అసదుద్దీన్ భాయ్‌కి నోటీసులు
posted on Feb 19, 2015 @ 7:22PM
ఎం.ఐ.ఎం. పార్టీ నాయకులు, సోదరులు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద ప్రసంగాలు చేయడంలో స్పెషలిస్టులనే విషయం తెలిసిందే. వీళ్ళు ఎక్కడైనా బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఎలాంటి కామెంట్లు చేస్తారో అని పోలీసులు అదిరిపోతూ వుంటారు. వీళ్ళ సభలకు అనుమతులు నిరాకరిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బెంగుళూరులో ఈనెల 21వ తేదీన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. అయితే బెంగళూరు పోలీసు అధికారులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. ఆ విషయాన్ని అసదుద్దీన్‌కి బుధవారం నాడు నోటీసుల ద్వారా తెలియజేశారు. తమరు బెంగళూరులో నిర్వహించ తలపెట్టిన సభకు అనుమతి ఇవ్వడం లేదంటూ ఆ నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇక్కడ వెరైటీ ఏమిటంటే, తనకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన పోలీసులకు అసదుద్దీన్ గులాబీలు ఇచ్చి పంపించారు.