నాదెండ్ల వ్యూహం.. చంద్రబాబు చాణక్యం.. తెనాలిలో గెలుపు ఖాయమే!
posted on Mar 15, 2024 @ 11:54AM
ఆంధ్రా ప్యారీస్ తెనాలి లో రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్న మొన్నటి వరకు తెనాలి రాజకీయాలు తెలుగుదేశం - వైసిపి మధ్యే నడిచేవి. ఐతే టీడీపీ కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పోటీకి దిగారు. ఇక్కడ వైసీపీ - జనసేన మధ్య ముఖాముఖి పోరు జరుగబోతోంది.
అయితే విజయం ఎవర్ని వరించబోతోంది?
రాష్ట్ర రాజకీయాలలో తెనాలి ది ప్రత్యేక మైన స్థానం. ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. అభ్యర్థల్ని చూస్తే ముగ్గురు కూడా రాజకీయ వారసులే. నాదండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రిగా, అన్నబత్తుని సత్యనారాయణ మంత్రిగా, ఆలపాటి వెంకట్రామయ్య చౌదరి మంత్రిగా పనిచేశారు. వారి వారసుల ఆధిపత్యమే తెనాలిలో నడుస్తోంది.
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు స్థానికంగా పట్టుంది. గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా గుర్తింపు పొందారు. వివాద రహితుడిగా.. మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే
తండ్రి భాస్కరరావు మాదిరిగా దూకుడు వ్యవహరించరు.
ప్రస్తుతం జనసేన రాజకీయ వ్యవహారాల చైర్మన్‌గా ఉన్నారు. ఎలాంటి దూకుడుకు ప్రదర్శించకుండా కేవలం ప్రెస్‌నోట్లు విడుదల చేయడానికే పరిమితం అయ్యారని పార్టీలో చెప్పుకుంటారు.
నాదెండ్ల మనోహర్‌కు ఉన్న ప్లస్‌పాయింట్‌లు ఏమిటంటే
గ్రామీణ తెనాలిలో కాపు ఓట్లు ఎక్కువగానే వున్నాయి.
ఆ ఓట్లు అన్నీ జనసేన ఖాతాలో పడుతాయనే అంచనా వుంది.
అలాగే బిజెపితో పొత్తు వుండటం వల్ల వైశ్యాస్, బ్రాహ్మణుల ఓట్లు ముకుమ్ముడిగా ట్రాన్సఫర్ అయ్యే అవకాశం వుంది.
తెనాలి సిటీలో వైశ్యాస్ ఓట్లు ఎక్కువ.
సిట్టింగ్ ఎమ్మెల్యే శివను మార్చి వేరే కమ్యూనిటీకి ఇస్తే
కమ్మ ఓట్లు అన్నీ గంపగుత్తగా నాదెండ్ల మనోహర్‌కే పడుతాయి.
సిట్టింగ్‌ను మార్చకుండా శివకే టికెట్ లభిస్తే కమ్మ ఓట్లు కొంత చీలుతాయి.
అభివృద్ధి పనులు కానీ, రోడ్లు వేయడం కానీ నాదెండ్ల మనోహర్ టైం లోనే జరిగింది.
వాస్తవానికి చూస్తే గత 10 ఏళ్ళుగా తెనాలిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదనే ఫీలింగ్ ప్రజల్లో వుంది.
ఇక ఆలపాటి అనుచరుల సహకారం వుంది కాబట్టి ఈజీగా గెలుపు సాధ్యం అవుతుంది.
2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 76,846 + జనసేనకు వచ్చిన ఓట్లు 29,905 = 1.06,751 ఓట్లు అవుతాయి. ఇదే రిపీట్ అవుతుందనే ధీమా నాదెండ్ల మనోహర్‌లో కనిపిస్తోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమిటంటే...
తన సామాజిక వర్గం ఓట్లతో పాటు ముస్లింలు, ఎస్సీ ఎస్టీ ఓట్లపైన ఆయన ఆశలు పెట్టుకున్నారు.
1800 కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశాను. అవి ఓట్ల రూపంలో మారుతాయనే ధీమాతో ఉన్నారు.
ఏపీని కుదిపేస్తున్న గీతాంజలి ఆత్మహత్య కేసును తనకు అనుకూలంగా వుంది.
అభివృధి, కొత్తగా రోడ్లు వేయడం ఎక్కడా కనిపించదు.
అయితే సంక్షేమ పథకాలే గెలుపిస్తాయనే ధీమాతో ఉన్నారు.
గత ఎన్నికల్లో శివకు వచ్చిన ఓట్లు = 94,495 ఓట్లు
గత ఎన్నికల్లో వైసీపీకి పడిన ఓట్లు మళ్ళీ ఈ ఎన్నికల్లో పడినా గెలవడం కష్టమే. టీడీపీ కూటమి దెబ్బకు శివ అవుట్ అవుతారా అనే చర్చ అయితే స్థానికంగా జరుగుతోంది.
మొత్తం పోలింగ్ బూత్‌లు 266
2019 ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లుః 78.24%
ఆ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 45.92%.
తెలుగుదేశం పార్టీకి 37.35% ఓట్లు వచ్చాయి.
ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్ ఇలా వుంది.
అన్నాబత్తుని శివకుమార్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అలపాటి రాజేంద్రప్రసాద్ పై 17649 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ముప్పై వేల స్థాయి ఓట్లను పొందారు.
2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ 15 వేల ఓట్లను సాధించారు. అప్పుడు టీడీపీ తరఫున ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలిచారు.
ఇప్పుడు కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తున్నారు.
2004, 2009లో కాంగ్రెస్ నుంచి నాదెండ్ల మనోహర్ గెలిచి డిప్యూటీ స్పీకర్ గా, స్పీకర్ గా పనిచేశారు.
1989లో మనోహర్ తండ్రి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి నెగ్గారు.
ప్రస్తుత ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తండ్రి సత్యనారాయణ రెండు పర్యాయాలు అంటే
1983లో స్వతంత్ర అభ్యర్థిగా,
1985లో టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దొడ్డపనేని ఇందిరపై విజయం సాధించారు.
బీజేపీ మూడవ సారి గెలుపు దిశగా పయనిస్తున్న నేపథ్యంలో టీడీపీ కూటమికి బీజేపీ వేవ్ కూడా కలిసి రానుంది.