భీమా – ధీమా

మీరు భీమా కట్టరా? అయితే మీరు ధీమా గా ఉన్నారన్న మాట. అయితే మరీ అంతా ధీమాగా ఉండకంటి, ఇందులో కూడా  కొన్ని నష్టాలు కష్టాలు ఉన్నాయి అవి ఏమిటో సమస్యకు పరిష్కారానికి ప్రయత్నమే  చేయడమే   మా భీమా – ధీమా కార్యక్రమం. సొ వెల్కంటు  భీమా

ధీమా కార్యక్రమం... మొంటేజ...

                                                                                                    
మనిషికి భీమా ఉంటే ధీమా ఏ వేరని అని అనుకుంటున్నారు సామాన్యులు.  కొందరికి భీమా భారంగా మారిందని. ప్రతి సంవత్సరం మనం పెట్టె పెట్టుబడికి మనకు వచ్చే  ఆదాయం ఎంత అన్న ప్రశ్న వేదిస్తోంది. ఇది నిజం అయితే సంవత్సరం వచ్చిందటే  ఇన్సూరెన్స్ పోలసీ కోసం కంపెనీలు పడరాని పాట్లుపడతారు. మీకు 80 సి ప్రకారం   ట్యాక్స్ ఎగ్జంషన్  వస్తుంది అంటూ అసలు ఒప్పంద పాత్రల  చూడ కుండానే సంతకం చేసి ఇచ్చేస్తున్నారు పోలసీ దారులు. అసలు పాలసీ అంటే ఏమిటి? పాలసీ విలువ ఎంత? ఏ పాలసీ కి ఎంత కట్టాలి ? పాలసీ మెశ్చురి టీ ఎన్నాళ్లు?  భీమా మధ్యలో పాలసీ దారుకు జరిగే నష్టాన్ని ఎలా లెక్క కడతారు? కాష్ లెస్ పాలసీ ఏ ఇన్సూరెన్స్ పరిధి లోకి వస్తుంది? రీ ఎంబర్స్ మెంట్ పాలసీ అంటే ఏ మిటి?  ఇన్వెస్ట్ మెంట్ పాలసీ అంటే  ఏమిటి ? లైఫ్ ఇన్సూరెన్స్.నాన్ లైఫ్  ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి అన సందేహాల కు మానిపుణులు ఇచ్చే సమ ధానాలు , సలహాలు సూచనలు మీకోసం అందిస్తోంది రాజ్ న్యూస్  అసలు ఇన్సూరెన్స్ లో ఉన్న నిజాలు,  ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు, క్లెయిమ్ లు  ఇవ్వడం లో ఇన్సూరెన్స్ కంపెనీలు జాప్యం చేస్తే ఎవరిని సంప్రదించాలి? కోర్టుకు వెళ్తే సమస్య మరింతజటిలం అయ్యే అవకాశం ఉన్నదున అంబుట్స్ మెన్ కమిటీ ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది అన్న సందేహాలకు  సమాధానం    భీమా – ధీమా . అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటో ఈ ఏ . వి  చూద్దాం.                                                                                                                        
 ఇన్సూరెన్స్ ఈ పదం గురించి తెలియని వాళ్ళు ఈ మధ్య కాలం లో లేరంటే అతిశయోక్తి లేదు నిజానికి తెలిసో తెలియక ఎప్పుడో ఎక్కడో ఏ స్నేహితుడి ప్రోత్సాహంతోనో  భీమా అస్దే ఇన్సూరెన్స్ కట్టేఉంటారు. దానిని వినియోగించుకునే ఉంటారు. లేదా మధ్యలోనే ప్రీమియం కట్ట లేక ఆపేసి ఉంటారు.  అయితే ఇన్సూరెన్స్ ఈ రోజు నిత్య  అవసరంగా మారింది. ముఖ్యంగా దిగువా మధ్య త్రాగతి ప్రజలకి , ఉద్యోగులకి ఇన్సూరెన్స్ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి గా చేస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు  ఊ దర కొట్టే ప్రకటనలు, ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ల కు  భారీ కమీషన్లు ముడుతూ  ఉండడం తో  సంవత్సరానికి 7000/ రూపాయలు కట్టండి ఇన్సూరెన్స్ మీకు నెల రోజుల్లో ఆక్టివేట్ అవుతుంది. మీరు ఒకవేళ  అనారోగ్య సంస్య వస్స్థే మీకు దగ్గరలో ఉన్న అసు పత్రి  