జగన్‌రెడ్డి అమూల్ బేబీ.. ధూళిపాళ్లకు లోకేష్ పరామర్శ..
posted on May 26, 2021 @ 12:39PM
సీఎం జగన్‌రెడ్డి ఓ అమూల్ బేబీ అంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమూల్ డైయిరీ కోసం ప్రజా ధనం ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో డైయిరీలన్నీ గుజరాత్‌కు కట్టబెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు లోకేశ్.
బెయిల్‌పై విడుదలైన ధూళిపాళ్ల నరేంద్రను లోకేశ్ పరామర్శించారు. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటో జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పాడి రైతులకు రూ.4 ఎక్కువ ఇవ్వటం తప్పా? ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందించటం తప్పా? అని ప్రశ్నించారు.
దశాబ్దాల నుంచి రైతు ప్రయోజనాల కోసం పని చేస్తున్న సంగం డెయిరీపై కక్ష సాధింపు దుర్మార్గమన్నారు లోకేశ్. అమరావతిలో లేని ఇన్సైడర్ ట్రేడింగ్ కుట్రను.. స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా నరేంద్ర బయటపెట్టారని.. అందుకే ఆయనపై కక్ష కట్టారని నారా లోకేశ్ మండిపడ్డారు.
ప్రజలు చనిపోతుంటే పట్టించుకోని దద్దమ్మ.. కక్ష సాధింపు చర్యలకు మాత్రం ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పెట్టిన అక్రమ కేసుల లిస్టును లోకేష్ చదివి వినిపించారు. సీఎం జగన్‌రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.