MPs not concerned of country reputation

 

The letters faxed to White House signed by some our MPs asking US Government not to grant Visa to Gujarat CM Narendra Modi, makes the US laugh on us and downgrades our value in its views. Around 65 MPs of 12 different political parties have signed these letters sent to White House on November 26th and December 5th and again on last Sunday. They appealed the US government to continue its policy of refusing US Visa to Modi, because of his communal background.

 

These so called MPs, who believe themselves as scholars and up above the normal public, have simply ignored the fact that their letters complaining against their fellow Indian citizen will bring down the reputation of our country. If, they all hate and oppose him, they could stop him from calcimining Prime Minister Post by joining hands and defeat his party in the forthcoming elections. But, instead they all prefer to bring down the country’s reputation by writing letters to White House.

 

They should realize that a visit to US is not considered as any great achievement to leader of that level but brining the US businessmen and political executives to his door step seeking business agreements with his government is called an achievement.

టీడీపీలో చేరిన వైసీపీ నెల్లూరు నేత కరిముల్లా

  నెల్లూరు జిల్లాలో వైసీపీకి  బిగ్ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. 42 వార్డు వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు. మంత్రి నారాయణ సమక్షంలో కరీముల్లా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరికతో మాజీ మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పరువు పోగొట్టుకున్నట్లైంది. కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో మాజీ సీఎం జగన్‌ పరువుకు భంగం వాటిల్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. శనివారం (ఈ నెల 13)ఉదయం కరీముల్లాను స్వయంగా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ వెంటబెట్టుకుని అమరావతికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విజయవాడలో కరీముల్లాకు మంత్రి నారాయణ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరినీ టీడీపీలోకి తీసుకెళ్లేందుకు ముక్కాల ద్వారకానాధ్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.  

