ఐదు వేల కోట్లు బాదుడు! ఖజానా నింపుకోవడానికే ధరల పెంపు!
posted on May 4, 2020 @ 11:35AM
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మద్యం ధరలు పెంచాల్సి వస్తోందని ప్రభు త్వం చెబుతున్నా ఆదాయం పెంచుకోవడమే అస లు ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే ప్రజారోగ్యం, నిషేధం వంటివి సాకు మాత్రమేనని కరోనా కష్టకాలంలో ఖజానాను నింపుకోవడమే ప్రభుత్వ లక్ష్యం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆదాయం లేక విలవిల్లాడుతున్న ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఆదాయం తెచ్చిపెట్టే వనరుగా మద్యం ఒక్కటే కనిపిస్తోంది.
గతేడాది అధికారంలోకి రాగానే సీఎం జగన్ మోహన్ రెడ్డి 20% దుకాణాలను అంటే 4,380 షాపులను 3,500కు తగ్గించారు. బెల్టుషాపులను పూర్తిగా తొలగించారు. అంతేకాదు మద్యం అక్రమ రవాణాను, తయారీని నిరోధిస్తూ శిక్షలను గణనీయంగా పెంచుతూ చట్టాలు తీసుకొచ్చారు. లాక్‌డౌన్ సడలింపులో భాగంగా మద్యం అమ్మకాలకు అనుమతించడంతో షాపుల వద్ద భౌతిక దూరాన్ని అమలుచేయనున్నారు. మద్యం అమ్మకాల వేళలను నియంత్రించనున్నారు.
మూడో దశ లాక్‌డౌన్ లో భాగంగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే సమయంలో మద్యం షాపుల వద్ద భౌతిక దూరం తప్పనిసరి చేసింది. ఒకేసారి ఐదుగురికి మాత్రమే మద్యం షాపుల వద్ద అనుమతి ఇవ్వనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే కాసేపు షాపుల మూసివేయనున్నారు.
మద్యం అమ్మకాలు తగ్గించేందుకే ధరలు పెంచినట్టు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
పెరిగిన మద్యం ధరలు..
బీరు 330ml - పెరిగిన ధర 20రూ.
500/650ml -30 రూ.
30000ml - 2000రూ.
50000ml- 3000రూ.
రెడీ టూ డ్రింక్ 250/275ml. - 30రూ.పెరుగుదల
180ml ధర 120రూ.కంటే తక్కువ ఉన్న వాటిపై పెంపు
60/90ml.- 10రూ.పెరుగుదల
180 ml - 20రూ.పెరుగుదల
375ml - 40రూ.పెరుగుదల
750ml - 80రూ.పెరుగుదల
1000ml -120రూ.పెరుగుదల
2000ml - 240రూ.పెరుగుదల
180ml ధర 120 నుంచి 180 రూ.మధ్యలో ఉన్న వాటిపై పెంపు
60/90ml.- 20రూ.పెరుగుదల
180 ml - 40రూ.పెరుగుదల
375ml - 80రూ.పెరుగుదల
750ml - 160రూ.పెరుగుదల
1000ml -240రూ.పెరుగుదల
2000ml - 480రూ.పెరుగుదల
150రూ.కంటే ఎక్కువ ధర ఉన్న వాటిపై పెంపు
60/90ml.- 30రూ.పెరుగుదల
180 ml - 60రూ.పెరుగుదల
375ml - 120రూ.పెరుగుదల
750ml - 240రూ.పెరుగుదల
1000ml -360రూ.పెరుగుదల
2000ml - 720రూ.పెరుగుదల
₹120 లోపు క్వార్టర్ బాటిల్ పై రూ.20పెంపు ఆఫ్, బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ పై రూ.80పెంపుధర పెరిగినా షాపుల వద్ద రద్దీ తగ్గదు. క్షణాల్లో సరుకు ఖాళీ అవడం ఖాయం. ‘ప్రొహిబిషన్ ట్యాక్స్’ ద్వారా మద్యం ధరలను పెంచారు. మద్యం బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ ధర కంటే 25 శాతం అదనం. ఉదాహరణకు ఒక మద్యం బాటిల్ ధర రూ.300 ఉందనుకుంటే 25 శాతం ధర పెంచి రూ.375కి విక్రయిస్తారు.
రాష్ట్రంలో గతేడాది జరిగిన మద్యం అమ్మకాల విలువకు 25 శాతం ఆదాయం కూడా కలిపితే కొత్తగా రూ.4,406 కోట్లు వస్తుంది. దానికి ఏటా వచ్చే సాధారణ వృద్ధిని కలిపితే దాదాపు రూ.5వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది.
నిజంగా దుకాణాల వద్ద రద్దీని నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యం అయితే పోలీసులను పెట్టి అమ్మకాలు జరపొచ్చు. మద్య నిషేధమే లక్ష్యమైతే లాక్‌డౌన్‌తో వచ్చిన అవకాశంతో షాపులను పూర్తిగా బంద్ చేయవచ్చు. హడావిడిగా ధరలు పెంచి షాపులు తెరవాల్సిన అవసరం ఏమిటి?