Read more!

ఢిల్లీ విమానాశ్రయంలో ముందు జాగ్రత్త చర్యలు

 

 

 

పాకిస్థాన్ వాణిజ్య రాజధాని కరాచీలో పదిమంది తెహ్రీక్-ఎ- తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు 48 గంటల వ్యవధిలో రెండుసార్లు దాడులకు పాల్పడ్డారు. భారీ భద్రత వుంటుందని తెలిసి కూడా రెండుసార్లు కరాచీ విమానాశ్రయంపై దాడి చేసి మొత్తం 27 మందిని కాల్చి చంపారు. ఈ సంఘటన భారత ప్రభుత్వంలో కదలిక తెచ్చింది.

 

కరాచీ ఎయిర్‌పోర్టు మీద జరిగిన తరహాలోనే ఢిల్లీలోని విమానాశ్రయం మీద ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు దగ్గర సెక్యూరిటీ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ తదితర ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సంస్థలన్నీ రంగంలోకి దిగి ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నాయి.

ఒకవేళ ఢిల్లీ ఎయిర్‌పోర్టు మీద ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా సమర్థంగా తిప్పికొట్టాలన్న అంశం మీద వ్యూహరచన ఈ సందర్భంగా చేశారు. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు.