చర్చీలకు ఎంపీ నిధులా? వైసీపీ మత రాజకీయాలపై విమర్శలు..
posted on Oct 27, 2021 @ 2:44PM
అయ్యవారు ఏమి చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని’ సామెత. అదీ కొంతవరకు నయమే, కానీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ధోరణి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. చేసిన తప్పులను దిద్దుకోవదానికి బదులుగా, ఏపీ ప్రభుత్వం చిన్న గీత పక్కన పెద్ద గీత గీసి, తప్పుల పద్దు పెంచుకుంటూ పోతోంది.జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం ఎంత అడ్డగోలుగా సాగుతోందో వేరే చెప్పనక్కర లేదు. రాష్ట్రంలో క్రైస్తవమత ప్రచారం మూడు ప్రార్థనలు, ఆరు గీతలుగా సాగిపోతోందనే విమర్శలు ఉన్నా.ి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం, మతం మార్పిడులు ప్రభుత్వ సహకారంతో అధికార కార్యక్రమాల స్థాయిలో జరిగి పోతున్నాయని అంటారు.
మంత్రులు, ఎమ్మెల్ల్యేలు, అధికారులు, చిన్నాపెద్ద నాయకులు ఎవరికివారు ముఖ్యమత్రిని ప్రసన్నం చేసుకుని ప్రయోజనం పొందేందుకు.’ఏసునామ’ సంకీర్తన దగ్గరి మార్గంగా భావిస్తున్నారనే టాక్ ఉంది. ఇక హిందూ దేవాలయాలపై జరుగు తున్న దాడులను ఇతోదికంగా ప్రోత్సహించడం, పాస్టర్లకు జీతాలు ఇచ్చి మత ప్రచారాన్ని ముందుకు తీసుకుపోవడం వంటి పవిత్ర కార్యాలను ముఖ్యమంత్రి స్వయంగా చూసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆ విధంగా ఏసు ప్రభువు రుణం తీర్చుకునే కార్యాన్ని దేవుని దయతో ముఖ్యమంత్రి చక్కగా సాగిస్తున్నారని అంటారు.
అంతే కాదు, టెండర్లు పిలిచి మరీ ప్రభుత్వ సొమ్ముతో, అవసరం అయితే హిందూ దేవాలయాల ఆదాయం నుంచి నిధులను మరల్చి మరీ, చర్చిల, నిర్మాణం మరమత్తులకు నిధులు సమకురుస్తున్నారు. పాఠ్య పుస్తకాలలో క్రైస్తవ మత ప్రచార పాఠాలు చేర్చారు. సో, ఎక్కడా ఏ చిన్న అవకాశం వదులుకోకుండా, జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రభువు సేవలో భాగంగా, క్రైస్తవ గ్రామాల నిర్మాణ క్రతువును అత్యంత వేగంగ్ సాగిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో క్రైస్తవ మిషనరీల మెప్పును, పొందుతోందని సువార్త సమాచారం.అందులో భాగంగా ఇప్పుడు, ఇటు స్వామి కార్యం, అటు స్వకార్యం కానిచ్చే విధంగా, కొందరు వైసీపీ ఎంపీలు గుట్టు చప్పుడు కాకుండా, తమ ఎంపీ నిధులను చర్చి నిర్మాణాలకు కేటాయిస్తున్నారు. మాములుగా అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చేది కాదేమో కానీ, వైసీపీ రెబెల్ ఎంపీ, వాసనా పసిగట్టి, వివరాలు సేకరించారు. అంతేకాదు, ఆయన ఇందుకు సంబంధించి నేరుగా ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై కేంద్రం ఆరా తీయడంతో ఏపీ ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లు తెలుస్తున్నది.
బాపట్లలో వైసీపీ ఎంపి నందిగం సురేష్ తన ఎంపీ లాడ్స్ నుంచి రూ 43 లక్షలు వెలమవారిపాలెం చర్చి మరమ్మతులు, పునర్మిర్మాణం కోసం కేటాయించడం అప్పట్లో వివాదంగా మారింది.అదేవిధంగా వివిధ జిల్లాల్లో వైసీపీ ఎంపీలు కమ్యూనిటీ హాలు నిర్మాణాల పేరిట ఇస్తున్న నిధులతో ముందు కమ్యూనిటీ హాళ్లు నిర్మించి, ఆ తర్వాత వాటిని చర్చిలుగా మారుస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని రఘురామ కృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోడీని స్వయంగా కలిసినప్పుడు ఫిర్యాదు చేశారు. తమ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను చర్చిలుగా మార్చేందుకు, తమ పార్టీ ఎంపీలు అధికారులపై ఒత్తిడి చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని కూడా అయన పేర్కొన్నారు.ఎంపీ నిధులతో చర్చిలు నిర్మించడం, మరమ్మతులు చేయడం చట్టవిరుద్ధమని రఘురామ కృష్ణం రాజు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. కాగా రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం క్రైస్తవ అనుకూల విధానాలు అవలంబిస్తోందని, మతమార్పిళ్లు శరవేగంగా జరుగుతోందని ఆయన ఇదివరకే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో కొందరు పోలీసు, ఐఏఎస్ అధికారులు బహిరంగంగా క్రైస్తవ వేదికలపై ప్రసంగాలు చేస్తున్నారని కూడా వెల్లడించారు.
అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్జ గన్ సీఎం అయిన తర్వాత క్రైస్తవులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినట్లు చెప్పిన వీడియాను కూడా, కృష్ణం రాజు ఇంతకు ముందే ప్రధాని కార్యాలయానికి అందించారు. క్రైస్తవ మతం మారిన దళితులు-రెడ్లకే జగన్మోహన్‌రెడ్డి సర్కారు కీలక పదవులిస్తోందని అంటూ ఆ జాబితాను కూడా ప్రధానికి అందించారు. హిందూ ఆలయాలపై వరసగా జరుగుతున్న దాడులను, ఏపీ ప్రభుత్వం అరికట్టలేక పోతోందని అంటూ గతంలో హోమ్ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో ఎంపీ నిధులతో చర్చి నిర్మాణాలు చేస్తున్నవిషయమై ఒక పత్రికలో వచ్చిన వార్తాకథనాన్ని జతపరుస్తూ ప్రధాని లేఖ రాశారు. ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీహాళ్లు తర్వాత చర్చిలుగా మారాయన్న ఆరోపణలపై, విచారణ జరిపించాలని ఎంపీ రాజు ప్రధానిని కోరారు.
జగన్ ప్రభుత్వం ఇప్పటికే రూ 25 కోట్లతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 248 చర్చిలు నిర్మించిందని, ఒక్కో చర్చికి రూ 84 వేల నుంచి కోటి రూపాయల వరకూ ఖర్చు చేసిందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు ఎంపీ రఘురామ రాజు. దానితో ఎంపీ లాడ్స్ నిధులను మత సంబంధ భవనాలకు కేటాయించడంపై ఏపీని కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్యకార్యదర్శికి కేంద్రం లేఖ వ్రాయడంతో జగన్ ప్రభుత్వం ఖంగు తిన్నట్లు తెలుస్తున్నది.