మోహన్ బాబు ఏ పార్టీలోకి?
posted on Apr 23, 2013 @ 12:29PM
తెలుగు సినిమా ప్రముఖ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ''ఇవాళ ఒక్క సినిమా హిట్టయితే 'నేనే ముఖ్యమంత్రి' అనుకునే వాళ్లున్నారు. కానీ అది కొంతమందికే చెల్లింది. సినిమా వేరు. రాజకీయం వేరు. ప్రజలకు నిజంగా మేలు చేసేవాడే రాజకీయ నాయకుడు. అటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు'' అని అన్నారు. 2014లో తాను రాజికియల్లోకి వస్తానని, ఏ పార్టీలో చేరతాననేది ఇప్పుడే చెప్పను. సందర్భం వచ్చినప్పుడు చెబుతా. చేరేది పాత పార్టీయా, కొత్త పార్టీయా అనేది అప్పుడే చెబుతా. దైవసాక్షిగా చెబుతున్నాను. నేను ఏ పార్టీలో చేరితే దానికి ప్రచారం కోసం వెళ్తాను తప్ప మనసా, వాచా ఒక పదవి అలంకరించాలని లేదు. రాజకీయంగా నేను నెంబర్‌వన్ కావాలని కోరుకోవడం లేదని చెప్పారు.