ఢిల్లీ గ్యాంగ్ రేప్: విక్టిమ్ పేరు జ్యోతి సింగ్

 

 

గత నెల 16 వ తేదీన ఢిల్లీ లో అత్యాచారానికి గురి అయి ఆ తర్వాత మరణించిన పారా మెడికల్ స్టూడెంట్ పేరు జ్యోతి సింగ్ పాండే. ఈ విషయాన్ని ఆమె తండ్రి బద్రీ సింగ్ పాండే వెల్లడించారు. లండన్ నుండి ప్రచురితమయ్యే ‘ద డైలీ మిర్రర్’ ప్రత్రిక’ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన తన కుమార్తె పేరును ప్రకటించారు.

 

ఈ కధనాన్ని ఆ పత్రిక నిన్నటి ఎడిషన్ లో ప్రకటించింది. జ్యోతి తల్లి పేరు ఆషా. జ్యోతి కి గౌరవ్ సింగ్, సౌరవ్ సింగ్ అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో బద్రీ లోడర్ గా పనిచేస్తుంటారు. అయితే, తన కుమార్తె జ్ఞాపకాలు ఆయనను వెంటాడుతూ ఉండటంతో ఆయన ఉత్తర ప్రదేశ్ లోని తన స్వస్థలానికి వెళ్ళిపోయారు.

 

‘నా కుమార్తె ఏ తప్పూ చేయలేదు. ఆమె తనను తాను రక్షించుకొనే ప్రయత్నంలోనే చనిపోయింది. ఆమె అసలు పేరు ప్రపంచానికి తెలవాలని నేను కోరుకుంటున్నాను. అలా చేయడం వల్ల ఇలా అత్యాచారాలకు గురి అయిన ఇతర మహిళలకు దైర్యం లభిస్తుంది’, అని బద్రీ అన్నారు.

 

భారతీయ చట్టాల ప్రకారం అత్యాచారానికి గురి అయిన మహిళల పేర్లను వెల్లడించడం చట్ట విరుద్దం కాబట్టి దేశంలోని ఏ మీడియా సంస్థ ఆమె పేరును బయట పెట్టలేదు. అయితే, ఆ బాధితురాళ్ళ పేరును, ఆమె మరణించినట్లయితే ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో మాత్రం వెల్లడించవచ్చు.

Teluguone gnews banner