పోగొట్టుకున్నచోటే వెతుకుతానంటున్న మురళీమోహన్

 

 

 

"నేను ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుకుతాను. రాజమండ్రిలో ఓడిపోయాను. తీరిగి అక్కడే పోటీచేసి గెలుస్తాను” అని సినీ నటుడు, జయభేరి సంస్థల అధినేత మురళీమోహన్ అన్నారు. గత ఎన్నిక ల్లో టిడిపి తరపున రాజమండ్రి లోక్ సభ స్థానానికి పోటీచేసిన మురళీమోహన్ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఉండవల్లికి 3,57,449 ఓట్లు రాగా, మురళీమోహన్ కు 3,55,302 ఓట్లు వచ్చాయి. కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.


ప్రస్తుతం కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్రలో ఆయనను మురళీమోహన్ కలిశారు. చంద్రబాబు తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తున్నారని ప్రశంసించారు. ఇప్పుడున్న పరిస్థితులలో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “తాను ఎక్కడ ఓడిపోయానో,అక్కడే గెలవాలని,ఎక్కడ పోయిందో , అక్కడే వెతుక్కుంటానని” అన్నారు.

Teluguone gnews banner

Jubilee Hills election

జూబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన

  జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలతోతెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్  పలువురు జనసేన నాయకులు సమావేశం అయ్యారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటామని వారు తెలిపారు. జూబ్లీ  బైపోల్‌కు ఇంకా ఆరు రోజులే ఉండటంతో ప్రచారం ఊపు అందుకుంది. కమలం పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగ ప్రచారం చేస్తున్నారు. లంకల దీపక్ రెడ్డి తరపున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ మద్దతు ప్రకటించడంతో కమలం పార్టీలో నూతన జోష్ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం మద్దతు ప్రకటింది. బీఆర్ఎస్ తరుఫున గోపినాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగగా..2025, నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా.. నవంబర్ 14న కౌంటింగ్ అదే రోజు ఫలితం వెలువడనుంది. ఎన్నికకు మరో 6 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. 

మంత్రి అజారుద్దీన్ శాఖలివే!

ఇటీవలే రేవంత్ కేబిరెట్ లో బెర్త్ లభించిన మహ్మద్ అజారుద్దీన్ కు మైనారిటీ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు దక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ప్రభుత్వ రంగ సంస్థలు, మైనారిటీ శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి నుంచీ అజారుద్దీన్ కు హోంశాఖ కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది. ఎందుకంటే ఆ శాఖ ముఖ్యమంత్రి అధీనంలో ఉండటమే. దీంతో కొంత మేర ఒత్తిడి తొలగించుకునేందుకు ముఖ్యమంత్రి హోంశాఖను అజారుద్దీన్ కు కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణుల నుంచీ, ప్రభుత్వ వర్గాల నుంచీ ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖను తన వద్దే అట్టేపెట్టుకున్నారు. అజారుద్దీన్ కు ప్రభుత్వ రంగ సంస్థలు, మైనారిటీ శాఖలు అప్పగించారు. 

తాళం తీసింది నేనే.. దొంగ మాత్రం ఆయనే!

