ఒకే ఇంట్లో నలుగురు ఆడ బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు
posted on Aug 24, 2025 @ 1:14PM
చదువుతో పేదరికాన్ని జయించొచ్చని నిరూపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు అక్క చెల్లెళ్ల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వేపమాకులపల్లికి చెందిన గౌరమ్మకు నలుగురు ఆడ బిడ్డలు పదేళ్ల కిందట భర్త చనిపోవడంతో కూలీ పనులు చేస్తూ బిడ్డలను చదివించారు.పెద్దకుమార్తె వీణాకుమారి 2014లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు.
వాణి 2016లో ఎస్జీటీ టీచర్‌గా ఎంపికయ్యారు. నెల క్రితం వనజాక్షి కానిస్టేబుల్ జాబ్‌కి సెలక్ట్ అయ్యారు. తాజాగా డీఎస్సీలో శిరీష ఎస్జీటీ పోస్ట్ సాధించారు. అయితే ఆ తల్లి పేరును, వంశ గౌరవాన్ని నిలిపిన నలుగురు కుమార్తెలు (దేవతలు) నిజంగా సరస్వతులే.తల్లి దినసరి కూలిగా పనిచేస్తూ పెంచి, పెద్ద చేసి ఉన్నత చదవులు చదివించింది.
ఆర్థిక వనరులు లేక కుటుంబ ఇబ్బందులతో ఇలాంటి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే సాధ్యంకాని రీతిలో వీరు మనకు మన పిల్లలకు భావి భారత పౌరులకు స్పూర్తి దాయకం. వెయ్యి ఏనుగుల బలం, వారి ధృఢ సంకల్పం, ఆత్మ విశ్వాసం చూస్తే మనం నమ్మలేని నిజాలుగా ఉన్నాయి, ఒకే కుటుంబంలో ఇద్దరు పోలీస్, మరో ఇద్దరు ఉపాధ్యాయిని లు కావడమే గొప్ప. ఆ విధంగా పెంచి పోషించిన ఆ మాతృమూర్తికి శతకోటి వందనాలు అలాగే ఇంతటి అత్యున్నత స్థాయికి చేరుకున్న ముగ్గురు అక్క చెల్లెళ్లకు అభినందనలు.