జగన్ కు ఏమి శిక్ష వేయాలన్న నారా లోకేష్
posted on Apr 10, 2020 @ 5:02PM
ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన నడుస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా జగన్ గారు ?, అంటూ సి.ఎం. ను నిలదీశారు.
అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసారు.మాస్కులు,వ్యక్తిగత రక్షణ కిట్లు కొనడానికి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు.కరోనా ని ఎలా నివారించాలి అని అడిగినందుకు నగరి కమిషనర్ వెంకట్ రామిరెడ్డి ని సస్పెండ్ చెయ్యడాన్ని నారా లోకేష్ ఖండించారు. అసలు కరోనా పెద్ద విషయం కాదు ఎన్నికలు ముఖ్యం అని నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా వ్యాప్తికి కారణం అయిన జగన్ గారికి ఎం శిక్ష వెయ్యాలని ఆయన ప్రశ్నించారు. జగన్ అసమర్ధత వలన కరోనా పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు కూడా కరోనా భారిన పడుతున్నారని, అనంతపురం జిల్లాలో ఇద్దరు డాక్టర్లు,ఇద్దరు వైద్య సిబ్బందికి కరోనా సోకిందని, డాక్టర్లు విధులు బహిష్కరించే పరిస్థితి వచ్చిందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.