లో  ఐనా చేరండి. ఇది క్యాష్ లెస్ పాలసీ అంటూ చెప్పగానే ఏజెంట్ల మాటలను నమ్మి డబ్బు కడుతున్నారు పాలసీదారులు. మీ పాలసీ కి సం అస్సుర్డ్ అమౌంట్ 50000/ ఆక్షరాలా ఐదు లక్షలు వస్తుంది అని అనగానే అయితే తీసుకుందాం డబ్బు ఉన్న రోజు ఉంటుంది లేని రోజూ ఉంటుంది. అత్యవసర సమయంలో ఆడుకునే బీమా ఉందిగా అనుకుని ధీమా గా  ఉంటారు అసలు భీమలు ఎన్నిరకాలు  ఏ పాలసీ పెట్టుబడి దారుకు లాభ దాయకం అన్న అంశాలు నిపుణులు చెప్తారు లెట్స్ గో  ఫోర్ ఫాక్టర్స్ -.అసలు ఇన్సూరెన్స్ భారత్ లో ఎలా పుట్టింది దానిచరిత్ర పూర్వోత్తరాలు  తెలుసు కోడం అవసరం  ఏమంటారు. ఇన్సూరెన్స్ ఆక్ట్ 1938 ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ ను భారత దేశంలో 19జనవరి 1956  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆక్ట్ ప్రకారం అప్పటికే 245 కంపనీలు  పని చేస్తున్నాయని వీటి అన్నిటి ఒక గొడుగుకిందకు తీసుకు వచ్చేందుకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ను ప్రారంభించింది.  అయితే అన్నీ ప్రధాన కంపెనీలే ఇవి నాలుగు రాష్ట్రాలలో మెట్రోపాలిటన్  నగ రాలలో అంటే 19999 నాటికి ప్రైవేట్ రంగం లో ఇన్సు రెన్స్ లేదని పరిశోదనలో వెల్లడి అయ్యింది. వాటి పూర్వాపరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ ఇన్సూరెన్స్ రంగాన్ని ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, రెండోది నాన్  లైఫ్ ఇన్సూరెన్స్,,గా కేటగిరీ లుగా  విభాగించారు  అయితే  నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ని జనరల్ ఇన్సూరెన్స్ గా పరిగణిస్తారు. ఈ రెండు ఇన్సూరెన్స్ లు ఐ ఆర్ డి ఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యు లేటరీ ఆథారిటీ అండ్ దవలప్మెంట్ ఆధారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది. ఇర్ డా ఇన్సూరెన్స్ రంగాన్ని పర్య వేక్షిస్తుంది. ఇన్సూరెన్స్ కు కస్టోడియన్ గా  ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. అంటే ఇన్సూరెన్స్ తీసుకున్న కస్టమర్ల హక్కుల పరి రక్షణకు ఇరిడా  క స్టో డియన్ అని చెప్పాలి. భారతదేశంలో 57 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో 24 ఇరవై నాలుగు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు కాగా 33 నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలుఉన్నాయి. అందులో కొన్ని 7 పబ్లిక్ రంగం విభాగంలో పనిచేస్తున్నాయి. గతంలో కొన్నిదశాబ్దాలుగా ఇన్సూరెన్స్ అంటే ఠక్కున గుర్తికు వచ్చేది ఎల్ ఐ సి మాత్రమే అంటే జీవిత భీమా సంస్థ, అదే పెద్ద వ్యవస్థ గా పేరెన్నిక గన్న ఏకైక సంస్థ అంటే అతిశయోక్ఠీ  కాదేమో. లేదా కొన్ని పేరెన్నిక సంస్థలుగా చెప్పుకునే సంస్థలలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్  ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, మాత్రమే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదా జనరల్ ఇన్సూరెన్స్, రంగం గా పేర్కొన్నారు.దీనిగురించిన  మరిన్ని వివరాలు.                               

తెలుసుకుందాం... 

ప్రభుత్వ రంగంలో కొనసాగిన ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రైవేట్ రంగంలో విస్తరించింది. ఇరిడా  ఇన్సూరెన్స్  రెగ్యు లేటరీ  ఆధారిటీ ఆఫ్  ఇండియా లో ఎన్నో మార్పులు చేర్పులు చేసిన తరువాత ఇన్సూరెన్స్ రెగ్యులే టరి  ఛత్రం 1999 ప్రకారం. ప్రైవేట్ రంగంలో ఎఫ్ డి ఏ అంటే  ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ను ఆహ్వానించింది భారతప్రభుత్వం. అయితే చట్ట ప్రకారం ఎఫ్ డి ఐ లను 26% పరిమితి విదిస్తూ 2016 లో చట్టం  తీసుకు  వచ్చింది. ఇక ప్రైవేట్ రంగం లోకి ఇన్సు రెన్స్ ఎప్పుడైతే పెట్టుబడులకు ఆహ్వానం పలికిందో 2000 సంవత్సరానికి, ఇన్సూరెన్స్ రంగం రూపు రేఖలు మారిపోయాయని నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపనీలు 30 నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ రాగాన్ని శాశిస్తు న్నాయని నిపుణులు విశ్లేషించారు. ఇంకా మరెన్నో కంపెనీలు ఇరిడా అనుమతికోసం నిరీక్షిస్తున్నట్లు సమాచారం.                                                                                                                                               
 ప్రైవేట్ రంగంలో దూసుకు పోతున్న ఇన్సూరెన్స్ రంగం లో 19 జనరల్ ఇన్సురేయన్స్ కంపెనీలు, 5 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు , విదేశీ కంపెనీలు కలిసి ఇన్సూరెన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసి నట్లు  అయ్యిందని నిపుణులు తమ పరిశోధనలో వెల్లడించారు. భారత దేశంలో ఇన్సూరెన్స్ రంగంలో  విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం కావడంతో ఎఫ్ డి ఐ ని 2000 సంవత్సరానికి 26% పరిమితి  విదించింది. తరువాత 2014 లో ఎఫ్ డి ఐ ను 49% పరిమితి  ని విదిస్తూ ఇరిడా ఇన్సూరెన్స్ చట్టం 2015 లో మార్పులు చేసిందని విశ్లేషకులు వివరించారు. అయితే ఇప్పటికీ ఎల్ ఐ సీ ఇన్సూరెన్స్ రంగం పై తన ఆది పత్యాన్ని కొనసాగించడం విశేషం ప్రవైట్ రంగంలో వచ్చిన హెచ్ డీ ఎఫ్ సీ, ఐ సి ఐసి ఐ , ఎస్ బి ఐ, బ్యాంకులు సైతం ఇప్పటికీ లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో గట్టి పోటీ ఇస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఇన్సూరెన్స్  కంపెనీలువచ్చి చేరడం తో 2017 నాటికి ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగం లో  విస్తరణ గణనీయంగా పెరిగింది. ఇన్సు రెన్స్ కంపెనీలు ఆతి తక్కువ ప్రీమియం, తో పాటు, అధిక మొత్తంలో క్లైమ్ ఆఫర్ చేస్తున్నప్పుడు. సహజంగానే డోమెస్టిక్ ఎకానమీ ని నియంత్రించ గలిగింది.

చదువు కున్న వాళ్ళకి సామాన్యుడికి అర్ధం కాని అంశం  అసలు తాము తీసుకున్న పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనా? లేక, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నా? అనే ది ఆర్ధం కాక అదేపనిగా ఇన్సూరెన్స్ సిబ్బంది ని తప్పించుకోలేక తప్పని స్థితి లో ఇన్సూరెన్స్ తీసుకున్నామని అంటారు అసలు లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్, మధ్య ఉన్న తేడాను ఎలా గమనించాలి. వీటి ప్రీమియం వివరాలు నిపుణులని అడిగి తెలు సుకుందాం.                                                                                                          
 లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఒప్పందం అని నిబందనలు చెపుతున్నాయి. ఒప్పందం ప్రకారం వ్యక్తికినామినీ కి ఇస్తామన్న వాగ్దానం ప్రకారం నగదు చెల్లించడమ్ అని నిపుణులు పేర్కొన్నారు. కాంట్రాక్ట్  ప్రకారం  ప్రీమియం చెల్లిస్తున్నంత  వరకు ఇన్సూరెన్స్ అమలులో ఉంటుంది.  ఎగ్రిమెంట్ జరిగిన నాటినుంచి లేదా చెప్పిన   తేదీ నుండి నిర్దేశిత తేదీ ప్రకారం. లేదా అనుకోకుండా, మరణించినా, విరమించినా అనారోగ్యం పాలైనా  పాలసీదారు ఒప్పందం ప్రకారం ప్రీమియం చెల్లింపు

ఇన్సూరెన్స్ – నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పై అవగాహన                                                

యాంకర్ 5)  నానాటికీ  భారీ రంగం గా ఎదుగుతున్న ఇన్సూరెన్స్ రంగం లో అసలు ఇన్సూరెన్స్ ఎన్నిరకాలు అన్న విష యం ముందుగా  తెలుసు కుందాం ఒకటి లైఫ్ ఇసురేన్స్ ,రెండోది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని నిపుణులు తేల్చారు. లైఫ్ ఇన్సూరెన్స్ ను జీవన భీమా, అని  నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో సాధారణ భీమా  అని పేర్కొన్నారు. అటు వ్యక్తి లేదా ఇంటి పెద్ద లేదా అయింటి  పెద్ద పైనా  ఆధారపడి జీవిస్తున్నకుటుంబానికి ఇచ్చే భీమా ని జీవన భీమా అని అంటారు. సాధారణ భీమా ని జనరల్ ఇన్సూరెన్స్ గా పేర్కొన్నారు వాహనము  ఇల్లు, పశువులు, పంటలు, వాహనాలు, ఆరోగ్య భీమా శాతం సాధారణ భీమా పరిధి లోకి వస్తుంది.  ఆవివరాలు అన్నీ  పూర్తిగా స్పస్టం గా వివరంగా తెలుసుకుందాం.                                                                                                                                                  
ఒక్క మాటలో చెప్పా లంటే  ప్రజలకు అత్యంత విలువైన ది  ప్రాణం ,జీవన భీమా పరిధిలోకి పాలసీదారు ఏదైనా అనుకోని పరిస్థితిలో  చనిపోయిన వ్యక్తికి, లేదా అతని పై ఆధార పడే వారికి భీమా కంపెనీలు కొంత నగదును పాలసీ కొనుగోలు దారు కుటుంబానికి ఇస్తారు. ఇంటి పెద్ద లేనందు వల్ల ఆ ఇంటిని నడపడం కష్ట  ఆ సాధ్యం, అలాటి ఆర్ధిక సమస్యలనుండి బయట పడేందుకు జీవిత భీమా తీసుకోడం  అవసరం అని ఇన్సూరెన్స్ నిపుణులు తెలియ జేస్తారు. రెండవది సాధారణ భీమా, దీనిని జనరల్ ఇన్సూరెన్స్ అని ఇన్సూరెన్స్ పరిభాషలో పేర్కొన్నారు. ఈ పరిధిలో     ఆ రోగ్య భీమా , చికిత్స,  వాహనం, పంట లు, ఇల్లు అన్నీ ఈ పరిధిలో ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ముందుగా ఇంటి భీమా సాధారణ భీమా పరిధిలో ఉందని గ్రహించాలి. దీని వల్ల మీయింటిని భూకంపం, షార్ట్ సర్క్యూట్, వరద వల్ల మునిగి పోయినా, ఇన్సూరెన్స్ నుండి    సంరక్షించు కోవచ్చని   అలాగే ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఈ పాలసీ కింద నసఃతపరిహారం పొందవచ్చని, అదీ మీరు తీసుకున్న పాలసీ విలువ పైన ఆధార పడిఉంటుందని నిపుణులు వివరించారు.                                                                           

