ఇకపై సూఫర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో షాపింగ్ మాల్స్
posted on Oct 15, 2012 @ 1:33PM
దూర ప్రాంతాల ప్రయాణాలు ఇకపై బోరుకొట్టవు ఎందుకనుకుంటున్నారా......ఇకపై రైళ్లలో కూడా షాపింగ్ మాల్స్ ఏర్పాటు కానున్నాయి. మనకు నచ్చిన వస్తువులను కొనుక్కుంటూనో, లేదా మనం వెళ్లే బంధు మిత్రులకో కావల్సిన గిఫ్టలను హడావుడిగా షాపింగ్ చేసి రైలు ఎక్కకుండా తీరిగ్గా రైళ్లలోనే షాపింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ అవశకాశాన్ని శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ప్రవేశ పెడుతున్నారు. తదనంతరం అన్ని రైళ్లలోనూ ప్రవేశ పెట్టాలని రైల్యే శాఖ ప్రయత్నాలు చేస్తుంది. పర్యూఫ్స్, చర్మ ఉత్ఫత్తులు, హాండ్ బ్యాగ్స్ , గడియారాలు, ఆర్నమెంట్ నగలు, బహుమతులు అమ్మే దుకాణాలు రైళ్లలోని ఎక్స్ క్యూటివ్, ఛైర్ క్లాస్ లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వివిధరకాలయిన చాక్లెట్లను కూడా అందుబాటులో ఉంచుతారు. ప్రయాణీకులు షాపింగ్ మాల్స్ లో వినియోగించే తోపుడు బండ్లద్వారా షాపింగ్ చేసుకోవచ్చు. దీని ద్వారా రైల్వేలకు 12 శాతం లాభాలు వస్తాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు.