లోకేష్ గురించి మాట్లాడటం పరమ వేస్ట్.. మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు
posted on Oct 27, 2020 @ 7:39PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కొద్దీ రోజులుగా వరద బాధితులను ప్రమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నిన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో వరద బాధిత ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను కంట్రోల్ చేసి లోకేష్‌ను కిందికి దించేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే ఈ ఘటనపై కొందరు వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో వరదలు ఎప్పుడు వచ్చాయి? లోకేష్ ఎప్పుడు పరామర్శిస్తున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుందని లోకేష్ తీరును తప్పు పట్టారు. మొదటి ట్రిప్పు తలకాయ ఉన్న వాడు కొల్లేరులో పెట్టుకుంటారా..?. లోకేశ్ ది అంతా ఆఫ్ నాలెడ్జ్ అని నాని అన్నారు. పార్టీని నడపడం రాదని... అంతేకాకుండా ట్రాక్టర్ నడపడం కూడా రాదని అయన విమర్శించారు. నిన్న కొల్లేటిలోకి ట్రాక్టర్ ను ఎలా దించాడో తెలుగుదేశం పార్టీని కూడా అలాగే దించేస్తాడని అన్నారు. బుద్ధి ఉన్నోడు ముందుగా దిగిపోండి ట్రాక్టర్ నుండి పార్టీ నుండి కూడా.. టోటల్ గా లోకేశ్ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా వేస్ట్ అని కొడాలి నాని చెప్పారు.