నెల్లూరు నెంబ‌ర్ గేమ్

  నెల్లూరు మేయ‌ర్ పై అవిశ్వాసం  పెట్టింది టీడీపీ. ఈ నెల  ప‌ద‌హారున ఈ అవిశ్వాస  తీర్మానం  జ‌రుగుతుండ‌టంతో.. అటు వారు ఇటు- ఇటు వారు అటు అనే నెంబ‌ర్ గేమ్ మొద‌లైంది.. ఇప్ప‌టి  వ‌ర‌కూ ఉన్న వారెంత‌?  లేని వారెంద‌రు? ఎవ‌రి  బ‌లాబ‌లాలేంటి? అన్న‌ది  ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క‌లు మారుతూనేఉన్నాయి. సంద‌ట్లో స‌డేమియాలా కొంద‌రు కార్పొరేట‌ర్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారుతూనే ఉన్నారు. ప్ర‌స్తుతం టీడీపీలోకి వెళ్లిన  ఐదుగురు వైసీపీ కార్పొరేట‌ర్లు ఇటు తిరిగి ఇటు వ‌చ్చేశారు. వీరిలో ఒక ఇద్ద‌ర్నిత‌మ పార్టీ అధినేత జ‌గన్ ముందు తీస్కెళ్లి  ప్ర‌వేశ పెట్టారు మాజీ మంత్రి అనిల్, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ ప‌ర్వ‌త‌రెడ్డి. దీంతో గ‌ణాంకాల్లో తేడా వ‌చ్చింది. మ‌రో ఇద్ద‌రుగానీ టీడీపీని వీడిపోతే.. అవిశ్వాస‌మేవీగిపోతుంది. కానీ ఇక్క‌డే టీడీపీ మేజిక్ చేయ‌గ‌లిగింది.. జ‌గ‌న్ ని క‌లిసిన ఆ ఇద్ద‌రూ తిరిగి టీడీపీలోకి వ‌చ్చేసిన‌ట్టు వారే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేశారు. ఇంత‌కీ నెల్లూరు మేయ‌ర్ వ్య‌వ‌హారంలో అస‌లేం జ‌రిగిందో చూస్తే..  నెల్లూరు మేయ‌ర్ పొట్లూరి స్ర‌వంతిపై అవిశ్వాస  తీర్మానం ఎందుకు పెట్టారో చూస్తే.. నాలుగేళ్ల క్రితం  నెల్లూరు కార్పొరేష‌న్లో 54 డివిజ‌న్ల‌ను వైసీపీసొంతం చేసుకుంది. ఈ పార్టీకి  చెందిన రూర‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి  శ్రీధ‌ర్ రెడ్డి కూట‌మిలోకి వ‌చ్చారు. దీంతో కొంద‌రు కార్పొరేట‌ర్లు శ్రీధ‌ర్ రెడ్డి  వెంబ‌డి న‌డిచారు. దీంతో మేయ‌ర్ భ‌ర్త జ‌య‌వ‌ర్ధ‌న్ షాడో మేయ‌ర్ గా అధికారం చ‌లాయించాడు. అక్ర‌మాలు చేసి  ఫోర్జ‌రీ  కేసుల్లో జైలుకు వెళ్లాడు. దీంతో నెల్లూరు న‌యా అభివృద్ధి కోసం  కొత్త  పాల‌క వ‌ర్గాన్ని  ఎంపిక చేసేందుకు 42 మంది కార్పొరేట‌ర్లు సిద్ధ‌ప‌డ్డారు. మంత్రి నారాయ‌ణ‌, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని క‌లిసి  క‌లెక్ట‌ర్ అనుమ‌తి  పొందారు. చివ‌రికి అవిశ్వాస  తీర్మానం కోసం  రంగం సిద్ధ‌మైంది. ఈ ప‌రిస్థితుల్లో క్వార్జ్  అక్ర‌మాల విచార‌ణ‌లో ఉన్న జిల్లా నేత‌లు, వారికి అండ‌గా ఉన్న గంజాయి బ్యాచ్ కార్పొరేట‌ర్ల‌ను ప్ర‌లోభ  పెట్ట‌డం  ప్రారంభించారు. ఫోన్ల ద్వారా బెదిరింపులు చేయ‌డం ప్రారంభించారు. టీడీపీ లోకి వ‌చ్చిన వారిని బెదిరించ‌డంతో పాటు ప్ర‌లోభాలు మొద‌ల‌య్యాయి. ఈ విష‌యం మంత్రి నారాయ‌ణ ఎమ్మెల్యే  కోటంరెడ్డి దృష్టికి వెళ్ల‌డంతో.. వారీ విష‌యం సీరియ‌స్ గా తీస్కున్నారు. బెదిరింపుల‌కు పాల్ప‌డే వారి వివ‌రాలివ్వాల్సిందిగా.. కోరారు. వారి డీటైల్స్ పోలీసుల‌కు అందించి క‌ఠిన  చ‌ర్య‌లు తీస్కోవ‌ల్సిందిగా ఆదేశించారు. ఇప్పుడ‌క్క‌డి ప‌రిస్థితి  ఎలా త‌యారైందంటే.. ఇటు వైసీపీ అటు టీడీపీ వ‌ర్గాలు కార్పొరేట‌ర్ల  నివాసాల ముందు నిఘా ఏర్పాటు చేశారు. మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయొద్దని వైసీపీ  చేయ‌ని  ప్ర‌య‌త్నం లేదు. మ‌రికొంద‌రు ఫోన్ల‌లోనే బేర‌సారాలు మొద‌లు పెట్టారు. ఏ కార్పొరేటర్​కి ఫోన్ చేసి బెదిరించినా వెంటనే సమాచారం అందించాలని మంత్రి నారాయణ సూచించారు. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఆదేశించారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కౌన్సిల్ సమావేశం జరగనున్న ప‌రిస్థితిలో మేయ‌ర్ ఎన్నిక‌ నగరంలో తీవ్ర‌ చర్చనీయంగా మారింది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కౌన్సిల్ సమావేశం జరిగే వరకు వైసీపీ నేతలు ఎలాంటి ప్ర‌లోభాల‌ ప్రయోగాలు చేస్తారో వేచి చూడాలి. మేయర్​గా ఉన్న పొట్లూరి స్రవంతికి, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇది వ‌ర‌కే ప్రకటించారు. ఇక మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఈ విషయాన్ని గుర్తు చేశారు. అంతే  కాదు త‌మ‌కంత‌టి సంఖ్యాబ‌లం లేదంటూనే లోలోప‌ల లోపాయికారీ బేర సారాలు ఆడుతున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో నెల్లూరు మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారేలా క‌నిపిస్తోంది.

కొలికపూడి వాట్సాప్ స్టేటస్‌ సంచలనం

  తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే  కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఓ మండల అధ్యక్షుడిని టార్గెట్ చేసి వరుస వాట్సాప్ స్టేటస్‌లు పెట్టి విమర్శలు గుప్పించారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి?  పేకాట క్లబ్ కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్‌కా? పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే ...నువ్వు నిజంగా రాయల్...అంటూ రాసుకొచ్చారు కొలికపూడి.  విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును ఉద్దేశించి ఈ స్టేటస్‌లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాయల సుబ్బారావు చాలా కాలంగా పేకాట ఆడిస్తున్నారంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించినట్లు తెలుస్తోంది.  రాయల సుబ్బారావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గమని ప్రచారం జరుగుతోంది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్‌ల ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు బ్యాంక్ స్టేట్‌మెంట్ల పేరుతో సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు.  

ఆ గుంట నక్కలకు చెప్తున్న తోలు తీస్తా...కవిత వార్నింగ్

  పందెం కోళ్ల కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బినామీ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఎవరు ఎవర్ని కాపాడుతున్నారు? ఇవన్నీ నాకు తెల్వదా? ఆడపిల్ల కదా అని లైట్ తీసుకుంటున్నారేమో ఒక్కొక్కడి తోలు తీస్తాని కవిత హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.  తనపై, తన భర్త అనిల్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ నోటీసులో తెలిపారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తుందని నన్ను అంటున్నారు. అలా మాట్లాడే గుంటనక్కలకు చెప్తున్నా. నా మీద అనవసరమైన  దాడి చేస్తే మీ చిట్టా మోత్తం విప్పుతాని కవిత అన్నారు.  జనం బాటలో ప్రజల మధ్య తిరుగుతుంటే మీ అవినీతి,అక్రమాలు అన్నీ బయటికి వస్తున్నాయి. ఇది జస్ట్ టాస్ మాత్రమే. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుందని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఏదో ఒక రోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.  అవినీతిపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. నాకు సమయం వస్తుంది. ఏదో ఒకరోజు సీఎం అవుతాను...2014 నుంచి ఇప్పుటి వరకు రాష్ట్రంలో జరిగిన స్కామ్‌లపై చర్యలు తీసుకుంటానని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి జనం బాట పేరిట కవిత విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కరం కోసమే జనం బాట చేపట్టినట్లు కవిత ప్రకటించారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన కవిత ఇప్పుడు మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు

95 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా గెలిచిన ఎమ్మెల్యే తండ్రి

  తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి  ఘన విజయం సాధించారు. సూర్యపేట జిల్లా  తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామం పంచాయతీ నుంచి సర్పంచ్‌గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. హోరాహోరీ పోరులో ప్రత్యర్థి మీద విజయం సాధించారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి, సర్పంచ్ గా గెలిచిన 95 ఏండ్ల గుంటకండ్ల రామచంద్రా రెడ్డిని బీఆర్ఎస్  అధినేత కేసీఆర్ అభినందించారు.  100 ఏళ్లకు దగ్గరగా ఉన్న ఒక పెద్ద మనిషి నేటి యువతతో పోటీపడుతూ ప్రజాసేవకు ముందుకు రావడం, ఎన్నికల బరిలో నిలవడం, ప్రజల ఆదరణ పొందుతూ గెలవడం, అనేది ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో చాలా అరుదైన విషయం అని కేసీఆర్ అన్నారు.   సంతోషం వ్యక్తం చేస్తూ,ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్ర రెడ్డిని అభిమానంతో గెలిపించిన నాగారం గ్రామ ప్రజలను,  మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తలను, నాయకులను అధినేత కేసీఆర్ అభినందించారు. రామచంద్రారెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నాగారం గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని అధినేత అభిలషించారు. మొదటి విడత ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 2,383 సర్పంచి స్థానాల్లో గెలుపు పోందారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో హస్తం పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్‌ఎస్ మద్దతుదారులు 1,146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సీపీఎం 14, సీపీఐ 16 చోట్లకు పైగా గెలిచాయి. బీజేపీ మద్దతుదారులు రెండువందల లోపు స్థానాలకు పరిమితమైంది.తొలివిడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 3,834 సర్పంచి, 27,678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 84.28 శాతం ఓటింగ్‌ నమోదైంది

జ‌గ‌న్ స‌ర్వేలో బ‌య‌ట ప‌డ్డ నిజాలేంటి?