మాట్లాడింది నేనే.. కంటెంట్ నాది కాదు.. పోలీసుల విచారణలో శ్యామల వైసీపీలో అధినేత నుంచి అధికార ప్రతినిథి వరకూ అందరూ స్క్రిప్ట్ రీడర్లే తప్ప.. వారి వద్ద ఒరిజినల్ కంటెంట్ లేదన్న సెటైర్లు పేలుతున్నాయి.  ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. అందులో ఏముంది? ఆ ఉన్నదాంట్లో వాస్తవమేంటి? అన్న విషయంతో వైసీపీ నేతలకు ఎలాంటి సంబంధం ఉండదని అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ స్క్రిప్ట్ లేకండా సొంతంగా ప్రసంగం చేయడం ఇప్పటి వరకూ ఎవరూచూడలేదు. అధికారంలో ఉన్నప్పుడూ అదే పరిస్థితి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా పరిస్థితుల్లో ఎటువంటి మార్పూ లేదు.  స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని తన బలహీనత బయటపడకూడదని ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఒక్కటంటే ఒక్కసారి కూడా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడింది లేదు. ఇక బహిరంగ సభలో అయితే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేయడమే చూశాం. అది కూడా గడగడా కాదు.. తడబడుతూ, నట్టుతూ నిమిషనిమిషానికీ ముందున్న పేపర్లు చూసుకుంటూ చదవడమే. అయితే బహిరంగ సభల్లో ఆయనకు ఉన్న వెసులుబాటు ఏంటంటే.. మీడియా ప్రతినిథులు ప్రశ్నలు వేయరు. వేయలేరు. దాంతో ఆయన చదవాల్సిది చదివేసి వెళ్లిపోయేవారు. ఇక అధికారం కోల్పోయిన తరువాత మీడియా సమావేశాలు ఏర్పాటు చేయక తప్పని సరిపరిస్థితి.  అప్పూడూ అంతే తాను చదవాల్సింది  చదివేసి ప్రశ్నల వేసే అవకాశం విలేకరులకు ఇవ్వకుండా ప్రెస్ మీట్ ముగించేస్తున్నారు.  ఇప్పుడు అధకారం కోల్పోయిన తరువాత ఆయన బయటకు వచ్చి మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తాను మట్లాడాల్సింది మాట్లాడేసి.. అదే ఫైనల్ అన్నట్లుగా ముగించేయడం తెలిసిందే. ఒక సందర్భంలో తాను మాట్లాడుతుంటే మధ్యలో ప్రశ్నలు వేయవద్దు ఫ్లో దెబ్బతింటుందంటూ మీడియాపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.  మొత్తంగా జగన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం అన్న సంగతి కొత్తేం కాదు. అందరికీ తెలిసిన సంగతే. అందుకే జగన్ ప్రసంగాలలో విషయం అంటే అతిశయం, ఆడంబరం ఎక్కువగా ఉంటాయి. అందుకు కారణం ఆయన ప్రసంగంలో విషయం ఏమిటన్నది ఆయనకే పెద్దగా తెలియకపోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    అందుకే తరచుగా  జగన్  స్క్రిప్ట్ రీడింగ్ ప్రసంగాలన్నీ బూమరాంగ్ అవ్యడమో నవ్వుల పాలు కావడమో  జరుగుతుంటాయంటారు.  ఇప్పుడు తాజాగా తేలిన విషయమేంటంటే.. జగన్ పార్టీలో కీలక పదవులు, పొజిషన్ లలో ఉన్న చాలా మంది పరిస్థితీ అదేనని. వైసీపీ  ప్రసంగీకులలో చాలా మంది ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసి తమ భుజాలు తామే చరిచేసుకుంటారని ఆ పార్టీ అధికార ప్రతినిథి తేటతెల్లం చేశారు.  అదెలాగంటే.. ఇటీవల కర్నూలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై వైసీపీ అధికార ప్రతినిథి విమర్శలు గుప్పించేశారు. ఆ బస్సు డ్రైవర్, అతడి సహాయకుడూ కూడా బెల్టు షాపులో తప్పతాడి బస్సెక్కారనీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం హయాంలో బెల్టు షాపులు తామరతంపరగా వెలిశాయనీ, అదే కర్నూలు బస్సు దుర్ఘటనకు కారణమని ఆరోపణలు చేశారు.  దీంతో బస్సు ప్రమాద ఘటనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ.. పోలీసులు శ్యామల సహా 27 మందిపై కేసు  నమోదు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగా వైసీపీ అధికార ప్రతినిథి శ్యామలను సోమవారం (నవంబర్ 3) విచారణకు పిలిచారు. ఆ విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు శ్యామల సమాథానం చెప్పడంలో తడబడ్డారని తెలిసింది. మరీ ముఖ్యంగా డ్రైవర్ తాగి బస్సు నడిపారనడానికి ఆధారాలేంటి అన్న ప్రశ్నకు శ్యామల సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారని తెలిసింది. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణాలేమిటన్నది తనకు తెలియదనీ.. వైసీపీ అధికార ప్రతినిథిగా పార్టీ తనకు ఇచ్చిన స్క్రిప్ట్ ను తాను చదివాననీ అంగీకరించేసినట్లు సమాచారం.   అయితే విచారణ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ శ్యామల ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు విచారణలకు పిలిచినా భయపడేది లేదని చెప్పుకొచ్చారనుకోండి అది వేరే సంగతి.

రాజకీయాలు ఇప్పుడు కాదు.. వైసీపీకి లోకేష్ హితవు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అభివృద్ధి సందడి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువలా తరలివస్తున్నాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు దిగ్గజ సంస్థలు తరలివస్తున్నాయి. అయితే అదే సమయంలో  ప్రతిపక్షహోదా కూడా లేని వైసీపీ రాజకీయాలు చేస్తున్నది. పెట్టుబడులను అడ్డుకునే విధంగా రాజకీయవిమర్శలకు తెగబడుతోంది. ఈ తరుణంలోనే రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రతిపాదన చేశారు. రాజకీయాలకు ఇంకా చాలా చాలా సమయం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి దోహదపడండి అంటూ వైసీపీకి పిలుపునిచ్చారు.   రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ ఏర్పాటైన 16 నెలలలో  రాష్ట్రానికి  పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. సోమవారం (నవంబర్ 3) మీడియాతో మాట్లాడిన ఆయన ఈ పెట్టుబడులలో అర్సేల్లర్ మిల్లర్ లక్షా ఐదువేల కోట్ల రూపాయలు, గూగుల్ 87 వేల కోట్ల రూపాయలు, అలాగే బీపీసీఎల్ లక్ష కోట్ల రూపాయలు, ఎన్టీపీసీ లక్షా పాతిక వేల కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకం ఏర్పడేలా ఈ పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం కరెక్టు కాదని ఆయన వైసీపీకి సూచించారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేద్దామనీ, ప్రస్తుతం సమష్టిగా రాష్ట్రప్రగతికి కృషి చేద్దామనీ లోకేష్ పిలుపునిచ్చారు. మేమే కాదు, మీరు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావచ్చునని,  రాష్ట్ర అభివృద్ధి అనేది సమష్టిగా చేయాల్సిన పని అనీ హితవు పలికారు.  పెట్టుబడులకు వైసీపీ నాయకులు ఎవరినైనా సిఫార్సులు చేస్తే ఆమోదిస్తామన్నారు.   అదే సమయంలో వైసీపీపై విమర్శలూ గుప్పించారు.  విశాఖకు వచ్చిన గూగుల్ డేటా కేంద్రంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ జనంలో లేని పోని భయాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.  డేటా కేంద్రం ఏర్పాటుతో రేడియేషన్ పెరిగి చెట్టు పెరగవంటూ వైసీపీ చేస్తున్న విమర్శలు సత్యదూరాలన్న ఆయన  అన్నీ ఆలోచించే సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకువచ్చారన్నారు.  దేశానికి వచ్చిన అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా కేంద్రమేనన్న లోకేష్.. దీనివల్ల భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనీ,  విశాఖ రూపురేకలు కూడా ప్రపంచ స్థాయికి పెరుగుతాయన్నారు.  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  వల్ల ఏపీకి పెట్టుబడుల వెల్లువ సాధ్యమవుతోందని, దీనికి సీఎం చంద్రబాబు విజనే కారణమని లోకేష్ వివరించారు.

పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, కేశినేని

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పంచాయతీని పరిష్కరించేందుకు తెలుగుదేశం అధిష్ఠానం సమాయత్తమౌంది. ఇరువురినీ మంగళవారం (నవంబర్ 4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాల్సిందిగా తాఖీదులు జారీ చేసింది. ఇరువురినీ వేర్వేరుగా క్రమశిక్షణ కమిటీ విచారించి, వారి నుంచి వివరణ తీసుకోనుంది. ఇందుకోసం ఇప్పటికే కొలికపూడి శ్రీనివాసరావు మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.   గత నెలలో వీరిరువురూ బహిరంగంగా  ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలతో మీడియాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ వీరి వ్యవహారం మీడియాలోనూ, రాజకీయవర్గాలలోనూ, సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ అవుతోంది.  ఈ నేపథ్యంలోనే వీరిరువురినీ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాల్సిందిగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు.  ఇద్దరు నేతలు ఇచ్చే వివరణ ఆధారంగా వీరిపై చర్యలు ఉంటాయని పార్టీ వర్గాలు బావిస్తున్నాయి.  దీంతోనైనా వీరిరువురి పంచాయతీకి తెరపడుతుందా? లేదా చూడాల్సి ఉంది. 

బీఆర్ఎస్ హైడ్రా పాలిటిక్స్ ...కొంపముంచేనా?

  హైడ్రాతో జూబ్లీహిల్స్ ఎన్నికలను గట్టెక్కాలని బీఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలను చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైడ్రా వస్తుందని మీ ఇళ్లను కూల్చివేస్తుందన ఓటర్లను భయపెట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున హైడ్రా బాధితుల పేరుతో కొంతమందిని తీసుకు వచ్చి వారి బాధల్ని వినిపించారు. అందులో చిన్న పిల్లలు, వికలాగంలు,మహిళలు ,అనాధలు ఇలాంటి సమీకరణాల్ని చూసుకున్నారు. ఆ వీడియోలు వీలైనంతగా జూబ్లీహిల్స్ ప్రజలకు పంపుతారు. అంత వరకూ బాగానే ఉంది కానీ జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ ఓస్తే హైడ్రా మాత్రం రాకుండా ఉంటుందా అన్న డౌట్ ప్రజలకు వస్తే సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ నేతల వద్ద సమాధానం లేదు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి వద్ద ఉంది. ఓడితేనే హైడ్రా వస్తుంది.. గెలిస్తే రాదు ! జరుగుతోంది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక మాత్రమే. ఆ ఉపఎన్నిక సీటు కాంగ్రెస్ పార్టీ బలంపై ఎలాంటి ప్రభావం చూపదు. గెలిస్తే ఓ సీటు పెరుగుతుంది. కానీ ఓడిపోతే తగ్గదు. ఎందుకంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. ఈ ఎన్నికల వల్ల ప్రభుత్వంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి ప్రభావం ఉండదు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీని గెలిపించినా హైడ్రా చేయాలనుకుంటే తమ పనులు చేసేస్తుంది. బీఆర్ఎస్ తరపున గెలిచే ఎమ్మెల్యే కూడా ఆపలేరు. తాము ఆపగలుగుతామని కూడా బీఆర్ఎస్ చెప్పడం లేదు. అక్కడే అసలు పాయింట్ ఉంది. కేవలం భయపెట్టి ఓట్లు పొందాలనుకుంటున్నారు. అంతకు మించిన ఆలోచన ప్రజలు చేస్తారని అనుకోవడం లేదు. కాంగ్రెస్ ను ఓడించడం రెచ్చగొట్టడమే అని ఓటర్లు అనుకుంటే అంతా రివర్స్ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెచ్చగొడితే రేపు తమ ఇళ్ల మీదకు హైడ్రాను తీసుకు వస్తే ఎవరు అండగా ఉంటారన్న ప్రశ్న బీఆర్ఎస్ ప్రచారం వల్ల ప్రజలకు వస్తుంది. అప్పుడు వారికి కనిపించే సమాధానం… కాంగ్రెస్ ను ఓడించడం ఎందుకు.. ఓ ఓటు వేస్తే పోలా అని. ఒక వేళ ఓటు వేసిన తర్వాత కూడా హైడ్రా వస్తే వారికి నవీన్ యాదవ్ ఉంటారు. నవీన్ యాదవ్ లోకల్ లీడర్. రాత్రికి రాత్రి వచ్చిన నేత కాదు. అక్కడ ప్రతి బస్తీలోనూ.. ఆయనకు అనుచరగణం..బలం ఉంటుంది. కాబట్టి ఆయన కాపాడుతారనే నమ్మకం ఉంటుంది. బీఆర్ఎస్ ప్రచారాన్ని కాంగ్రెస్ వాడుకుంటుందా? నిజానికి జూబ్లీహిల్స్ లో హైడ్రాకు పని ఉండదు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే.. చెరువును కబ్జా చేస్తే మాత్రం హైడ్రా వెళ్తుంది. జూబ్లీహిల్స్ మొత్తం కిక్కిరిసిపోయిన జనవాసాల కాలనీలే ఉంటాయి. ఏదైనా సమస్య ఉంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది కానీ.. హైడ్రా వరకూ వెళ్లలేదు. కానీ బీఆర్ఎస్ లోతుగా ఆలోచించలేక.. పూర్తిగా హైడ్రాను ఆయుధంగా చేసుకుంటుంది. ప్రజలు తమ జోలికి హైడ్రా రాకుండా ఉండాలంటే..కాంగ్రెస్‌కు ఓటేయడం బెటర్ అనుకుంటే మొత్తం రివర్స్ అయిపోయినట్లే. అయితే కాంగ్రెస్ ఎలా వాడుకుంటుది అన్నదానిపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది. హైడ్రా కూల్చివేతలపై బాధితులతో కలిసి తెలంగాణ భవన్‌లో  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతు...ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక పెట్టలేదు.. ఒక్క కొత్త కట్టడం లేదు. రేవంత్‌రెడ్డి చేసింది ఏంటి అంటే.. కూలగొట్టడమే’ కేటీఆర్‌ మండిపడ్డారు.  మరో 500 రోజుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి రానుందని, అప్పుడు బాధితులందరికీ న్యాయం   చేస్తామని తెలిపారు.‘హైడ్రా అరాచకాలు: పెద్దలకు న్యాయం, పేదలకు అన్యాయం’పేరుతో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి  పాలనలో పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం లభిస్తోందని ప్రశ్నించారు. ఒవైసీ స్కూళ్లు కూడా కూల్చివేసిన ప్రభుత్వం, గర్భిణులను పక్కకు తోసేసి, మూడేళ్ల చిన్నారులు భోజనం లేకుండా ఏడ్చేలా చేసిందని మండిపడ్డారు. 

కాంగ్రెస్‌లో మంత్రి వ‌ర్గ చిచ్చు

  అస‌లే కాంగ్రెస్ ఆపై మంత్రిప‌ద‌వుల‌కు ఆశావ‌హులు చాలా మందే ఉంటారు. ఆ మాట‌కొస్తే అక్క‌డ ముఖ్యమంత్రి ప‌ద‌వి కోసం కూడా పోటీ పెద్ద ఎత్తునే ఉంటుంది. అలాంటిది మంత్రి ప‌దవిపై మాత్రం కాంపిటిష‌న్ ఉండ‌దా?  మొద‌టి లొల్లి మైనార్టీ  నాయ‌కుల  నుంచి  మొద‌లైందట‌. అజారుద్దీనే మైనార్టీ నేత  అయితే మ‌రి మేమంతా  ఎవ‌రు? అని నిల‌దీస్తున్నారు ఫిరోజ్  ఖాన్, సీనియ‌ర్ లీడ‌ర్  ష‌బ్బీర్ అలీ.  వీరిద్ద‌రూ ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కులు. అజారుద్దీన్ లా స్పోర్ట్స్ కోటాలో ప‌ద‌వి కొట్టేసిన  బాప‌తు కాదు. దీంతో మాకెందుకివ్వ‌లేదు మంత్రి ప‌ద‌వి? అన్న‌ది వీరి ప్ర‌శ్న‌. అజారుద్దీన్ కన్నా మాకేం  త‌క్కువ‌. అజార్ క‌న్నా తెలుగు రాదు. అదే  మాకు అలాక్కాదు క‌దా.. తెలుగులోనూ మాట్లాడి క‌వ‌ర్ చేస్తాం.. అంటారు వీరు. అజారుద్దీన్ అంటే గ‌తంలో జూబ్లీహిల్స్ రేసు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాబ‌ట్టి.. ఆయ‌న్ని మంత్రిని చేస్తే జూబ్లీహిల్స్ లోని మైనార్టీ ఓటు బ్యాంకును విశేషంగా ఆక‌ట్టుకోవ‌చ్చ‌న్న‌ది అధిష్టానం ఆలోచ‌న. అయితే  నేను ఇక్క‌డి నుంచి పోటీ  చేయాల్సింది. నేను త్యాగం  చేయ‌డం వ‌ల్లే న‌వీన్‌కి  వ‌చ్చిందా టికెట్ కాబ‌ట్టి నాకు క‌దా  ప‌ద‌వి ఇవ్వాల్సింద‌ని అంటారు అంజ‌న్ కుమార్ యాద‌వ్. ప‌దేళ్లుగా బీఆర్ఎస్ తో కొట్లాడిన నాకు మంత్రి ప‌దవి ఏదీ? అంటూ నిల‌దీస్తారు జీవ‌న్ రెడ్డి. ఇలా మంత్రి  ప‌ద‌వుల‌పై బీభ‌త్స‌మైన గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. అదృష్ట‌మో దుర‌దృష్ట‌మో.. ఇక్క‌డ గోపీనాథ్ మ‌ర‌ణించ‌డం. ఆ టికెట్ అజారుద్దీన్ ఆశించ‌డం. అటు పిమ్మ‌ట  దానికి న‌వీన్ యాద‌వ్ పోటీ రావ‌డం. అజారుద్దీన్ని ఎలాగైనా  స‌రే బుజ్జ‌గించాల్సిందే అన్న ప్ర‌శ్న త‌లెత్తిన‌ప‌పుడు మిగిలి ఉంచిన మూడు మంత్రి ప‌ద‌వుల్లో ఒక‌టి ఆయ‌న‌కు మైనార్టీ కోటా కింద ఇవ్వ‌డం జ‌రిగింది. అప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న‌రావు స్తానంలో హెచ్. సీ. ఏ అధ్య‌క్ష ప‌ద‌వికి  అజారుద్దీన్ని పంపాల‌నుకున్నారు.  కానీ, అందుకు ఆయ‌న స‌సేమిరా అన‌డంతో.. ఎమ్మెల్సీని చేసి ఆపై మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డానికి సిద్ధ ప‌డింది కాంగ్రెస్ అధిష్టానం. అలాగ‌ని ఈ ఎపిసోడ్ ఇక్క‌డితో ముగిసిపోలేదు. ఎమ్మెల్యేల‌కు నామినేటెడ్ పోస్టులు ఇవ్వ‌డంపైనా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ్. జ‌గ్గారెడ్డి, మ‌ధు  యాష్కి వంటి సీనియ‌ర్లు ఈ విష‌యంలో గుర్రుగా ఉన్నార‌ట‌. త‌మ‌ను అడ‌క్కుండా,  బుజ్జ‌గించ‌కుండా ఇలా ఎలా చేస్తార‌ని వారు అంటున్నారట‌. కొంద‌రైతే వీరెన్ని చేసినా  జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపు అంతంత మాత్ర‌మే అని ఓపెన్ కామెంట్లు చేస్తున్నార‌ట‌.

బిల్లా రంగాలు ఆటోల్లో తిరుగుతున్నారు జాగ్రత్త : సీఎం రేవంత్‌

  జూబ్లీహిల్స్‌లో బిల్లారంగాలు ఆటోల్లో తిరుగుతున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి (కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి) అన్నారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో కార్నర్‌ మీటింగ్‌‌లో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. దివంగత నేత పేదల మనిషి పి.జనార్ధనరెడ్డి అకాల మరణంతో 2008  ఉప ఎన్నిక ఆయన ఫ్యామిలీని ఏకగ్రీవంగా ఇవ్వాలని నిర్ణయం జరిగింది. పీజేఆర్‌ కుటుంబానికి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని ఆనాడు తెలుగు దేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. కానీ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఆ ఉప ఎన్నికలో పోటీ అభ్యర్థిని నిలబెట్టారు.  ఒక దుష్ట సంప్రదాయానికి కేసీఆర్ ఆనాడు తెరలేపారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. ఆస్తిలో వాటా అడుగుతుందని సొంత చెల్లి కవితనే ఇంటి నుంచి పార్టీ నుంచి తరిమివేసినోడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అలాంటోడు జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతను గెలిపించాలని తిరుగుతున్నాడు. ఇదంతా చూస్తుంటే.. కన్నతల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడట’ అనే సామేత గుర్తొస్తుందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.  బోరబండకు పీజేఆర్ పేరు పెడతామని సీఎం అన్నారు. జూబ్లీహిల్స్‌లో గత పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదన్నారు.  ఇక్కడ ఎంతో మంది పేదలకు పి.జనార్ధనరెడ్డి ఆశ్రయం కల్పించారని గుర్తు చేశారు. పేదలకు పీజేఆర్ ఇళ్లు కట్టించారని ఆయన అన్నారు. బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరుతో పాటు విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను అడ్డం పెట్టుకొని కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు అక్రమంగా వేల కోట్లు సంపాదించుకున్నారని కవిత ఆరోపణలు చేస్తున్నది. దమ్ముంటే ముందు ఆ ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. బోరుబండ అభివృద్ధి చెందాలంటే నవీన్ యాదవ్‌ను గెలిపించాలని అని రేవంత్ తెలిపారు.

రాజీనామాకు సిద్దం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతు కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచాక నియోజకవర్గంలో రూ.4 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని సీఎం చెప్తున్నాడు. నిజంగా నాలుగు వేల కోట్ల అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే ఆ క్షణమే నేను సనత్‌నగర్ ఎమ్మెల్యేకి  రాజీనామా చేస్తాని తలసాని సవాల్ విసిరారు.  సీఎం రేవంత్‌రెడ్డి భాష మార్చుకోవాలని ఆయనకు ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్‌కు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.  23 నెలల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 44 వేల కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కేవలం రూ. 4,600 కోట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిందని అన్నారు.  హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు అయినా కట్టారా..? అని ప్రశ్నించారు. కేటీఆర్ హైదరాబాద్ తిరగలేదని అంటున్నారు.. ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఉన్నారా..? లేక వేరే దేశంలో ఉన్నారా..? అని తలసాని ప్రశ్నించారు.ఎన్టీఆర్‌కు మాగంటి గోపీనాథ్ వీరాభిమాని అని, ఎన్టీఆర్‌తో కలిసి మాగంటి గోపీనాథ్ తిరిగారని తలసాని అన్నారు.  

జూబ్లీ బైపోల్ లో పార్టీల ఎన్టీఆర్ భజన అందుకోసమేనా?

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. అన్ని పార్టీల దృష్టీ తెలుగుదేశం వైపే ఉంటుంది. విభజన తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో క్రీయాశీల రాజకీయాలకు ఒకింత దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకు ప్రధాన కారణం పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం లేకపోవడమే.  తెలంగాణలో తెలుగుదేశం నాయకులంతా వేర్వేరు కారణాలతో తమ దారి తాము చూసుకున్నా.. పార్టీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా ఉండటంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఆ తెలుగుదేశం క్యాడర్ మద్దతు కోసం ఎన్నికల సమయంలో అర్రులు చాస్తుంటాయి. ఇసుమంతైనా భేషజానికి పోకుండా తెలుగుదేశం జెండా మోస్తుంటాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రస్, బీజేపీ సహా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ తెలుగుదేశం జెండా చేతబట్టి ప్రచారం చేయడాన్ని మనం చూశారు. ఇప్పుడు జూబ్లీహాల్స్ ఉప ఎన్నిక వేళ కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా తెలుగుదేశం అండ కోసం అర్రులు చాస్తున్నాయి.  తెలుగుదేశం ప్రాపకం పొందేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి  మాగంటి సునీత కొన్ని రోజుల కిందట తన ప్రచారంలో ఎన్టీఆర్ ను స్మరించు కున్నారు. తన భర్త, దివంగత మాగంటి గోపీనాథ్ కు ఎన్టీఆర్ పిత్రు సమానులని చెప్పుకున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా మాగంటిని పుత్ర వాత్సల్యంతో ఆదరించారని చెప్పుకొచ్చారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో హైదరాబాద్ నడిబొడ్డున అంటే మైత్రీవనం వద్ద ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపన ప్రస్తావన తెచ్చారు. ఆయన విగ్రహాన్ని మైత్రీవనంలో  ఏర్పాటు చేయించి తానే ఆవిష్కరిస్తానని చెప్పారు. ఇందుకు ప్రధాన కారణం  జూబ్లీ ఉప  ఎన్నికలో తెలుగుదేశం  పార్టీ క్యాడర్ ఎటుమెగ్గు చూపితే అటే విజయం వరిస్తుందన్న నమ్మకమే అని పరిశీలకులు అంటున్నారు. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే.. ఆ పార్టీ అధినాయత్వం ఎన్డీయేతో పొత్తు నేపథ్యలో బీజేపీకే మద్దతు ఇవ్వాలని క్యాడర్ కు ఇప్పటికే పిలుపునిచ్చింది. ఇలా ఏ విధంగా చూసుకున్నా.. తెలంగాణలో పార్టీలన్నీ తెలుగుదేశం భజన చేస్తున్నాయని చెప్పక తప్పదు.