సాధారణ భీమా పధకం పరిదిలో వచ్చే  అంశం ఆరోగ్య భీమా అదే హెల్త్  ఇన్సూరెన్స్ నేటి కాలంలో వైద్య ఖర్చులు తీవ్రంగా పెరిగి పోయాయి ఆరోగ్య భీమా తీసుకోడం వల్ల భీమా కంపనీలు. ఇచ్చే వైద్య ఖర్చులనుండి  కొంత మేర బయట పడవచ్చునని అంటున్నారు ఇన్సూరెన్స్ నిపుణులు. ఈ ఆరోగ్య భీమా పాలసీ ప్రకారం ఇన్సూరెన్స్ కంపనీ  ఏ రకమైన వ్యాధి వచ్చినా , వైద్యానికి అయ్యే ఖర్చును ఆ కంపనీ  ఇస్తుంది.అయితే మీరు తీసుకునే పాలసీ విలువపైనే మీకు ఇవ్వాల్సిన క్లైమ్  ఆధార పడిఉంటుందని,  అని నిపుణులు తెలిపారు. సాధారణ భీమా పరిధిలోకి వచ్చే మరో  అంశం వాహనభీమా దేశంలో ఎక్కడైనా రోడ్డు పై వాహనం నడపినా వాహనాన్ని భీమా చేయడం తప్పనిసరి ఒక వేళ మీ వాహనానికి భీమా చేయకుండా రోడ్డు పై నడిపితే ట్రాఫిక్ పోలీసు జరిమానా విధిస్తారు వాహన చట్టం నిబంధనల ప్రకారం వాహనం వల్ల మీద్వారా మరొకరికి ప్రమాదం సంభవిస్త్గే వ్యక్తి గతంగా   మీరు ప్రమాదానికి గురి ఐనా పక్షం లో భీమా కంపనీ కొంత నగదు నష్ట పరిహారంగా ఇస్తుంది. ఒక వేళా మీవాహనం దొంగతనానికి గురి ఐనా, అదైనా ప్రమాదం జరిగినా  మీ     భీమా  పాలసీ  మీకు సహాయ పడుతుంది                                                                                                                                                          
ఈ భీమా పరిధిలోకి వచ్చిన మరో పధకం ప్రయాణ భీమా  ఈ భీమా ద్వారా మీరు యాత్ర చేస్తున్న సమయంలో వచ్చే నష్టం, నుంచి మిమ్మల్ల్ని కాపాడు తుంది. విహార యాత్రకు విదేశాలకు వెళ్ళి నప్పుడు ఒక వేళ ఏ దైనా ప్రమాదం జరిగితే మీ వస్తువులు చోరీకి గురి అయినప్పుడు, భీమా సంస్థ నష్ట పరిహారం చెల్లిస్తుంది. ప్రయాణ భీమా పాలసీ మీ యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ముగిసే వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ప్రయాణ భీమా  కు సంబందించి ఒక్క కంపనీ  వీధి విధానాలను రూపొందించిందని కంప నీల షరతులకు లోబడి  పలాసీ లు వేరు వేరు గా ఉంటాయని నిపుణులు తెలిపారు.                                                                                
సాధారణ పరిధిలోకి వచ్చే మరో ఇన్సూరెన్స్ పాలసీ పంట భీమా పధకం క్రాప్ ఇన్సూరెన్స్ పధకంగా పేర్కొన్నారు. ఈ భీమా నియమ  నిబందనల ప్రకారం వ్యవసాయ రుణం తీసుకునే ప్రతి రైతు పంట భీమా తీసుకోడం తప్పనిసరి. పంట భీమా పాలసీ నిబందనల ప్రకారం పంటకు ఏ విధమైన నాష్టం కలిగినా, వ్భీమ కంపనీలు రైతుకు నష్ట పరిహారం చెల్లిస్తాయి. భీమా నిబందనల్ ప్రకారం పంట అగినికి అంటుకోవడం, పంట వరదలో చిక్కుకు పోవడం, పంటకు ఇతర తెగులు సోకి నస్గ్తపోయినా , కోతకు వచ్చిన పంట కోల్పోయినా పంట ఏ కారణం చేతైన పాడై పోయినా నష్ట పరి హరామ్ పొండా వచ్చని త్గెలియా చేస్తోంది. పంట భీమా పాలసీ లో ఖటి న మైన నియమ నిబంధనలవల్ల పాలసీ నగదు కన్నా తక్కువ నష్ట పరిహారం లభించనందు వల్ల రైతులలో పంట భీమా పట్ల ఆసక్తి  చూపక