  తాజాగా కోటి  సంత‌కాల సేక‌ర‌ణ  చేసింది వైసీపీ. జ‌గ‌న్ పాల‌నికిదో రెఫ‌రెండంగానూ చెప్పుకొస్తున్నారు భూమ‌న‌, రోజా వంటి వైసీపీ  జ‌గ‌జ్జంత్రీలు. ఇదంతా ఇలా ఉంటే  ఈ పైపై మెరుగుల‌కు మోస  పోని... జ‌గ‌న్ లోలోప‌ల ఒక భారీ స‌ర్వే చేయించార‌ట‌. ఈ స‌ర్వేలో 18 నెల‌ల కూట‌మిపాల‌న ఎలా ఉందో ఒక తుల‌నాత్మ‌క ప‌రిశీల‌న చేయించార‌ట‌. ఈ ప‌రిశీల‌న‌లో తేలిన వాస్త‌వాలేంటో చూస్తే..  గ‌తంలో క‌న్నా ఎంతో మెరుగ్గా  కూట‌మి  పాల‌న ఉన్న‌ట్టు చెప్పార‌ట ఈ స‌ర్వేలో పాల్గొన్న ప్ర‌జ‌లు. త‌మ‌కు అన్నీ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని.. ఫించ‌న్లు స్వ‌యంగా బాబే ఇవ్వ‌డం గొప్ప విష‌య‌మ‌నీ.. గూగుల్ వంటి సంస్థ‌లు రావ‌డంతో పాటు.. ఇటీవ‌ల పార్ట‌న‌ర్ స‌మ్మిట్ ద్వారా 13 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఒప్పందాలు జ‌రిగాయ‌ని.. ఇక సంక్షేమ‌ప‌థ‌కాలు కూడా పెద్ద ఎత్తున జ‌నానికి చేరుతున్నాయ‌నీ చెప్పార‌ట‌. మ‌రి  ప‌వ‌న్ క‌ళ్యాణ్ 15 ఏళ్ల పాటు ఈ కూట‌మి క‌లిసి  ఉండాల‌ని కోరుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయ‌మేంట‌ని అడ‌గ్గా.. అలా ఉంటేనే రాజ‌ధానిపూర్త‌వుతుంది. పోల‌వ‌రం కూడా  కంప్లీట్ అవుతుంది. ఆపై కేంద్ర‌ప్ర‌భుత్వంతో ఉన్న  స‌ఖ్య‌త కార‌ణంగా ఇంకా ఎన్నో మంచి ప‌నులు జ‌రుగుతాయి కాబ‌ట్టి.. మాకీ ప్ర‌భుత్వ‌మే బాగుంద‌ని అన్నారట ఆంధ్ర‌ప్ర‌జ‌లు. ఇక చంద్ర‌బాబు అపార‌ అనుభ‌వం, లోకేష్ యువ‌నాయ‌క‌త్వం, ప‌వ‌న్ పాపులారిటీ కూట‌మి ప్ర‌భుత్వానికి పెట్ట‌ని కోట‌లుగా మారి.. ఏపీని సంక్షేమాబివృద్ధి దిశ‌గా  ప‌రుగులు తీయిస్తున్న‌ట్టుగానూ చెప్పుకొచ్చార‌ట స‌ర్వేలో పాల్గొన్న ప్ర‌జ‌లు. దీంతో జ‌గ‌న్ కి దిమ్మ తిరిగి భ‌విష్య‌త్ బొమ్మ క‌నిపించింద‌ట‌. ఆయ‌న అధికార‌పు ఆశ‌ల‌పై ఫ్రిడ్జ్ లోంచి బ‌య‌టకు తీసిన చ‌ల్ల చ‌ల్ల‌ని నీళ్లు కుమ్మ‌రించిన‌ట్ట‌య్యింద‌ట‌. బేసిగ్గా జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఏం భావించాడో చూస్తే.. ఆయ‌న‌కు ఉన్న 40 శాతం ఓటు బ్యాంకుకు కూట‌మి  వ్య‌తిరేఖ‌త ద్వారా మ‌రో 8 శాతం ఓటు బ్యాంకు త‌న పార్టీకి క‌లిసి  వ‌స్తుంది. కాబ‌ట్టి, సుమారు 50 శాతం ఓట్ల‌తో తాను 2029లో గెల‌వ‌బోతున్న‌ట్టుగా ఫీల‌య్యేవార‌ట ఇన్నాళ్లూ. ఇప్పుడా ఫీలింగ్స్ మొత్తం బూడిద‌లో పోసిన‌ట్టే అయ్యింద‌ట‌. ఆ స‌ర్వే ఫ‌లితాలు అలా అఘోరించాయ‌ట‌. ఇలా ఎందుకు జ‌రిగిందో కూపీ లాగిన  జ‌గ‌న్ కి న‌మ్మ‌లేని నిజాలెన్నో బ‌య‌ట ప‌డ్డాయ‌ట‌. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ మైండ్ సెట్లో ఆల్రెడీ ఉన్న హింసాత్మ‌క ప్ర‌వృత్తికి ర‌ప్పా ర‌ప్పా ఫ్లెక్సీల మోత కూడా తోడ‌య్యింద‌ట‌. అంతే  కాదు కొంద‌రు ఫ్యాను పార్టీ  మ‌ద్ద‌తు దారులు కౌంటింగ్ మొద‌ల‌య్యి ఫ‌లితాలు త‌మ  వైపున‌కు తిరుగుతున్నాయ‌ని తెలిసిన వెంట‌నే న‌*కుడు మొద‌ల‌వుతుంద‌ని చేస్తోన్న హెచ్చ‌రిక‌లు సైతం ఆయ‌న‌కు చేటు తెస్తున్న‌ట్టు బ‌య‌ట ప‌డింద‌ట‌.

కడప నగర మేయర్ గా పాక సురేష్ ఏకగ్రీవం

కడప కార్పొరేషన్ మేయర్ గా వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో  పాక సురేష్ వినా మరెవరూ పోటీ చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.   గత ఎన్నికల్లో మేయర్ గా గెలిచిన సురేష్ బాబు కుటుంబ సభ్యులు మున్సిపల్ చట్టాలను అతిక్రమించి పనులు చేపట్టారనే‌ కారణంగా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు  నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు  కాంట్రాక్టులు పొందారని తేలింది. విజిలెన్స్ నివేదికను అనుసరించి సురేష్ బాబును ఈ ఏడాది సెప్టెంబర్ 23న మేయర్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. డిప్యూటీ మేయర్ గా ఉన్న ముంతాజ్ బేగంను ఇన్ చార్జి మేయర్ గా నియమించింది.  తాజాగా ఖాళీగా ఉన్న మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో వైసీపీ కార్పొరేటర్  పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  కడప కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్ లు ఉండగా గత ఎన్నికల్లో  టిడిపి నుంచి  ఒక్క కార్పొరేటర్ మాత్రమే గెలుపొందారు. ఒక ఇండిపెండెంట్ గిలిచారు. ఈ రెండూ మినహా మిగిలిన 48 డివిజన్ లలోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు.  అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మార డం, కడప ఎమ్మెల్యేగా టిడిపి నుంచి మాధవీ రెడ్డి గెలవడం జరిగింది .ఆ తర్వాత ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశంలో  చేరారు. ఇద్దరు వైసీపీ కార్పొరేటర్ లు మరణించారు. దీంతో దీంతో వైసిపి కార్పొరేటర్ల సంఖ్య సంఖ్య 38గా ఉంది. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా వైసిపి అనుకూలంగా ఉండటంతో వారి సంఖ్య 39 . ఆ కడప కార్పొరేషన్ లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ  ఉంది.  సంఖ్యా బలం లేకపోవడంతో  గురువారం (డిసెంబర్ 11) జరిగిన మేయర్ ఎన్నికలో తెలుగుదేశం పోటీ చేయలేదు.  వైసీపీ నుండి   47 వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేస్ ను మేయర్  అభ్యర్థి పోటీకి దిగి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా గెలుపొందారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది.  

రాహుల్ తో రేవంత్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ మీట్ వివరాలను రేవంత్ వారికి వివరించారు. ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం(డిసెంబర్ 11). తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం (డిసెంబర్ 10)రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.   ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కూడా పాల్గొన్నారు.ఈ విందుకు  కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా వచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారిలో కొద్ది సేపు ముచ్చటించారు.  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విశేషాలు వివరించారు.  

