మసాజ్ కోసమెళ్తే ఎయిడ్స్ వచ్చింది!
posted on Jun 18, 2014 @ 4:22PM
బెంగుళూరులో ఓ పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే ఓ యువకుడు ఓరోజు ఇంటర్నెట్‌లో బెంగుళూరులోని ఓ మసాజ్ సెంటర్‌కి చెందిన ప్రకటన చూశాడు. అందమైన యువతులతో ‘సరసమైన’ ధరలకు మసాజ్ చేస్తామనేది ఆ ప్రకటన సారాంశం. సదరు ప్రకటన చూడగానే ఆ కుర్రాడికి ఉత్సాహం వచ్చేసింది. ముందూ వెనుక ఆలోచించకుండా రయ్యిమంటూ మసాజ్ సెంటర్‌కి వెళ్ళాడు. అక్కడ కొంతమంది అమ్మాయిలు అతనికి మసాజ్ చేయడం ప్రారంభించారు. అసలే కుర్రాడు. మసాజ్ చేసేది అందమైన అమ్మాయిలు. దాంతో అతగాడు రెచ్చిపోయాడు. ఆ తర్వాత మసాజ్ సెంటర్ నుంచి సంతోషంగా బయటకి వచ్చాడు. రెండు మూడు నెలల తర్వాత పదేపదే జ్వరం వస్తూ వుండటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో ఆ యువకుడు డాక్టర్ దగ్గరకి వెళ్ళాడు. డాక్టర్ ‘అన్నిరకాల’ పరీక్షలుచేసి, ఆ యువకుడికి ఎయిడ్స్ వచ్చిందని చెప్పేశాడు. దాంతో గుండె పగిలినంత పని అయిన ఆ యువకుడు తల బాదుకుని ఏడ్చాడు. ఆరోజు మసాజ్ సెంటర్‌లో తాను రెచ్చిపోయి అడ్వాన్స్ అవడం వల్లే తనకి ఈ ప్రాణాంతక వ్యాధి వచ్చిందని అర్థం చేసుకున్నాడు. తనకు పట్టిన గతి మరెవరికీ పట్టకూడదన్న ఉద్దేశంతో బెంగుళూరు పోలీసు కమిషనర్‌కి అసలు విషయమంతా మెయిల్ చేశాడు. మసాజ్ కేంద్రం వివరాలన్నీ ఇచ్చాడు. దాంతో పోలీసులు సదరు మసాజ్ సెంటర్ మీద ఆకస్మిక దాడులు చేసి అక్కడ మసాజ్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న యువతులని, ఆ సెంటర్ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఇది బెంగుళూరు నగరంలో తాజాగా జరిగిన విషయం. ఇలాంటి మసాజ్ సెంటర్లు హైదరాబాద్‌లో కూడా బోలెడన్ని వున్నాయి. యువతరం జాగ్రత్తగా వుండాలిమరి..