తారకరత్న కన్నుమూత
posted on Feb 18, 2023 @ 9:03PM
నందమూరి తారకరత్న కన్నుమూశారు. గత 22 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. దీంతో నందమూరి ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తారకరత్న కోలుకుంటున్నారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన శనివారం సాయంత్రం కన్నుమూశారు. శనివారం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.
గత నెల 27న నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో ప్రరంభ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.
వెంటనే తారకరత్నను కుప్పం ఆస్ప్రత్రికి తరలించి చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగుళూరుని నారాయణ హృదయాలయకు తరలించారు. తారకరత్నని కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలుగా ప్రయత్నించారు.విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం కూడా వచ్చింది. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దిగ్గజ నటుడు సీనియర్ ఎన్టీఆర్ మనువడైన తారకరత్న 1983లో హైదరాబాద్ లో జన్మించారు. నటుడిగా 2002లో వచ్చిన ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత యువరత్న , భద్రాది రాముడు , అమరావతి , తదితర చిత్రాలలో నటించారు.
ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీలోనే చేరి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఈ ఉదయం నుంచే నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉం సమాచారం అందుకున్న ఆయన కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నారు. చివరి నిముషం వరకూ ఆయనను కాపాడడానికి వైద్యులు ప్రయత్నించారు. నిన్న కూడా తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందనీ, చికిత్సకు స్పందిస్తున్నారనీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించి ఈ సాయంత్రం కన్నుమూశారు.