కసబ్ ఉరిని పాక్ కు ప్యాక్స్ చేశాం : షిండె
posted on Nov 21, 2012 @ 10:39AM
ముంబై మరణ మరణహోమంలో సజీవంగా పట్టుబడ్డ పాక్ జాతీయుడు అజ్మల్ కసబ్ ఉరిశిక్ష అమలు చేసినట్లు కేంద్ర హో౦మంత్రి సుశీల్ కుమార్ షిండె తెలిపారు. మరణ శిక్షపై కసబ్ పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ ను తిరస్కరిస్తూ రాష్ట్రపతి తనకు పంపినట్లు వెల్లడించారు. పిటిషన్ తిరస్కరణ అనతరం పూణే లోని ఎర్రవాడ జైలులో ఉరిశిక్ష అమలు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వానికి చేరవేసినట్లు చెప్పారు. కసబ్ మృతుదేహం పంపమని ఆ దేశం కోరలేదని పేర్కొన్నారు. ఉరిశిక్ష రహస్యంగా అమలు చేయడం తప్పనిసరని చెప్పారు. 26/11 ముంబాయి దాడులకు సంబంధించి న్యాయ విచారణ పూర్తియినట్లు వెల్లడించారు.