అమ్మా..ఆగు, నేనూ వస్తా!
posted on Sep 14, 2022 @ 11:16AM
నడకనేర్చినప్పటి నుంచి తల్లితో అలా షికారుకి వెళ్లడం పిల్లలకు సరదా. నడవగలనన్న నమ్మకం, పక్కనే అమ్మ చేయిపట్టుకున్నానన్న నమ్మకం అలా నడిపిస్తుంది. ఆ తర్వాత స్కూలుకి వెళ్లడం, స్నేహితులు ఏర్పడినా అమ్మతో ఎక్కడికన్నా వెళ్లడానికే పిల్లలు బాగా యిష్టపడతారు. తనకు తెలీ కుండా వెళ్లినా, పిల్లడికి కనపడితే ముద్దుగా అలిగి, వెంట పరిగెడతారు..అదో అందం. దీనికి జంతు వులూ మినహా యింపు కావు. జంతువుల్లోనూ ఆ తల్లి, పిల్లల ప్రేమ ఉంటుంది. ఇక్కడో గుర్రం ఓ బస్సు దగ్గరకి పరుగున వచ్చింది. బస్సు మీద మరో గుర్రం బొమ్మ చూసి, తన తల్లే అనుకుంది!
బస్సు మీద ఏదో యాడ్ తాలూకు గుర్రం బొమ్మ. ఆ బస్సు వెళుతూంటే ఓ గుర్రం చూసింది. అయ్యో అమ్మ తనని పిలవకుండా, ఎటో వెళిపోతోందని అనుకుంది. అంతే దాని వెంటపడింది. బస్సు వెళుతోం టే తల్లి దూరమవుతోన్న బాధతో ఈ గుర్రం కూడా పరిగెట్టింది. ఆ బస్సు ఆగగానే దగ్గరికి వెళ్లి తల్లిలా ఉన్న గుర్రం బొమ్మని మూతితో తాకింది, తల్లిని ముద్దెట్టుకున్నట్టు. బస్సువాడు టీ కోసమో, టిఫిన్ కోసమో ఆగినట్టు న్నా డు. అది ఈ గుర్రానికి నచ్చింది. అచ్చం తల్లితో మాట్లాడుతున్నట్టు ఆ బొమ్మను చూస్తుండిపోయింది.
తల్లి ని చూసిన అనుభవంతో అదేం మాట్లాడుతోందో మనకు తెలుసుకోలేం. కానీ దాని బాధ మాత్రం తెలుస్తుంది. నిజంగానే తల్లి తనను వదిలేసి ఎటో వెళిపోతోందన్న బాధతో కుమిలిపోతోంది. ఇక ఆ బస్సు ఎటు వెళితే అటు వీలయినంత వేగంగా వెంబడిస్తుందేమో! తల్లి పట్ల ప్రేమ ఎంత కష్టాన్న యినా మరిపి స్తుంది.
తమిళనాడు కోయంబత్తూర్ పేరూరు పట్టీశ్వర్ ఆలయం సమీపంలోని బస్ స్టాండ్ దగ్గర ఈ దృశ్యాన్ని వీడియోలో బంధించారు. ఇపుడిది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.