పెళ్లి మొగుడితో .. రొమాన్స్ ప్రియుడితో..
posted on Jun 12, 2021 @ 6:08PM
పెళ్లి ఒక్కడితో కాపురం మరొకడితో ఈరోజుల్లో ఇది మామూలే అయిపొయింది.. ఎంత మామూలైయిందంటే మనం ఒక హోటల్ కి వెళ్లి ఏ టీ యో టిఫినో చేసినంత ఈజీ అయిపొయింది నేటి తరం వాళ్ళకి.. భర్తకు ఆఫీస్ ఉంటే భర్త అవుట్ ప్రియుడికి ప్రియుడు ఇన్ ఇలా ఎంతో మంది పెళ్లి అయ్యాక అక్రమ సంబంధం పెట్టుకుని చివరికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు..పెళ్లి తర్వాత కూడా పలువురు రహస్యంగా నెరుపుతున్న వివాహేతర సంబంధాలు కాపురాలను నాశనం చేస్తున్నాయి. కుటుంబ పరువు ప్రతిష్ఠలు రచ్చకెక్కుతున్నాయి. తాజాగా ఒక భార్య ప్రియుడితో రాసలీలలు నడుపుతూ భర్త కు రెడ్ హ్యాండెడ్.. అది ఎక్కడ జరిగిందో..? ఆ తరువాత ఏం జరిగిందో మీరే తెలుసుకోండి..
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో భార్యా భర్తలు నివాసం ఉంటున్నారు. పెళ్లి జరిగిన తరువాత కూడా తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న విషయం తెలిశాక భర్త భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. అయినా ఆమె వినలేదు. భర్త మాటలను పెడచెవిన పెట్టింది. రహస్యంగా ప్రియుడితో ఏకాంతంగా కలుస్తూనే ఉంది. ఇది గమనించిన భర్త వారిద్దరూ బెడ్ రూంలో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అంతేకాదు వారిద్దరినీ గదిలో పెట్టి తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ తర్వాతే లోపల ఉన్నవారు ఆ భర్తకు, పోలీసులకు ట్విస్ట్ ఇచ్చారు. చాలా సేపు బయటకి రాలేదు..లోపలే గడియ పెట్టుకున్నారు.. పిలిస్తే పలికారు.. చుస్తే కనిపించరు. చుక్కలు చూపించారు. వివాహేతర జంటను పట్టుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. దాదాపు 4 గంటల వరకు గదిలోనే గడిపాక ఎట్టకేలకు తలుపు తీశారు. ఆ తర్వాత వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు.