మమతా అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వం

 

యూపీఏకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాను అంటున్న మమతకు మద్దతు ఇవ్వడానికి సీపీఎం ఒప్పుకోవడం లేదు. ఈ మేరకు సీపీఎం నాయకుడు ప్రకాశ్ కారత్ ఈ విషయాన్ని ప్రకటించాడు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంపై మమతా బెనర్జీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని కారత్ స్పష్టం చేశాడు. ఎఫ్ డీఐలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకునేందుకు మమత అన్ని పార్టీల నాయకులను స్వయంగా కలుస్తోంది. ఇప్పటికే సీపీఐ మమత తరపున ఓటింగ్ లో పాల్గొంటామని ప్రకటించింది. మమత పెట్టే అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉంటుందని తెలిపింది. అయితే సీపీఎం మాత్రం అందకు సమ్మతించడం లేదు. ఇక బీజేపీ ఈ విషయంపై చర్చించాలని ఇది వరకే ప్రకటించింది. ఒకవేళ బీజేపీ అవిశ్వాసానికి అనుకూలంగానే నిలబడ్డా…ఎస్సీ, బీఎస్పీల చేతిలోనే అవిశ్వాస తీర్మానం ఊపిరి ఉంటుంది. వారు అనుకుంటే యూపీఏను దింపడం పెద్ద విషయం కాదు.

Teluguone gnews banner