చేప కడుపులో.. మందు బాటిల్ ...
posted on Jun 24, 2021 @ 4:04PM
టైటిల్ చూసి షాక్ అయ్యారా ? చేపకడుపులు మందు బాటిల్ ఏంటని అనుకుంటున్నారా ? ఇక్కడ రేట్లు పెరిగి పోయి మనుషులకే మందు దొరకడం లేదు ఇక చేపలకు బాటిల్స్ ఎక్కడ దొరికాయి. అని సందేహ పడుతున్నారా ? సందేహం వాడు ఈ వార్త నిజం.. మీరు ఆశ్చర్యపోవడం కాదా ఆ మత్స్యకారుడు కూడా ఆశ్చర్యపోయాడు.
ఓ మత్స్యకారుడి అదృష్టం పండింది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు చేప రూపంలో అదృష్టం వలకు చిక్కింది. అయితే, చేపను చేపను బోటులోకి తీసుకొచ్చి పొట్ట కోసి చూసి అవాక్కయ్యాడు. దాని కడుపులో వీస్కీ బాటిల్ దర్శనమిచ్చింది. కడుపు లోపల తెరవని విస్కీ బాటిల్‌ను గుర్తించిన మత్స్యకారులు తెగ సంబరపడిపోయారు. ఇందుకు సంబంధించి వీడియో టిక్‌టాక్ వేదికగా తెగ వైరల్‌గా మారింది.మహాసముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. దీంతో వారికి భారీ ఆకారంతో కూడి చేప చిక్కింది. దాని ఎంజాయ్ చేద్దామనుకున్న వారు బోటులోనే కోసేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పుడు చేప కడుపులో ఏదో వింత వస్తువును గమనించారు. ఆ అవయవాన్ని కత్తిరించాడు. దాన్ని చూసిన మత్స్యకారుడు సంబరపడిపోయాడు. ఆశ్చర్యం ఏమంటే, ఆ వస్తువు ఫైర్‌బాల్ విస్కీ తెరవని బాటిల్‌గా తేలింది. దీంతో చేపతో పాటు విస్కీని అస్వాదించారు మత్స్యకారులు..
పులిని ఓ ఆట ఆదుకున్న కోతి..
కోతి అంటే కోతి దాని గురించి చాలా మంది చాలా చెప్పుకుంటారు. ఎవరు ఎన్ని చెప్పిన ఇప్పటికి దాని గురించి ఎంత చెప్పిన తక్కువే. కోతి తలుచుకోవాలి గాని ఎంతటి వాళ్లకు అయినా చెమటలు పట్టిస్తాయి. అలాగే మనుషులను అలరిస్తాయి. సాధారణంగా కోతి మనుషులతో ఆదుకోవడం వేరు. వాటి జాతి కోతులతో ఆదుకోవడం వేరు కానీ మనం తెలుసుకునే కోతి మాత్రం ఏకంగా పులితోనే ఆడుకుంది.. అదేంటని, అది ఎలా అని అనుకుంటున్నారా ? మీరు చూడండి ఏం జరిగిందో..
సోషల్ మీడియాలో మిలియన్ల ఫోటోలు, జంతువుల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక వీడియోలు రాత్రికి రాత్రే ఫుల్ ట్రెండింగ్‌లోకి రావడం మనం చూస్తూనే ఉంటాం. ఇక తాజాగా ఓ కోతి, చిరుత పులిను ముప్పుతిప్పలు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ చెట్టుపై ఎక్కిన కోతిని వేటాడాలని చూసిన చిరుతకు చివరికి నిరాశే మిగిలింది. ఎక్కి కోతిని పట్టుకోవటానికి ప్రయత్నించబోయింది చిరుత. కానీ ఆ కొంటె కోతి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు దూకుతూ చిరుతపులిని ముప్పుతిప్పలు పెట్టింది. ఇక చివరికి చేసేది ఏమి లేక ఆ చెట్టు దిగి అక్కడి నుంచి వెళ్లి పోయింది చిరుత…