భార్యను ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు
posted on Aug 24, 2025 @ 12:49PM
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వికారాబాద్‌కు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి అలియాస్ జ్యోతి ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గతంలో అదే ఇంట్లో సంవత్సరం ఉన్న ఈ జంట ఖాళీ చేసి వెళ్లి... మళ్లీ అదే ఇంట్లోకి 25రోజుల క్రితమే వచ్చారు.
ఏం జరిగిందో తెలియదు కానీ భర్త మహేందర్ రెడ్డి తన గర్భవతైన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఏ చిన్న ఆధారం కూడా లభించకుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి నల్లని ప్లాస్టిక్స్ లలో చుట్టి మూసి నదిలో పడ వేశాడు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అమ్మాయి బావ పోలీసులకు సమాచారాన్ని అందించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకొని... ఇంట్లో లభించిన చాతి భాగంలో ఉన్న భాగం మాత్రమే పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాళ్లు చేతులు తల వేరుచేసి ఎక్కడో వేసినట్లు తెలుస్తుంది. చేతులు భుజాల వరకు, కాళ్లు గజ్జల వరకు, అలాగే తల కట్ చేసినట్లు సమాచారం... మిగతా పార్ట్స్ కోసం పోలీసులు మూసీ నదిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కూతురు హత్యకు గురైనట్లు తెలియగానే స్వాతి తల్లి కన్నీరు మున్నీరుగా వినిపించింది.
స్వాతి తల్లి
డిగ్రీ చదువుతున్న నా కూతురికి ఇంటి పక్కనే ఉంటున్న మహేందర్ మాయమాటలు చెప్పి ప్రేమ అనే వలలో దింపాడని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది . నా కూతురు అతని ప్రేమ నిజమని నమ్మింది. మేము వద్దని వారించిన కూడా అతనే పెళ్లి చేసుకుంది. లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిన తర్వాత మంచిగా ఉండమని చెప్పి బంగారం, డబ్బు లిచ్చి పంపామని తెలిపింది. కొన్ని రోజుల నుంచి నా కూతుర్ని చిత్ర హింసలు పెడుతున్నట్లుగా చెప్తుంది.
మహేందర్ తనను ఎప్పుడైనా చంపు తాడని భయం వ్యక్తం చేసిందని తనతో చెప్పిందని తల్లి వాపోయింది. మహేందర్ తన తల్లిదండ్రులతో కలిసి తన కూతుర్ని చంపేశాడని స్వాతి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని రోజుల నుంచి నా కూతురుతో ఫోను కూడా మాట్లాడ నివ్వలేదు..దొంగ చాటుగా నా కూతురు ఫోన్ లో మాట్లాడితే కొట్టేవాడు.నా కూతుర్ని కిరాతకంగా చంపిన మహేందర్ కి ఉరిశిక్ష వేయాలని స్వాతి తల్లి కోరింది.