ఎమ్మెల్యే కారు ఢీకొని....

 

ఎమ్మెల్యే కారు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వరంగల్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలోని బోడగుట్టకు చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి మహ్మద్ సర్వర్ కుమారుడు ఖాజా సహేర్ అలీ (26) తన స్నేహితుడు గౌస్ పాషాతో కలసి బైక్‌పై ప్రయాణిస్తు్న్నాడు. హన్మకొండలో జరిగిన ఒక వివాహానికి హాజరై వీరు తిరిగి వెళ్తున్నారు. జూబ్లీ మార్కెట్ సమీపంలో వీరి వాహనం రోడ్డు దాటుతూ వుండగా హైదరాబాద్ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సాహెర్ అలీకి తీవ్ర గాయాలై, హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. గౌస్ పాషా పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది.

Teluguone gnews banner