లోకేష్.. దారి రహదారి
posted on Jan 23, 2023 @ 10:12AM
ఎవరైనా విజయం సాధించాలంటే కష్టపడాల్సిందే. తండ్రి వారసత్వమనో.. మరోటనో అడ్డదారిలో అందలాలు ఎక్కినా.. అక్కడ నిలవాలంటే టాలెంట్ ఉండాల్సిందే. లేకుంటే అడ్డదారుల్లో ఎంత ఎత్తు ఎదిగినా.. అక్కడ నుంచి పడితే మళ్లీ లేవడం అసాధ్యం. లేవలేరు.. లేద్దామనుకున్నా జనం లేవనీయరు. తొక్కేస్తారు. పాతేస్తారు.
మనకు సినీ, రాజకీయ రంగాలలో అలా టాలెంట్ లేకుండా నెపోటిజంతొ అగ్రస్థానానికి చేరుకున్నా.. అక్కడ నుంచి కింద పడ్డాకా వారిని గుర్తు పెట్టుకునే వారు కూడా ఉండరు. ఎవరికైనా వారసత్వమనేది.. తొలి అడుగుకే పనికి వస్తుంది. ఆ తరువాత ఎవరైనా సరే సొంత కాళ్ల మీద నిలబడాని.. సొంత బాట పరచుకోవాలి. సొంత నడక నడవాలి. అయితే.. అలా తొలి అడుగు కూడా వేయకుండానే దారుణంగా ట్రోలింగ్ కు గురైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాత్రమే. ఆయన రాజకీయాలలో తొలి అడుగు వేడయానికి ముందే ఆయనపై వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా దాడి ఆరంభమైంది. ఆయన ప్రతిభను పట్టించుకోకుండా ఆయన ఆహార్యం, ఆహారం లక్ష్యంగా ఎదుగుదలను అడ్డుకోవడమే ధ్యేయంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు బ్యాక్ స్టాబింగ్ అనదగ్గ స్థాయిలో విమర్శల దాడి చేశాయి. పప్పు అన్నాయి.
ఉన్నత విద్యావంతడైన లోకేష్.. సమాజంలో మార్పునకు, బడుగులకు ప్రయోజనం చేకూర్చే విధానాలకు పార్టీని వేదిక చేశారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా పార్టీ పటిష్టతకు కార్యకర్తలకు భరోసా కల్పించాల్సిన అవసరాన్ని గుర్తెరిగారు. పార్టీ కార్యకర్తలకు బీమా కల్పించిన మొట్టమొదటి పార్టీ భారత దేశంలో బహుశా తెలుగేదేశం పార్టీయే. ఆ ఆలోచన లేకేష్ దే. ఆ విషయాన్ని ఏ పార్టీ కార్యకర్తను అడిగినా చెబుతారు. ఇక పార్టీల ప్రభుత్వాలూ ఇప్పడు అమలు చేస్తున్న నగదు బదలీ (క్యాష్ ట్రాన్స్ఫర్) పథకం లోకేష్ బ్రెయిన్ చైల్డే. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యర్థులు ఆయనలోన ప్రతిభను ప్రపంచానికి తెలియకుండా చేయడమే లక్ష్యంగా ఆరంభం నుంచే విమర్శలతో, ఎగతాళి చేయడంతో, ట్రోలింగ్ కు గురి చేయడంతో ఆయన ఇమేజ్ పై దెబ్బకొట్టే వ్యూహంతో పని చేశారు. సామాజిక మాధ్యమాన్ని ఇందుకు వేదికగా వాడుకున్నారు.
అయితే ఈ కుట్రల్నీ, కుతంత్రాల్నీ లోకేష్ సమర్ధంగా ఎదుర్కొన్నారు. సంయమనం కోల్పోకుండా కూల్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడమే ధ్యేయంగా కదిలారు. ఇప్పుడు ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు. అందుకు ఆయన యువగళం పేర పాదయాత్ర సాగుతున్నారంటే.. అధికార పార్టీలో కనిపిస్తున్నవణుకే నిదర్శనం. టీడీపీకి పునర్వైభవం ఆయన అడుగులతోనే సాధ్యమౌతుందని తెలుగుదేశం శ్రేణులు విశ్వసిస్తున్నాయి. అధికార పార్టీ కూడా అందుకే భయపడుతోంది. కార్యకర్తలతో పర్సనల్ గా టచ్ లో ఉండటం.. వైసీపీ నేతల విమర్శలకు దీటుగా బదులివ్వడం, సామాజిక మాధ్యమంలో చురుకుగా ఉండటం లోకేష్ తనను తాను నాయకుడిగా మలచుకోవడంలో అనుసరించిన విధానాలు. రాజకీయ అరంగేట్రం నుంచి లోకేష్ పై ఒక పద్ధతి ప్రకారం, వ్యూహాత్మకంగా జరిగిన వ్యక్తిత్వ హనన దాడి కారణంగా తొలి నాళ్లలో ఏర్పడిన ఇమేజ్ ను లోకేష్ సమర్ధంగా పటాపంచలు చేశారు. సంపూర్ణ నాయకుడిగా, సొంత వ్యక్తిత్వంతో ఎదిగారు. తన నాయకత్వంపై ప్రజలలో నమ్మకం కలిగించారు. ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రజలు ఆయన మాటలు వినడానికి తహతహలాడుతున్నారు. లోకేష్ పై గతంలోలా లోకేష్ పై విమర్శలు చేయాలంటే ప్రత్యర్థులు ఒకటికి రెండు సార్లు కాదు వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది.
లోకేష్ పాదయాత్ర తమ కాళ్ల కింద భూమిని కదిలించేస్తుందన్న భయం అధికార పార్టీలో నెలకొని ఉంది. ఇదే లోకేష్ విజయం. ముందు ముందు మరిన్ని విజయాలకు ఇదే ఆరంభం. ఆల్ ది బెస్ట్.. అండ్ హ్యాపీ బర్త్ డే లీడర్ లోకేష్.