ఒక్క ఓటు ఎక్కువొచ్చినా రాజీనామా... రేవంత్ కు ఎమ్మెల్యే గండ్ర సవాల్
posted on Oct 1, 2021 @ 9:53PM
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్లు మొదలు కావడంతో రాజకీయ వేడి పెరిగిపోయింది. పార్టీలు దూకుడు పెంచాయి. గురువారం భూపాలపల్లిలో జరిగిన సభలో టీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి. రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన ఓట్ల కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి. తన భార్య జడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తుందని చెప్పారు. తమ జీవితం ప్రజా సేవకే అంకితమన్న గండ్ర.. తన సవాల్ ను ధమ్ముంటే రేవంత్ రెడ్డి స్వీకరించాలని సవాల్ చేశారు. పొద్దున్న లేస్తే ఏసీబీ కోర్టులో నాంపల్లి కోర్టులో ఉండే రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి.
చిలుక పలుకులు పలుకుతున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకుని దండయాత్ర చేసిన సంగతి తెలంగాణ ప్రజలెవరు మర్చిపోలేదన్నారు గండ్ర, రేవంత్ కు రైఫీల్ రెడ్డి గా కూడా నామకరణం చేయడం జరిగిందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. ఆమెను బలి దేవత అని రేవంత్ రెడ్డి విమర్శించారని చెప్పారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50 లక్షలు పట్టుకుని ఒక్క MLA దగ్గరికి బేర సారాలకు పోయి అడ్డంగా దొరికిన గజ దొంగ రేవంత్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే గండ్ర. అడ్డంగా దొరికిన దొంగ తనను అమ్ముడుపోయాడని విమర్శించడం సిగ్గుచేటుగా ఉందన్నారు.
మిస్టర్ రేవంత్ ఓపెన్ చాలెంజ్ చేస్తున్నా.. త్వరలో జరుగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన నా MLA పదవికి,నా భార్య జడ్పీ చైర్పర్సన్ పదవి కి రాజీనామా చేసి మా రాజకీయ జీవితానికి స్వస్తి పలుకుతా అంటూ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ చేశారు భూపాపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి.