మహేశ్ అందుకే దత్తత తీసుకున్నాడు.. తేజ
posted on Sep 10, 2015 @ 3:48PM
శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో మహేశ్ బాబు గ్రామాన్ని దత్తత తీసుకొని రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడయ్యాడు. ప్రకాశ్ రాజ్ కూడా తెలంగాణలో ఒక గ్రామాన్ని.. ఏపీలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నా ఏపీలో తీసుకోవాల్సి ఉంది. అయితే మహేశ్ బాబు.. ప్రకాశ్ రాజ్ లు చేసిన ఈ పనిని శ్రీమంతుడు సినిమా ఆదర్శంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు. కాని వారు గ్రామాన్ని దత్తత తీసుకున్నది అందుకు కాదంటం దీనివెనుక వేరే కారణముందట. అది ఏంటనేగా మీ డౌట్.. దర్శకుడు తేజ సెలబ్రిటీలు గ్రామాలు దత్తతపై సంచలమైన కామెంట్లు చేశారు.
తేజ దర్మకత్వం వహించిన హోరాహోరీ సినిమా రిలీజ్ సందర్బంగా జరిగిన ప్రెస్ మీట్ లో మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ గ్రామాల్ని దత్తత తీసుకోవడంపై మీ స్పందన ఏంటని అడుగగా దానికి ఆయన సమాధానం చెప్పకపోగా వారు శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితోనే గ్రామాల్ని దత్తత తీసుకున్నారా అని ఎదురుప్రశ్న వేశారు? వారు కేవలం ఐటీ డిడక్షన్ కోసమే గ్రామాలను దత్తత తీసుకున్నారని... సామాజిక సేవ చేసే సంస్థలకు పన్ను రాయితీ ఉండదని అందుకే అందరూ ఆపనిలో పడ్డారని కామెంట్స్ చేశారు. మహేష్ బాబు గ్రామాల దత్తత కార్యక్రమం కూడా ఇదే కోవకు చెందిందేనని తేజ కామెంట్ చేశారు. నిజంగా సేవ చేయాలని వుంటే ఒక్కడు సినిమా తర్వాతే గ్రామాన్ని దత్తత తీసుకుని చేసి వుండొచ్చు కదా అని తేజ ప్రశ్నించారు. అయితే తేజ నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ఎటువంటి మొహమాటం లేకుండా చెపుతాడు అని అందరూ అనుకుంటారు. మరి తేజ చెప్పినట్టు సెలబ్రిటీల దత్తత వెనుక కారణం అదేనా?