బోరుగడ్డను వైసీపీ వదిలించేసుకుంది!

వైసీపీలో జగన్ వినా మరే నేతకూ చోటు పదిలం కాదు. మనకు పనికిరాడు అనుకుంటే.. ఒక్క క్షణం ఆలోచించకుండా పక్కన పెట్టేస్తుంది. ఈ విషయం వైసీపీలో పలువురు నేతలకు అనుభవమే. తాజాగా ఆ పార్టీ బోరుగడ్డ అనిల్ కుమార్ ను వదిలించేసుకుంది. జగన్ అధికారంలో ఉండగా ఆయన అండ, వైసీపీ దన్ను చూసుకుని మనిషన్న వాడు మాట్లాడకూడని మాటలతో అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులను దూషించిన వ్యక్తి బోరుగడ్డ అనిల్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఇష్టారీతిగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతే కాదు జగన్ ఆదేశిస్తే చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని హతమారుస్తానంటూ కూడా బోరుగడ్డ అనిల్ మాట్లాడారు.   గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత.. బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా.  జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.  మాటకు ముందొక జగన్, మాటకు వెనకొక జగన్ అంటూ జగన్ భజన చేసిన బోరుగడ్డ అనిల్ ను సహజంగానే వైసీపీ వ్యక్తే అని అంతా భావించారు. బోరుగడ్డ అనిల్ కూడా అలానే చెప్పుకొచ్చారు. అన్నిటికీ మించి వైసీపీ అధికారంలో ఉండగా,  చంద్రబాబు, లోకేష్, పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మౌనంగా ఉండటం ద్వారా వైసీపీ అతడుమావాడే అనే సంకేతాలు ఇచ్చింది. అయితే అధికారం కోల్పోయిన తరువాత బోరుగడ్డ జైలుకు వెళ్లిన సందర్భంలో వైసీపీకి చెందిన వారెవరూ కూడా బోరుగడ్డను పరామర్శించ లేదు. సరే బోరుగడ్డ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా తన వైఖరి మార్చుకోలేదు. నేతలపై అనుచిత వ్యాఖ్యలను మానలేదు. అదే సమయంలో తనకు జగన్ అండ ఉందనీ, తాను వైసీపీయుడనేననీ చెప్పుకుంటున్నాడు. అయితే జగన్ మాత్రం ఎవరైనా తనకు బలంగా ఉండాలి కానీ, తన బలం అండగా భావించకూడదు. వివాదాస్పద దర్శకుడు గతంలో తీసిన శివ అనే సినిమాలో విలన్ . ఎవరైనా మనకు బలం కావాలి కానీ మన బలంతో బతకకూడదు అనే డైలాగ్ చెబుతాడు. సరిగ్గా జగన్ తీరు కూడా అంతేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పదే పదే జగన్ పేరు వల్లిస్తూ, తనకు జగన్ అండ ఉందని చెప్పుకోవడం జగన్ కు, వైసీపీకీ నచ్చలేదు.  దీంతో జగన్ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్న బోరుగడ్డ అనల్ ను వైసీపీ వదిలించేసుకుంది.   పార్టీకీ బోరుగడ్డ అనిల్ కు ఏం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.  బోరుగడ్డ అనిల్ కుమార్ తో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటన విడుదల చేసింది. అతడు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లోనూ, సోషల్‌ మీడియా వేదికలపై కనిపించడం చెప్పుకోవడాన్ని వైసీపీ ఖండిస్తోందని పేర్కొంది. దీనిపై బోరుగడ్డ ఇంకా స్పందించలేదు. కానీ పరిశీలకులు మాత్రం బోరుగడ్డతో వైసీపీ బంధం ఒక్క ఖండన ప్రకటనతో తీరిపోయేది కాదంటున్నారు. 

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ అయ్యింది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీ పలు కీలక అంశాలపై చర్చించనుంది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడులలు అంశంపై కీలక చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది.  అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి    సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది. దీని ద్వారా  20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, దాదాపు 56 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇంకా పలు,  సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.  ఇక పోతే.. 169 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న  లోక్ భవన్ కు టెండర్లు పిలిచుందుకు,  జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు  పాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  సీడ్ యాక్సిస్ రహదారిని 16వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు నిధుల కేటాయింపునకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి.