The Mystical Mustard Seeds!!

 

The mustard seeds are the tiny black, brown or even white ball like seeds. Mustard seeds, also known as ‘Sarso‘ or ‘Rai‘ in Hindi, ‘Kadugu‘ in Tamil and Malayalam, ‘Avalu‘ in Telugu, ‘Rai‘ in Gujarati, ‘Shorshe‘ in Bengali, ‘Mohori‘ in Marathi and ‘Rai‘ in Punjabi. They have a great taste and are added in various cuisines. Apart from adding depth and taste to a dish, it has very many benefits.

These little things have compound like glucosinolates and mirosinase, which are known to compel the phytochemicals in inhibiting the growth of cancer. Mustard is also a store-house of magnesium, iron, copper and selenium. Mustard is also known to enhance the omega-3 fatty acids in the fish, these are essential fatty acids. Owing to the magnesium and selenium found in selenium are known to soothe the sore muscles and sore joints, especially those suffering from rheumatic arthritis. 

The magnesium content of these mustard seed significantly brings down the incidence of migraine attacks. They also have disease-fighting properties due to the presence of sulphur, and relieve the respiratory congestion. The presence of minerals like copper, magnesium, iron and selenium in it are responsible for the prevention of Asthma Attacks. Though they are tiny, yet are good sources of dietary fibre, which improves the bowels movements and aids in digestion.

Apart from health, they also play a role in maintaining your skin and locks. It can be used along with essence oil for exfoliating the dead skin, and are abundant in vitamin A &D and other antioxidants which stall the ageing process. Mustard is great promoters of hair growth also it strengthens and conditions the weakened and damaged hair. 


-Koya Satyasri

తిప్పతీగ.. ఇలా వాడి చూడండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!

తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్ లాంటివి కొనడం చేస్తుంటారు. అయితే తిప్పతీగను సరైన విధానంలో వాడటం ద్వారా చాలా రకాల ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అసలు తిప్పతీగలో ఉండే పోషకాలు ఏంటి? ఇది ఏ వ్యాధులకు ప్రయోజనకరంగా ఉంటుంది?తెలుసుకుంటే.. తిప్పతీగలో ఉండే పోషకాలు.. తిప్పతీగలో కాల్షియం,  భాస్వరం,  ఐరన్,  రాగి, మాంగనీస్,  జింక్, విటమిన్-సి,  బీటా-కెరోటిన్, ప్రోటీన్,  ఫైబర్,  కార్బోహేడ్రేట్లు, కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు అన్నీ ఉంటాయి. తిప్పతీగ ప్రయోజనాలు.. రక్తహీనత.. మహిళలలో రక్త హీనత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తిప్పతీగను తీసుకుంటే చాలా మంచి బెనిపిట్స్ ఉంటాయి.   తిప్పతీగలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది.  ఇది రక్త  నష్టాన్ని భర్తీ చేయడంలో సహాయపడుతుంది.   రోగనిరోధక శక్తి.. శీతాకాలంలో రోగనిరోధక శక్తి బాగా బలహీనం అవుతుంది. రోగనిరోధక శక్తి తిరిగి బలంగా మారడానికి, శీతాకాలపు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి రోజూ తిప్పతీగ తీసుకుంటే చాలా మంచిది.  తిప్పతీగ లోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని బలపరచడంలో సహాయపడుతుంది. పొట్ట సమస్యలు.. పొట్ట సమస్యలతో ఇబ్బంది పడేవారు తిప్పతీగ వాడితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. తిప్పతీగలో ఫైబర్ కంటెంట్ మెరుగ్గా ఉంటుంది.  ఇది పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.  రోజూ తిప్ప తీగ తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులోనే స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఎముకలు.. తిప్పతీగలో కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది.  ఇది ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది.  అందుకే ప్రతి రోజూ తిప్పతీగ తీసుకుంటే కాల్షియం మెరుగ్గా అందుతుంది.  ఎముకలు బలంగా మారతాయి. తిప్పతీగతో జాగ్రత్త.. తిప్పతీగ తినడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఏదైనా మితంగా తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది.  అలాగే తిప్పతీగ కూడా పరిమితంగా తీసుకోవాలి. ఎక్కువ తిప్ప తీగ తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలకు బదులు ఆరోగ్యానికి హాని ఎదురవుతుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

సయాటికా నొప్పి ఎందుకు వస్తుంది... ఎలా వస్తుంది తెలుసా?

శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి. వీటిని శరీరమే మెల్లిగా నయం చేసుకుంటుంది.  కానీ కొన్ని నొప్పులు శరీరాన్ని చాలా ఇబ్బంది పెడతాయి.  ఎక్కువకాలం అలాగే ఉండటం, రోజు వారి చేసుకునే పనులకు ఇబ్బంది కలిగించడం వంటివి జరుగుతాయి.  ఇలాంటి వాటిలో సయాటికా నొప్పి కూడా ప్రధానమైనది. సయాటికా నొప్పి నడుము నుండి పాదాల వరకు చాలా విపరీతంగా ఉంటుంది.  ఇది కూర్చోవడం,  నిలుచోవడం, నడవడం.. ఇలా అన్ని విషయాలలోనూ ఇబ్బంది పెడుతుంది. అసలు సయాటికా నొప్పి ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది.. తెలుసుకుంటే.. సయాటికా..  సయాటికా లక్షణాలలో నడుము నుండి పాదాల వరకు నొప్పి ఉంటుంది. ఇది ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటుంది. మన శరీరంలో అతి పొడవైన నాడి అయిన సయాటిక్ నాడి వాపు లేదా కుదించబడి నొప్పిని కలిగించినప్పుడు సయాటికా నొప్పి వస్తుంది. దీనిని చాలా మంది పట్టించుకోనట్టు నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఇది  చాలా ప్రమాదకరం.  దీన్ని ముందుగానే గుర్తించగలిగే ట్రీ ట్మెంట్ ద్వారా దీన్ని చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు.  లేదంటే తీవ్రంగా మారి చాలా ఇబ్బంది పెడుతుంది. సయాటికా నొప్పి ఎలా వస్తుంది.. మన శరీరంలో అతి పొడవైన నాడి  సయాటిక్ నాడి.  ఈ నాడి  వాపు లేదా కుదించబడినప్పుడు సయాటికా నొప్పి మొదలవుతుంది. సయాటిక్ నాడి మన వెన్నెముక బేస్ వద్ద మొదలై, కలిసిపోయినప్పుడు మందంగా మారే ఐదు వేర్వేరు నరాల మూలాల కలయిక ద్వారా ఏర్పడుతుంది. ఇవి  మన శరీరం  రెండు వైపులా నడుస్తాయి. మన వెన్నెముక బేస్ నుండి మన తుంటి ద్వారా మన కాళ్ళ వెనుక వరకు విస్తరించి ఉంటాయి. సయాటికా నొప్పి లక్షణాలు.. సయాటికా నొప్పి సాధారణంగా శరీరంలోని ఒక ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా కాళ్ళు,  వీపు ప్రాంతాలలో  నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. కొంతమందిలో ఈ  నొప్పి గట్టిగా తగిలే  విద్యుత్ షాక్ లాగా అనిపిస్తుంది. కాళ్ళలో తిమ్మిరి,  బలహీనత కూడా  ఉంటుంది. సయాటికా నొప్పికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి హెర్నియేటెడ్ డిస్క్. గాయం లేదా ఒత్తిడి కారణంగా వెన్నెముకలోని అనేక డిస్క్‌లలో ఒకటి  పగిలిపోయినప్పుడు ఇది వస్తుంది. దీనివల్ల డిస్క్ లోపల ద్రవం బయటకు లీక్ అవుతుంది. దీని వల్ల హెర్నియేటెడ్ డిస్క్ ఏర్పడుతుంది. ఇది వెన్నుపాము, దాని నరాలపై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల నొప్పి,  బలహీనత ఏర్పడుతుంది. సయాటికా నొప్పికి ఒక సాధారణ కారణం వెన్నెముక కింది భాగంలో గాయం కావడం.  ప్రమాదంలో గాయపడి, ఆ గాయం వెన్నెముక కింది భాగంలో ప్రభావం చూపినప్పుడు సయాటికా నొప్పి రావచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ కూడా సయాటికా నొప్పికి కారణం అవుతుంది.  మన కీళ్లలో కార్టిలేజ్ అనే మృదువైన పొర ఉంటుంది. ఇది ఎముకలు ఒకదానికొకటి రుద్దకుండా కాపాడుతుంది. ఈ పొర క్షీణించడం లేదా బలహీనపడటం మొదలైనప్పుడు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతాయి. సాధారణంగా ఆర్థరైటిస్ అని పిలువబడే ఆస్టియో ఆర్థరైటిస్‌ను ఆర్థరైటిస్ అని కూడా అంటారు.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

బాదం పప్పు తినే వారికి అలర్ట్.. ఈ నిజాలు తెలుసుకోకుండా తినకండి..!

