ఫ్లై ఓవర్ పైనుంచి పడిన లారీ
posted on Mar 6, 2015 9:09AM
ఒక లారీ ఫ్లై ఓవర్ మీద నుంచి కిందకి పడటంతో లారీ పూర్తిగా ధ్వంసం కావడంతోపాటు ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుదురుపాడు వద్ద శుక్రవారం నాడు ఈ ప్రమాదం జరిగింది. ఎండు మిరపకాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఫ్లై ఓవర్ నుంచి ఒక్కసారిగా కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. లారీ కింద పడిన సమయంలో అదృష్టవశాత్తూ కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.