నడ్డాకు సమాధి...ఫ్లోరోసిస్ బాధితుల పనా?
posted on Oct 21, 2022 @ 12:26PM
ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తం చేయడం కూడా ఇటీవలి కాలంలో అర్ధరహితంగా, చాలా దారుణంగా మారిం దనడానికి ఉదాహరణే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గుర్తుతెలియని వ్యక్తులు సమాధి కట్టడం. అయితే ఈ చర్య వెనుక రాజకీయ కారణాల కంటే ఆ ప్రాంతం లో ఫ్లోరోసిస్ బాధితులు తమ సమస్యను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, బీజేపీ హామీని నిలబెట్టుకోలేదన్న ఆక్రోశమే ఆక్రోశమే ప్రధాన కారణమై ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారు జాతీయ రహదారి పక్కన ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రానికి కేటాయించిన స్థలంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఫ్లోరైడ్ పరిశో ధనా కేంద్రాన్ని పశ్చిమ బెంగాల్‌కు తరలించడానికి నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానా లు న్నాయి. ఫ్లోరైడ్ కేంద్రానికి కేటాయించిన స్థలానికి వెళ్లే దారిలో మట్టితో సమాధి కట్టారు. దానిపై జేపీ నడ్డా ఫ్లెక్సీ పెట్టారు. అక్కడే ‘రీజినల్ ఫ్లోరైడ్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్’ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం సమాధిని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీ సులు అక్కడికి చేరుకొని సమాధిని తొలగించారు. దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
కాగా , రాష్ట్రంలోని 1,041 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు కేంద్రం 2017లో రూ.700కోట్లు, అంతకుముందు ఏడా ది నీతి ఆయోగ్ ద్వారా రూ.95కోట్లు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ఒక సీఎం ఒక గ్రామానికి ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉండటం ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్ప డుతున్నారని, తెలంగాణను కల్వకుంట్ల మాఫియా రాజ్యంగా మారుస్తున్నారని ఆయన మండి పడ్డారు.
2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా 2016 ఫిబ్రవరి 9న మర్రిగూడ మండలంలో పర్యటించారు. పరిశోధన కేంద్రం నిర్మాణం నత్తనడకన సాగుతుం డటంపై ఫ్లోరోసిస్ బాధితులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. అయితే, పరిశోధన కేంద్రం పనులు ప్రారంభం కాక పోగా దానిని పశ్చిమ బెంగాల్‌కు తరలిస్తూ అప్పటి కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. దీనిని నిరసిస్తూ బాధితులు ఆందోళనలు చేసినా ఫలితం లేదు. అప్పటి నుంచి ఈ భూమి నేష నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పేరుతో నిరుపయోగంగా ఉంది. కాగా, మునుగోడు ఉప ఎన్నికతో పరిశోధన కేంద్రం మళ్లీ తెరపైకి వచ్చింది.