డ్రై ప్రూట్స్ కోవలో చాలామంది తమకు తెలియకుండానే నట్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో బాదం,  వాల్నట్ వంటివి ప్రధానంగా ఉంటాయి.  ఇవి  ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవని అనుకుంటారు. చాలా రకాల వ్యాధులు రాకుండా చేయడంలో ఈ  డ్రై నట్స్ చాలా సహాయపడతాయి.   బాదం పప్పులు అటువంటి డ్రై నట్స్ లో ఒకటి. బాదం పప్పులు శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందించే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు,  ఫైబర్ వంటివి కలిగి ఉంటాయి.  ప్రతిరోజూ రాత్రి బాదం పప్పులు నీటిలో నానబెట్టుకుని వాటిని ఉదయాన్నే  తినేవారు అధికంగా ఉంటున్నారు. అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని  రోజూ అధికంగా బాదం పప్పు తినేవారు కొందరు ఉంటారు.  అసలు బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం?  ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే.. బాదం తో ఆరోగ్యం.. బాదం అధికంగా తినడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.   కొంతమందిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను కూడా కలిగిస్తుందని కూడా చెబుతున్నారు. ఇది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులపై  ప్రతికూల ప్రభావాలను చూపుతుందట. కాబట్టి బాదం పప్పులు ఎన్ని తీసుకోవాలి అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. బాదం పప్పుతో నష్టాలు.. బాదం పప్పును అధికంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, బరువు పెరగడం,  మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు వస్తాయి. రోజువారీ సిఫార్సు చేయబడిన బాదం పప్పు తీసుకోవడం వ్యక్తిగత ఆరోగ్యాన్ని బట్టి మారుతుంది. అయితే వీటిని తక్కువగానే తీసుకోవాలి. బాదం పప్పును అధికంగా తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు కనుగొన్నారు. బాదం పప్పులో కరిగే ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఈ సమ్మేళనం అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల వైఫల్యం,  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అందువల్ల బాదం పప్పును అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బాదం ఎక్కువగా తినేవారికి  బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. సాధారణ ఆహారంతో పాటు పెద్ద మొత్తంలో బాదం (20 కంటే ఎక్కువ) తీసుకుంటే, అదనపు కేలరీలు చేరి వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. బరువు పెరగడం వల్ల శరీరంలో అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఫైబర్  ఎక్కువ ఉండటం వల్ల ఇతర ఖనిజాలైన కాల్షియం, మెగ్నీషియం, జింక్,  ఐరన్  వంటి ఖనిజాల  శోషణకు ఆటంకం కలిగిస్తుంది.  బాదంను పెద్ద మొత్తంలో తీసుకుంటే అది శరీరంలోని ఇతర పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. దీని కారణంగా అలసట, బలహీనత,  అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. -రూపశ్రీ

కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసా?

