్షన్ కట్ అంశంపై అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో అలా విమర్శించే వారిని ప్రెస్‌మీట్ మరీ తిట్టాలంటూ ఉన్నతాధికారులకు సీఎం సూచించడమే కాదు... అలా మాట్లాడితేనే కానీ ఈ విమర్శలకు పుల్ స్టాప్ పడదంటూ క్లారిటీ సైతం ఇచ్చేశారని నెటిజనులు సోషల్ మీడియా సాక్షిగా వివరిస్తున్నారు. దీంతో ఉన్నతాధికార గణమంతా.. ఒక్కసారిగా అవాక్కయిందని వారు పేర్కొంటున్నారు.
ఈ తాజా సంఘటనతో నాటి నుంచి నేటి వరకు మంత్రుల తిట్ల పురాణం వెనుక కర్మ.. కర్త.. క్రియ అంతా సాక్షాత్తూ వైసీపీ అధినేత, సీఎం జగనే ఉన్నారనే విషయం తమకు అర్థమైందని నెటిజన్లు అంటున్నారు.
అయితే జగన్ ముఖ్యమంత్రిగా కొలువు తీరిన తర్వాత.. జగన్ పాలనపై మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లు విమర్శలు గుప్పించేవారు. ఈ నేపథ్యంలో వీరిపై జగన్ అదేశాలతోనే.. నాటి.. నేటి కేబినెట్ మంత్రులంతా బండ బూతులు తిట్టారని, ఇప్పటికి వీరు తీడుతూనే ఉన్నారని అంటున్నరు. అయితే ఇటీవల విశాఖలో అధికార పార్టీ సింహ గర్జన నిర్వహించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్.. విశాఖకు వస్తున్నారు. ఈ సందర్బంగా స్థానిక ఎయిర్ పోర్ట్ వద్ద కోలాహలం నెలకొంది. అలాంటి వేళ.. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఎయిర్‌పోర్ట్ సాక్షిగా చేసిన వెకిలి చేష్టల వెనుక సీఎం వైయస్ జగన్ ఉండే ఉంటారని కూడా అభిప్రాయపడుతున్నారు.