తెలంగాణలో విస్తృతంగా SVEEP ప్రచారం
posted on Sep 14, 2022 @ 11:25AM
* తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా SVEEP ప్రచారం ప్రారంభమైంది.
* 69 లక్షల మంది ఓటర్లు తమ ఆధార్‌ను ఓటర్ కార్డులకు అనుసంధానం చేశారు.
* జిల్లా ఎన్నికల అధికారులు పెద్ద ఎత్తున SVEEP కార్యకలాపాలను చేపట్టారు.
* స్వయం సహాయక బృందాలు, అంగన్‌వాడీలు ఓటరుతో ఆధార్ అనుసంధానంపై ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఫోటో ఎలక్టోరల్ రోల్స్ 2023 యొక్క ప్రత్యేక సమ్మరీ రివిజన్ కి సంబంధించి విస్తృతంగా SVEEP ప్రచారం జరుగుతోందని ప్రధాన ఎన్నికల అధికారి (CEO) శ్రీ వికాస్ రాజ్ అన్నారు. స్వయం సహాయక బృందాలు(SHGs) మరియు అంగన్‌వాడీల నేతృత్వంలోని SVEEP కార్యాచరణలో 69 లక్షల మంది ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటరు కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేశారని ఆయన చెప్పారు.
సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం ని SVEEP అని పిలుస్తారు. ఇది ఓటర్లకు అవగాహన కలిగించడం కోసం భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కార్యక్రమం.
పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & పట్టణాభివృద్ధి శాఖ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం మరియు ఆరోగ్య శాఖలతో సమన్వయం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఈవో శ్రీ వికాస్ రాజ్ తెలిపారు. వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ సిబ్బంది తమ తమ జిల్లాల్లో SVEEP కార్యక్రమాలను వేగవంతం చేశారు.
SHG సమావేశాలను ఏర్పాటు చేయాలని మరియు ఫారం-6b ని ఉపయోగించి ఆధార్ అనుసంధానంపై SHG మహిళలకు అవగాహన కల్పించాలని SERP డైరెక్టర్ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ కి సూచించారు.
ఆధార్ అనుసంధానం మరియు ఓటరు నమోదు గురించి పౌరులందరికీ అవగాహన కల్పించడానికి ప్రత్యేక గ్రామసభను ఏర్పాటు చేయాలని PR & RD డిపార్ట్‌మెంట్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించింది.
సీఈవో శ్రీ వికాస్ రాజ్ మాట్లాడుతూ SHG సమావేశాల సమయంలో ఉపయోగించే పోస్టర్లు SHG గ్రూప్స్ కోసం జిల్లా నోడల్ అధికారికి అందించామని తెలిపారు.
సెప్టెంబరు 12 నుంచి 16వ తేదీలోపు అంగన్‌వాడీలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు ఆధార్ అనుసంధానం, ఎన్‌రోల్‌మెంట్‌పై అవగాహన కల్పించాలని అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లను ఆదేశించారు.