ల్యాప్ టాప్  వాడకం ప్రస్తుతం జనరేషన్ లో చేసే ఉద్యోగాలలో సర్వసాధారణం అయిపోయింది.   కార్పొరేట్ ఉద్యోగాల నుండి సాధారణ ఆఫీసుల వరకు ప్రతి ఒక చోట కంప్యూటర్ వాడకం తప్పనిసరిగా మారిపోయింది.  అలాగే ఇటీవలి కాలంలో వర్క్ ఫ్రం హోం కూడా ఎక్కువ అయ్యింది. దీంతో  సౌలభ్యం కోసం లాప్ టాప్ వినియోగించడానికి అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. అయితే  లాప్ టాప్  ఎక్కువగా వినియోగించేవారిలో  కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనే సమస్య వస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ లో ఉండే లక్షణాలు ఏంటి? ఇది ఎంత వరకు ప్రమాదం? దీన్ని ఎలా నివారించాలి?  అంటే..   కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది  ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు,  స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి  చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం,  వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం,  రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం,  పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.   ఎప్పుడూ  కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌తో పని చేయడం వల్ల    మెడ కండరాలు,  మణికట్టు నరాలపై ఒత్తిడి పడుతుంది. రోజంతా టైప్ చేయడం వల్ల కలిగే ఒత్తిడి కార్పల్ టన్నెల్‌లోని కణజాల వాపు,  మధ్యస్థ నాడి కుదింపునకు కారణమవుతుంది. ఆఫీసులో పనిచేయడం మాత్రమే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌కు కారణం కాదు,  వయస్సు,  జన్యుశాస్త్రం కూడా పాత్ర పోషిస్తాయి.  కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  ఎర్గోనామిక్‌గా రూపొందించబడిన కంప్యూటర్ మౌస్ కార్పల్ టన్నెల్‌లోని నరాలపై ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పని చేస్తున్నప్పుడు మౌస్  మణికట్టుపై ఒత్తిడి పెట్టకుండా చూసుకోవాలి. అలాగే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ మీద వంగి పని చేయడం వల్ల మెడ,  వీపుపై  ఒత్తిడి పడుతుంది.  ఇది మీ చేతులు,  మణికట్టును ప్రభావితం చేస్తుంది. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌ను నివారించడానికి, లాప్ టాప్ పై పని చేసేటప్పుడు కూర్చునే   భంగిమపై  శ్రద్ధ వహించాలి. ఇక మణికట్టు ఆరోగ్యంగా ఉండాలంటే  సరైన టైపింగ్ పొజిషన్  చాలా ముఖ్యం.  మణికట్టును ఎక్కువగా పైకి లేదా క్రిందికి వంచకుండా ఉండాలి.  కీబోర్డ్‌ను  మోచేతుల వద్ద లేదా కొద్దిగా క్రింద ఉంచడానికి ప్రయత్నించాలి. అదే విధంగా  కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌ను  ప్రతి గంటకు ఒకసారి  డెస్క్ నుండి లేవడం చాలా ముఖ్యం. బ్రేక్  సమయంలో  మణికట్టు,  చేతులను సాగదీయాలి. ఇది నరాల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆఫీసులో పనిచేయడం అంటే కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌ల గురించి మాత్రమే కాదు, చేతివ్రాత గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.  మంచి పట్టు ఉన్న పెద్ద పెన్నులను ఎంచుకోవాలి. మణికట్టు మీద ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి.  -రూపశ్రీ

ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగితే మ్యాజిక్కే!

భారతీయుల వంటింట్లో బోలెడు దినుసులు ఉంటాయి.  వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు మెరుగ్గా ఉంటాయి.  అటు మౌత్ ఫ్రెషనర్ గా, ఇటు వంటల్లో రుచిని పెంచడానికి ఉపయోగించే దినుసుల్లో సోంపు అగ్ర స్థానంలో ఉంటుంది.  సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు  వైద్యులు,  ఆహార నిపుణులు.  అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? సోంపు నీరు ఎలా తయారు చేసుకుని తాగాలి? ఇవన్నీ తెలుసుకుంటే సోంపుతో కలిగే బెనిఫిట్స్  ను అందరూ పొందవచ్చు. సోంపు నీటి ప్రాధాన్యత..  సోంపు నీటిని శక్తివంతమైన,  ఆరోగ్యకరమైన పానీయంగా ఉపయోగిస్తున్నారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  తరచుగా సోంపును మౌత్ ఫ్రెషనర్‌గా మాత్రమే ఉపయోగిస్తుంటారు.  కానీ సోంపు దీని కంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక వ్యాధులను నయం చేయడంలో శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది. సోంపు నీరు ఎలా తయారు చేయాలి? సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది కడుపు సంబంధిత వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది,  జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. సోంపు నీరు ప్రయోజనాలు..  ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నీటిని తాగితే, శరీరంలో అనేక సానుకూల మార్పులు కలుగుతాయి. సోంపు నీరు బరువు తగ్గడానికి  సహాయపడుతుంది.  ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. సోంపు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు సంబంద వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది యాసిడ్ కారణంగా  ఏర్పడే ఎసిడిటీ,  యాసిడ్ రిప్లక్స్ వంటి ఉదర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కడుపు చికాకును తగ్గిస్తుంది,  కడుపును మంటను తగ్గించి కడుపును శాంతపరుస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కుంటున్న అతి ఆకలి సమస్యకు సోంపు చెక్ పెడుతుందట.   కడుపు నిండినప్పటికీ పదే పదే  ఆహారం  తినాలని అనిపించడం, ఆకలి వేయడం వంటి లక్షణాలు ఆరోగ్యానికి హానికరం. సోంపు నీరు తాగడం వల్ల అనవసరంగా అతిగా ఆకలి వేయడం అనే సమస్య తగ్గుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే సొంపు నీరు తాగడం వల్ల  శరీరం డిటాక్స్ అవుతుంది.  ఇది  కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులు,  సమస్యలను తగ్గిస్తుంది. సోంపు నీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే సోంపులో ఉండే పొటాషియం,  మెగ్నీషియం వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. సొంపు నీరు మహిళలకు ఋతుస్రావ సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.  పాలిచ్చే స్త్రీలలో పాలు పెరగడానికి కూడా సహాయపడుతుంది. -రూప

