టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర
posted on Aug 29, 2025 @ 6:08PM
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర పన్నిట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బే అంటూ కొందరు మాట్లాడుకుంటున్నట్లు వీడియోలో ఉంది. ఆయన హతమార్చేందుకు కొందరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు విశాఖ జైలు ఖైదీ శ్రీకాంత్‌కు ప్రధాన అనుచరుడని జగదీశ్ అని సమాచారం.
ప్రస్తుతం ఈ వీడియోపై ఎస్పీ శ్రీకాంత్ విచారణ జరుపుతుమన్నారు. ఫూటుగా మద్యం సేవించి ప్లాను గురించి చర్చిస్తున్న రౌడీషీర్లు జగదీశ్, మహేశ్, వినీత్, మరో ఇద్దరు చంపేయాలని అయిదుగురు రౌడీషీటర్లు మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో అంశం తన దృష్టిలో ఉందని ఎస్పీ. విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నని ఎస్పీ తెలిపారు