పార్లమెంట్ లో కేసీఆర్ దొంగ సంతకాలు!
posted on Mar 1, 2021 @ 7:45PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలో తాను పార్లమెంటుకు హాజరు కాకున్నప్పటికీ, వచ్చినట్టుగా హాజరుపట్టికలో తన బదులు మరొకరితో సంతకాలు చేయించారని ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకుండానే హాజరైనట్టుగా మరొకరితో సంతకాలు చేయించారని వివరించారు.
కేసీఆర్ పార్లమెంటును తప్పుదోవ పట్టించడంపై తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని, చర్యలు తీసుకునే ధైర్యం బీజేపీకి ఉందా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పార్లమెంటులో ఆ సంతకాలు ఎవరివో బండి సంజయ్ ఫోరెన్సిక్ పరీక్ష చేయించగలడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పార్లమెంటుకు ఎన్నిసార్లు హాజరయ్యాడో చెప్పాలన్నారు కేసీఆర్.
బండి సంజయ్, కేసీఆర్ విడివిడిగా కనిపించినా, వారిద్దరూ ఒక్కటేనని అన్నారు. బండి, కారు ఒక్కటేనని విమర్శించారు. కేసీఆర్ చదువుకుంది బీఏనే అని, కానీ ఎంఏ చదువుకున్నట్టు పార్లమెంటుకు తప్పుడు సమాచారం అందించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.