యూపిఏకు ములాయం మద్దతు
posted on Sep 21, 2012 @ 4:15PM
ములాయం సింగ్ యాదవ్ యూపిఏ ప్రభుత్వాన్ని ఆపద సమయంలో ఆదుకున్నారు. యూపీఏ సర్కాకు బయట నుంచే మద్దతు ఇస్తామని సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ పేర్కొన్నారు. అయితే డీజిల్ ధర పెంపు, వంట గ్యాస్ పరిమితి, ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. మతతత్వ శక్తులు అధికారంలో రాకూడదనే యూపీఏకు మద్దతునిస్తున్నామని ఆయన తెలిపారు. ఎఫ్‌డిఐ, పెట్రో పెంపు వంటి కేంద్రం నిర్ణయాలను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు టిఎంసి మంత్రులు రాజీనామా చేయనున్నారు. మమత బయటకు వెళ్లిపోవడంతో సింగ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి కష్టాల్లో పడింది. అయితే నిన్నటి వరకు బయటి నుండి యూపిఏకి మద్దతిస్తూ ఎటూ తేల్చని ములాయం ఈ రోజు కేంద్రానికి మద్దతు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.