ఆ రేపిస్టులంతా బీహారీలే : రాజ్ థాకరే
posted on Jan 7, 2013 8:41AM
బీహారీలఫై మరో సారి విరుచుకు పడ్డారు మహారాష్ర్ట నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్ థాకరే. గత నెల ఢిల్లీ లో ఓ పారా మెడికల్ స్టూడెంట్ ఫై రేప్ చేసిన వ్యక్తులంతా బీహార్ నేపధ్యం కలిగిన వారేనని రాజ్ థాకరే అన్నారు. ఆ కామ పిశాచాలంతా బీహార్ నుండి వలస వచ్చిన వారేనని రాజ్ వెల్లడించారు.
‘అసలు వీరంతా ఎవరు ? ఎక్కడ నుండి వచ్చారని ఎవరూ ప్రశ్నించడం లేదు.వారంతా బీహార్ వారేననే విషయంఫై ఎవరూ ఎందుకు స్పందించడం లేదు? బీహార్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే నాఫై కేసులు పెట్టారు’, అని రాజ్ పేర్కొన్నారు. వారంతా బీహార్ వారేననే విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా కొంత మంది జాగ్రత్త పడుతున్నారని రాజ్ వ్యాఖ్యానించారు.
ఢిల్లీ రేప్ ఘటన తనను మనో వేదనకు గురి చేసిందని రాజ్ అన్నారు. ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వారి వల్లే ఢిల్లీ లో నేరాలు ఎక్కువయ్యాయని ముఖ్య మంత్రి షీలా దీక్షిత్ కూడా ప్రకటించారని రాజ్ గుర్తు చేశారు.
ఇక ఈ విషయం ఫై ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి నితీష్ కుమార్ ఎలా స్పందిస్తారో మాత్రం వేచి చూడాల్సిందే.