పదమూడేళ్ల బాలికపై బహిరంగ అత్యాచారం
posted on Oct 16, 2012 @ 11:28AM
పదమూడేళ్ల బాలికపై ముఫ్పై ఏళ్ల కామాంధుడు అత్యాచారం చేశాడు. చాక్లెట్లు కొనిస్తానని ఆశపెట్టి తనింటికి పిల్లను తీసుకెళ్లి దారుణంగా చెరిచాడు. పైగా తనలో ఉన్న వికృత మానసిక రూపాన్ని కూడా ప్రదర్శించాడు. బాధితురాలితోపాటు చదువుతున్న మరో నలుగురు పిల్లల్నికూడా తీసుకెళ్లి వాళ్లు చూస్తుండగానే అత్యాచారం జరిపాడు. తను చేస్తున్న వెధవపనిని చూస్తూ ఉండాలని ఆదేశాలు జారీచేశాడు. విజయనగరం జిల్లా తోటపాలెంలో ఈ దారుణం జరిగింది. భార్య ఇంట్లో లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు బాధితురాలి ఒంటిమీద బట్టలన్నీ తీసేసి తన సెల్ ఫోన్ కెమెరాతో ఫోటోలు తీశాడు. పక్కనే ఉన్న మరో నలుగురు బాలికల్నికూడా ఇలాగే ఫోటోలు తీసి, జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ ఫోటోలు అందరికీ పంచుతానని బెదిరించాడు. బాధితురాలితోపాటు ఉన్న పిల్లల్లో పదేళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలు కూడా ఉండడంతో వాళ్లకి నిందితుడి బెదిరింపు అంతగా పట్టలేదు. జరిగిన విషయాన్ని స్కూల్లో టీచర్లకు చెప్పడంతో వాళ్లు తల్లిదండ్రుల్ని పిలిపించారు.
బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభంశుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యం జరిపిన నిందితుడిని దారుణంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.