బాలికను అత్యాచారం చేసిన నటుడు..
posted on Jun 6, 2021 @ 12:08PM
దొంగ ల*జ కొడుకులసలే మెసిలే ఈ దుర్ధా లోకం లో తల వంచుకు వెళ్లిపోయావా నేస్తం..ఈ లోకాని వదిలి.. అన్న మాటలు శ్రీ శ్రీ మహా ప్రస్థానం చదివితే మీకు అర్థం అవుతుంది. ఆ శ్రీ శ్రీ ఎందుకు అలా రాశాడో.. తన కవిత్వం లోని అంతరంగం ఏంటో మహా ప్రస్థానం చదివితే తెలుస్తుంది.. అయితే ఇప్పుడు మనం చదివే ఆ వార్తకి.. పైన చెప్పిన శ్రీ శ్రీ కవిత్వానికి చిన్న లింక్ ఉంది.. అదేంటో చూద్దాం..
నేటి సమాజంలో మహిళలకు పురుషుడి తో దక్కే గౌరవం ఒకవైపు.. ఇదే సమాజంలో అదే మహిళలపై అత్యాచారాలు, అరాచకాలు, అణిచివేతలు మరోవైపు. ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు రోజు వేయిలలో మహిళలపై, చివరికి బాలికపై నిత్యం దాడులు అరాచకాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు.. కొంత మంది నీచులు అదేపనిగా మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య భారత దేశంలో, తప్పులు చేసిన వాడిని తగలబెట్టడం బోయి.. వాడిని తలెత్తుకునేలా చేస్తున్నాయి ఈ చట్టాలు. తాజాగా ఒక నటుడు ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. అతడు ఓ బుల్లితెర నటుడు, అతని పేరు పెర్ల్ వ్ పూరిని శనివారం ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు.
నాగిని-3’ ధారావాహికతో ప్రేక్షకాదరణ పొందిన పెర్ల్ వ్ పూరి.. సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఇటీవల ఓ బాలిక వసై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కాగా, ఈ విషయం గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు. పాతది. తాజాగా బాధితురాలు.. నటుడిపై ఫిర్యాదు చేసింది. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెర్ల్ వ్ పూరిపై ఐపీసీ 376, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశాం’ అని తెలిపారు.
మరోవైపు ‘నాగిని-3’లో పెర్ల్‌వ్ పూరికి సహనటిగా పనిచేసిన అనిత.. ఈ ఘటనపై స్పందించారు. పెర్ల్ అలాంటి వ్యక్తి కాదని తెలిపారు. ‘నాకు ఎంతోకాలం నుంచి పరిచయమున్న పెర్ల్ వి పూరి గురించి వచ్చిన వార్తలు విని షాక్ అయ్యాను. ఇది నిజం కాకపోయి ఉండొచ్చు. పెర్ల్ చాలా మంచి వ్యక్తి. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నాను’ అని ఆమె తెలిపారు.