నారా లోకేష్‌కి డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష
posted on Feb 15, 2015 8:24AM
హైదరాబాద్ పోలీసులు ఇటీవలి కాలంలో భారీ స్థాయిలో డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖుల పుత్రరత్నాలు, పుత్రికారత్నాలు దొరికిపోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్‌కు ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. లోకేష్ తన కారును డ్రైవ్ చేసుకుంటూ జూబిలీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి ఇంటికి వెళ్తుండగా రాత్రి పదకొండున్నర ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఆయన కారును ఆపారు. పోలీసులు లోకేష్‌ని చూసి డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పగా లోకేష్ కారులోంచి కిందకి దిగి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు చేసుకోవచ్చని చెప్పారు. పోలీసులు పరీక్షించినప్పుడు ఆయన మద్యం సేవించి లేరని తెలిసింది. లోకేష్ తిరిగి కారులో వెళ్ళిపోతుండగా, తమకు సహకరించినందుకు పోలీసు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.