పోలీస్ స్టేషన్ లో సొమ్ము చోరీ.. తలలు పట్టుకున్న పోలీసులు
posted on Mar 17, 2021 @ 3:24PM
ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే ఎవరైనా పోలీసులకు కంప్లైన్ట్ చేస్తారు. మరి పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగితే ఎవరికి చెప్పుకోవాలి. అయినా అసలు ఈ దొంగలకు ఏమాత్రం భయం లేదనుకుంటా,.. ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఉన్న సొమ్మునే కాజేశారు.
ఘటన వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్ లో రూ, 8 లక్షల నగదు చోరీకి గురికావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులకు వరుసగా సెలువు లు రావడంతో ఎక్సైజ్ పోలీసులు స్థానికంగా ఉన్న నాలుగు వైన్ షాపులకు సంబంధించిన రూ. 8 లక్షల నగదును వీరవాసరం పోలీస్ స్టేషన్ లో దాచారు. అయితే ఈ నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ఇవాళ స్టేషన్ కు వచ్చిన ఎక్సైజ్ పోలీసులు నగదు కన్పించకుండా పోవడంతో షాక్ కు గురయ్యారు. దీంతో విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు స్థానిక పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క పోలీస్ స్టేషన్ లో దాచిన నగదు ఎలా మాయమైందనే విషయమై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.