మహిళల రేప్ పై ములాయం వివాదాస్పద వ్యాఖ్యలు
posted on Aug 19, 2015 @ 5:43PM
సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మహిళల అత్యాచారం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళను నలుగుర వ్యక్తులు ఒకేసారి ఎలా అత్యాచారం చేస్తారని, అదంతా వట్టిదేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఒక వ్యక్తి అత్యాచారం చేస్తే దానిని మిగిలిన వారిని కూడా ఆపాదిస్తున్నారని అన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, హింసలు పెరుగుతున్నాయని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ములాయం పైవిధంగా వ్యాఖ్యానించారు. మిగిలిన రాష్ట్రాలకంటే ఉత్తరప్రదేశ్ చాలా బెటర్ అని.. ఇక్కడ అత్యాచారాలు, నేరాల సంఖ్య తక్కువగా ఉందని.. అసలు గ్యాంగ్ రేప్‌లు లేవని అన్నారు. అయినా రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క నేరంపై ప్రభుత్వం దృష్టి సారించాలంటే కష్టమన అన్నారు. ఇదిలా ఉండగా ములాయం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ములాయం సింగ్ ఇలా వ్యాఖ్యానించడం అనైతికం అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.