సినీ సంగీతానికి ఎం.యస్.విశ్వనాథన్ ఇక లేరు..
posted on Jul 14, 2015 @ 3:17PM
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.యస్.విశ్వనాథన్ కన్నుమూశారు. కొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నైలో మల్లార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. తెలుగు, తమిళ్, మలయాళ బాషలలో 1200 చిత్రాలకు సంగీతం అందించారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.యస్.విశ్వనాథన్ గారు. తెలుగులో కేవలం 31 సినిమాలకే సంగీతం అందించినప్పటికీ ఆయన అందించిన బాణీలతో తెలుగు సినీ సంగీతం ప్రపంచంలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. ఫిలిం ఫేర్ జీవిత కాల పురస్కారం(2001), పరమాచార్య అవార్డు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమయిన కలైమణి అవార్డు వంటి అనేక అవార్డులు ఆయన అందుకొన్నారు. అలాంటి ఎన్నో అద్భుతమైన బాణీలు అందించిన ఎం.యస్.విశ్వనాథన్ మరణంతో సంగీత ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. ఏపీ సీఎం చంద్రబాబు ఎం.యస్.విశ్వనాథన్ మృతికి సంతాపం తెలిపారు. ఎం.యస్.విశ్వనాథన్ దేశం గర్వించదగ్గ కళాకారుడని..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
https://www.youtube.com/