శీతాకాలంలో ఉసిరికాయతో ఈ కాంబినేషన్లు ట్రై చేయండి.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!

ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి.  అలాంటి వాటిలో ఉసిరి కాయ ప్రధానమైనది.  ఉసిరికాయను ఆయుర్వేదం అమృత ఫలం అని అంటుంది. ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది,  జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.  శీతాకాలంలో ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం జలుబు, దగ్గు,  ఫ్లూ వంచివి దరిచేరవు. కేవలం సీజనల్ ఇన్పెక్షన్లు నివారించడమే కాదు.. ఫ్యాట్ బర్నర్ గా కూడా సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిని మెరుగుపరుస్తుంది,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. విటమిన్ స,  యాంటీఆక్సిడెంట్లు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయి.   ధమనులలో ఫలకం పేరుకుపోకుండా ఉండటానికి , ధమనులలో ఫలకం సమస్య తగ్గించడానికి సహాయపడుతుంది.  కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను కూడా తగ్గిస్తుంది.  మొత్తం రోగనిరోధక శక్తి,  హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరిని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. కానీ శీతాకాలంలో ఉసిరికాయలు సమృద్దిగా దొరుకుతాయి.  ఉసిరికాయలను కొన్ని కాంబినేషన్లలో తీసుకుంటే ఇమ్యూనిటీ మరింత పెరుగుతుంది. ఇంతకూ ఉసిరికాయతో బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసుకుంటే.. ఉసిరి-తేనె.. తేనె కాంబినేషన్ లో  ఉసిరి తీసుకుంటే ఉసిరిలో ఉండే విపరీతమైన పులుపు, వగరు రుచి తగ్గుతుంది. పైగా బోలెడు    ప్రయోజనాలను కూడా అందిస్తుంది.  ఉసిరి ఇమ్యూనిటీని పెంచుతుంది., మరోవైపు తేనె గొంతు సమస్యలు తగ్గిస్తుంది. గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.   శరీరానికి శక్తిని అందిస్తుంది. తేనె-ఉసిరి కాంబినేషన్ ఇన్ఫెక్షన్లతో  పోరాడటానికి సహాయపడుతుంది, మంటను తగ్గిస్తుంది,  శ్వాసకోశ ఆరోగ్యానికి సపోర్ట్  ఇస్తుంది. ఎలా తినాలి.. టీస్పూన్ ఉసిరి పొడి లేదా తాజా ఉసిరి రసం 1 టీస్పూన్ తీసుకోవాలి.  దీన్ని సమాన పరిమాణంలో  తేనెతో ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఉసిరి-పసుపు.. ఉసిరిలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.   పసుపులో  కర్కుమిన్ ఉంటుంది. ఇవి రెండు  కలిసినప్పుడు రోగనిరోధక శక్తి సూపర్ గా  పెరుగుతుంది, మంటను తగ్గిస్తుంది,  శరీరాన్ని  డిటాక్స్  చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, తెల్ల రక్త కణాల పనితీరును పెంచడానికి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని సహాయపడతుంది ఎలా తీసుకోవాలి.. స్పూన్ ఉసిరి రసాన్ని గ్లాసు  నీటిలో వేసి అందులో కాసింత మంచి పసుపును కలిపి తాగాలి. లేదంటే ఒక ఉసిరికాయ,  ఒక  ఒక ఇంచ్ తాజా పచ్చి పసుపును మిక్సీ వేసి జ్యూస్ చేసుకుని తాగాలి. ఇందులో కాసింత కరివేపాకు కూడా వేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు. అలాగే క్యారెట్ లాంటివి వేసుకోవచ్చు. ఉసిరి-అల్లం..  అల్లంను ఉసిరితో కలపి తీసుకున్నా ఇమ్యూనిటీ మెరుగవుతుంది.  అల్లం శరీరంలో వేడిని  పెంచుతుంది. ఉసిరి  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరరానికి వేడిని అందించడం ద్వారా  అల్లం రక్త  ప్రసరణను పెంచుతుంది,  ఇన్ప్లమేషన్లతో పోరాడుతుంది.   ఉసిరిలో ఉండే  విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్ల కంటెంట్ శరీర సహజ రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి.. 2 టేబుల్ స్పూన్ల తాజా ఉసిరి రసాన్ని 1/2 టీస్పూన్ తురిమిన అల్లం రసం తీసుకోవాలి. వీటిని  1/2 కప్పు నీటితో కలిపి తీసుకోవచ్చు. కొన్ని చుక్కల తేనె జోడిస్తే మరీ మంచిది. దీన్ని  ఉదయాన్నే తీసుకోవాలి. ఉసిరి-బెల్లం.. ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకోవచ్చు.  ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా మెరుగైన ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది.  ఉసిరి-బెల్లం కలిపి మురబ్బా తయారు  చేసుకోవచ్చు.ఈ కాంబో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఐరన్  శోషణను పెంచుతుంది.  శరీరానికి  వెచ్చదనాన్ని అందిస్తుంది. ఎలా తీసుకోవాలి.. ఉసిరిని ఆవిరి పట్టి వాటిని విత్తనాలు తీసివేసి , ఆపై వాటిని బెల్లం సిరప్ లో ఉడికించి, ఉప్పు, మిరియాలు,  జీలకర్ర పొడితో కలిపి తీసుకోవాలి.  చాలా మంచి ఇమ్యునిటీ ఇస్తుంది.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వాల్నట్స్ తింటే ఈ వ్యాధులు అన్నీ మాయం..!

ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి.  ధర కాస్త ఎక్కువ అనే కారణంగా సాధారణ ప్రజలు వాల్నట్స్ కు దూరంగా ఉంటారు. అయితే వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా బెస్ట్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు సులువుగా నయం  అవుతాయని అంటున్నారు. ఇంతకూ వాల్నట్స్ ను తినడం వల్ల తగ్గే వ్యాధులు ఏంటి? వాల్నట్స్ లో ఉండే పోషకాలు ఏంటి? తెలుసుకుంటే.. వాల్నట్స్ లో పోషకాలు.. వాల్నట్స్ లో  అత్యంత ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి.  వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి.  వాల్నట్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. వాల్నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని చాలామంది చెబుతారు. అయితే ఇది మాత్రమే కాకుండా చాలా రకాల వ్యాధులు కూడా నయం అవుతాయి. గుండె ఆరోగ్యం.. వాల్నట్స్ ను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందట.  అంతేకాదు ఇది చెడు కోలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుందట. రక్తపోటు.. రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు రోజు వాల్నట్స్ ను తీసుకుంటూ ఉంటే చాలా మంచిది.  రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. బరువు.. బరువు తగ్గడానికి ట్రై చేసేవారు వాల్నట్స్ తింటే చాలా మేలు. వాల్నట్స్ లో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగకుండా నిరోధిస్తాయి. తర్వాత బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. మానసిక ఆరోగ్యం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటితో పాటు వాల్నట్స్ ను కూడా తింటూ ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది.  ఇది మెదడు పనితీరుకు అవసరమైన ఒమెగా-3 ఆమ్లాలను కలిగి ఉండటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.  అలాగే అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ.. జీర్ణవ్యవస్థ సరిగా లేకున్నా, జీర్ణాశయం పనితీరు మందగించినా చాలా సమస్యగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను సరిచేసి తిరిగి ఆరోగ్యంగా చేయడంలో వాల్నట్స్ కీలకపాత్ర పోషస్తాయి.  వాల్నట్స్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.  మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది. వాపులు, నొప్పులు.. వాల్నట్స్ లో ఉంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ల7ణాలు వాపులను, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.  ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

గ్యాస్ సమస్యను పెంచే స్నాక్స్.. సాయంత్రం 6గంటల తర్వాత వీటిని అస్సలు తినకూడదు..!

సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఇంట్లో కుదరక పోతే కనీసం బయట అయినా స్నాక్స్ లాగించేవారు ఉంటారు. అయితే కొన్ని రకాల స్నాక్స్ ను సాయంత్రం 6గంటల తర్వాత అస్సలు తినవద్దని చెబుతున్నారు ఆహార నిపుణులు.  దీని వల్ల గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుందని,  రాత్రంతా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండాల్సిందే అని అంటున్నారు. ఇంతకీ సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడని స్నాక్స్ ఏంటో తెలుసుకుంటే.. సాయంత్రం 6 గంటల తర్వాత కొన్ని స్నాక్స్ తినకూడదని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లు చెబుతున్నారు.  సమోసాలు, జిలేబీలు, పానీపురి, వడ పావ్, కచోరీలు, వేయించిన మోమోలు,  నామ్కీన్‌లను సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడదట. ఎక్కువ బటర్ తో కూడిన  బర్గర్‌లు, పావ్ భాజీలు కూడా సాయంత్రం 6 తరువాత తినకూడదని అంటున్నారు. పైన చెప్పుకున్న  ఆహారాలను అప్పుడప్పుడు తినడం వల్ల ఏమీ కాదని అనుకుంటారు. కానీ అప్పుడ్పుడు తినడం అనేది అలవాటు అయితే చాలా కష్టమట.  ఈ అలవాటు శరీరానికి ఎక్కువ కేలరీలు, కొవ్వు,  చక్కెరను ఇస్తాయి. ఇది బరువు పెరగడం, గ్యాస్, ఎసిడిటీ,  రక్తంలో  చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. వేయించిన ఆహారాలు,  టైప్ 2 డయాబెటిస్ మధ్య సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వేయించిన ఆహారాలు తినేవారిలో రక్తంలో చక్కెర నియంత్రణ తక్కువగా ఉంటుంది.  ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగే ప్రమాదం ఉంది. వేయించిన ఆహారాలు పేగు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తాయి, వాపును పెంచుతాయి.   ఆకలిని, షుగర్ క్రేవింగ్స్ ను నియంత్రించే హార్మోన్లు కూడా తగ్గుతాయి.  దీని వల్ల వీటిని పదేపదే తినాలని అనిపిస్తుంది. ఇది బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందట. కాబట్టి  పైన పేర్కొన్న ఆహారాలను అప్పుడప్పుడు తినడం కూడా కాస్త ఇబ్బందే. అలాగే కొన్ని ఆహారాలను 6 గంటల తర్వాత అస్సలు తినకూడదు కూడా.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

రోజూ బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తింటున్నారా?.. అయితే ఈ నిజం తెలుసుకోండి!

నేటికాలంలో ఆహారం పరంగా చాలా మార్పులు వచ్చాయి.  ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్   తప్పనిసరి. అయితే చాలా కుటుంబాలలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పిల్లలను స్కూలుకు పంపిస్తూ చాలా బీజీగా ఉంటారు. ఇలాంటి సమయంలో టిపిన్, వంట అన్నీ తీరికగా చేసే సమయం ఉండదు. ఇలాంటి వారిలో కొందరు బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్, శాండ్విచ్ వంటివి తీసుకుంటారు. దీని కోసం వైట్ బ్రెడ్,  బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు.  ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు.  అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. ప్రతిరోజూ బ్రెడ్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకునేవారిలో కొన్ని తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట.  ఇంతకీ అవేంటంటే?.. డయాబెటిస్ వైట్ బ్రెడ్ లో  గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. దీన్ని రోజూ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది . ఇది శరీర ఇన్సులిన్ సమతుల్యతను  దెబ్బతీస్తుంది. బరువు  బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి  బ్రెడ్  అతిపెద్ద శత్రువు. ఇందులో కేలరీలు,  కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, కానీ ఫైబర్ ఉండదు. దీన్ని తినడం వల్ల  త్వరగా కడుపు నిండదు. ఇది అతిగా తినడం వల్ల శరీరంలో  అధిక కొవ్వు పేరుకుపోతుంది. జీర్ణక్రియ  బ్రెడ్ ను మైదా పిండితో తయారు చేస్తారు. ఇది ప్రేగులలో జిగట పదార్థంగా పనిచేస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల ఇది  జీర్ణం కావడం చాలా కష్టం. రోజూ బ్రెడ్ తినడం వల్ల తరచుగా మలబద్ధకం,  ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. పోషకాలు గోధుమలలో ఉండే సహజ పోషకాలన్నీ తొలగిపోయాక మిగిలే పిండితో బ్రెడ్ తయారు చేస్తారు. ఈ పిండిలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇందులో చాలా తక్కువ విటమిన్లు, ఖనిజాలు,  ప్రోటీన్లు ఉంటాయి.  బ్రెడ్ తినడం ద్వారా  శరీరానికి కావలసిన పోషకాలు ఏవీ లభించవు.   ఈ కారణంగా బ్రెడ్ తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. గుండె ఆరోగ్యం మార్కెట్లలో అమ్మే  బ్రెడ్‌లు ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి చాలా ప్రిజర్వేటివ్‌లు,  ఉప్పు  వేసి తయారు చేస్తారు. వీటిలో  అధిక సోడియం ఉంటుంది. ఇది రక్తపోటు పెంచుతుంది.  ఎక్కువ కాలం బ్రెడ్ ను కంటిన్యూగా తీసుకుంటూ ఉంటే అది గుండె జబ్బులకు దారితీస్తుంది. -రూపశ్రీ

ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం మంచిదా కాదా? వైద్యులు  చెప్పిన షాకింగ్ నిజాలు ఇవీ..!

చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా ఉండటానికి, రోజంతా చురుగ్గా ఉండటానికి.. బరువు తగ్గడానికి.. శరీరంలో టాక్సిన్లు బయటకు పోవడానికి..  ఇలా ఒక్కొక్కరు ఒక్కో బెనిఫిట్ కోసం ఉదయాన్నే నిమ్మకాయ రసం నీరు తాగుతారు.  అయితే ఈ అలావాటు మంచిదేనా కాదా.. దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే.. రోజూ నిమ్మకాయ నీరు.. వైద్యుల అభిప్రాయం.. నిమ్మకాయ నీరు  క్రమం తప్పకుండా తాగేవారు ఇది చాలా ఆరోగ్యకరమైన అలవాటు అని అనుకుంటారు. కానీ  ప్రతిరోజూ ఉదయం నిమ్మకాయ నీరు  తాగడం వల్ల  శరీరంలోని ముఖ్యమైన అవయవమైన మూత్రపిండాలకు చాలా పెద్ద  నష్టం కలుగుతుందని అంటున్నారు. ఎక్కువ కాలం ఈ నీరు తాగేవారికి మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని అంటున్నారు. మూత్రపిండాల వైద్యులు ఏం చెప్తున్నారు? చాలా మంది ప్రముఖ నెఫ్రాలజిస్టులు (నెఫ్రాలజిస్టులు అంటే మూత్రపిండ వ్యాధులకు ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ లు.) శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీసే ఏదైనా అలవాటు మూత్రపిండాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు.   ఎలక్ట్రోలైట్ అంటే..  పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్,  బైకార్బోనేట్ వంటి వివిధ రకాల ఖనిజాలు ఉంటాయి. వీటిని ఎలక్ట్రోలైట్లు అని అంటారు.  ఈ ఖనిజాలు శరీరానికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ఖనిజాలను  వివిధ పానీయాల నుండి పొందుతారు. నాడీ వ్యవస్థ నుండి  గుండె పనితీరుతో సహా వివిధ శారీరక విధులను నియంత్రించడంలో అవి కీలకంగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు కావాలంటే రక్తంలో ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉండాలి. ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత.. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఉంటే, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.  మూత్రపిండాల మీద ఒత్తిడి పడుతుంది. ఈ అసమతుల్యత అనేక తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అంతేకాదు.. ఎలక్ట్రోలైట్లు లేకపోవడం వల్ల  తలనొప్పి, గుండె లయ  గందరగోళంగా ఉండటం,  కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి.  అందుకే ఉదయాన్నే నిమ్మకాయ నీరు ఎక్కువ కాలం కంటిన్యూగా తాగడం చేస్తుంటే అది మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని మూత్రపిండ వైద్యులు చెబుతున్నారు.                               *రూపశ్రీ.