నాంపల్లి కోర్ట్ కి మంత్రి ధర్మాన
posted on Sep 25, 2012 @ 10:27AM
జగన్ అక్రమ ఆస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు నేడు నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరు కానున్నారు. ఆయనతోపాటు సీనియర్ ఐఏఎస్‌లు మన్మోహన్‌సింగ్, శామ్యూల్ కూడా కోర్టుకు రానున్నారు. ఇదే కేసులో ఇప్పటికే చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి వెంకట రమణలను కూడా పోలీసులు కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. ఇక, ఓఎంసీ అక్రమాల కేసులో గాలి జనార్దన రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. దీంతో, నాంపల్లి సీబీఐ కోర్టులో మంగళవారం రోజంతా కేసుల హడావుడి కొనసాగనుంది.'ప్రముఖులు' అంతా ఒకేరోజు కోర్టుకు హాజరు కానుండడంతో పోలీసులు కూడా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.