పోవడం గమనించాలి. వాస్తవానికి పంటచెడిపోయి నప్పుడు, పాడై పోయి నప్పుడు నష్ట పరిహారం ఇచ్చే సమయంలో భీమా కంపేనీలు ఆపంట పొలం పరిసరాలలో దగ్గర దగ్ఫ్గర గా ఉన్న పంటల నన్నిటిని సర్వే చేస్తారు ఎక్కువ మండి రైతులు నష్ట పోయి నప్పుడు మాత్రమే ఈ భీమా ఇస్తున్నారని దీని వల్ల భీమా తీసుకున్న తమకు పెద్దగా ఉపయోగం లేదని  రైతులు వాపోతున్నారు.                                                                                    
భీమారంగాన్ని సవివరంగా ప్రజలకు తెలపాలన్న లక్ష్యంగా మేము మాపతి సోదనలో తెలిసిన మరో భీమా వ్యాపార భీమా. నిజానికి ఏ కంపనీ ఉత్పాదక లేదా అమ్మకం జరిగే పరిశ్రమలు లేదా పెద్ద మొత్తంలో చేసే వ్యాపార్ లావాదేవీలు చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నది వాస్తవం. పెద పెద్ద  పరిశ్రమలలో ఉండే యంత్ర సామగ్రి, వల్ల ఏసీడ్ వల్ల బాయిలర్లు పేలడం,ప్లాస్టిక్, రసాయన, టైర్ల పరిశ్రమ, ఇలా పెద్ద పెద్ద పర్శ్రమలలో ఆగ్ని ప్రమాదాలు సహజంగా  జరుగుతూ ఉంటాయి. ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి ఇన్సూరెన్స్ లేని పరిశ్రమలకు భారీ మొత్తం జరిమానాలు కట్టాల్సి వస్తుంది. చట్ట ప్రకారం జరిగే చర్యలతో పాటు అందుకు అయ్యి ఖర్చు ను సైతం అటు భీమా సంస్థ కంపనీలు చెల్లించాల్సి ఉంటుంది ఇది కూలం కషమ్ గా లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉండే భీమా లు వాటివల్ల కలిగే లాభం, నష్టం. ----- నిపులతో వీటికి సంబందించిన ఆంశాల పై చర్చ -------.                                                                                      
యాంకర్ 6) ఇప్పుడు ఇన్సూరెన్స్ లు వాటిలో రకాలు ఏ ఇన్సూరెన్స్ ఏ పరిధిలో ఉంది నిపుణులు చెప్పిన సమాధానం చూశాంకదా ఇప్పుడు అసలు చిత్రమైనవిచిత్రమైన కదలు ఇన్సూరెన్స్ లో చోటు చేసుకున్న  దుష్టాంతరాలు  ఇప్పుడు చూద్దాం. అందులో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబందించిన కొన్ని వాస్తవాలని చూద్దాం. ఆసుపత్రులలో మీకు ఇన్సూరెన్స్ ఉందని అంటే రమ్మంటారు. ఆత్రువాత మనకి  ఇన్సూరెన్స్ మొత్తంలో ఉన్న పూర్తి క్లెయిమ్ ను ఎలా రాబట్టాలో రాబడతారు.  ఆచిత్రాలు ఒకసారి చూద్దామా.                                                                                                                                                                       వాయిస్ ఓవర్ 6) మీకు  మీకుఇన్సూరెన్స్ ఉందా అంటారు ఉందని అన్నారో మీరు బుక్ అయి పోయరన్న మాటే. అసలు ఇన్సూరెన్స్ పోలసీ ఎంత వరకు ఆంచనా వేస్తారు. దానిని బట్టి మీ సమస్య  పెద్దది మీకు సర్జరీ అవసరం అంటారు. వెంటనే ఎప్పుడు జాయిన్ అవుతారు. వెంటనే జాయిన్ అవ్వాలి లేదంటే మీ సమస్య   సీరియస్ ఇష్యూ ముందు అడ్మిట్ అవ్వండి టెస్ట్ చేశాక సమస్య పూర్తిగా ఇన్వెస్టిగేట్ చెయ్యాలి.  అప్పుడు ట్రీట్ మెంట్ ట్  ఇవ్వాలి అంటూ రూమ్ ఆలో కేట్  చేస్తారు. సె లైన్ కామన్, టాబ్లెట్స్ కామన్,  పేటెంట్ కి భోజనం మేమే పెడతాం మీరు తీసుకు రావద్దు అంటూ అమ్మో పరవాలేదు అమ్మో ఇంటినుంచి తెచ్చుకునే బదులు ఇక్కడే ఇస్తారు కదా అనుకుని భీమా కదా ధీమా గావుంటారు.  తీరా చూస్తే రూమ్ రెంట్ ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ రెంట్, మనం వాడినా వాడక పోయినా టవల్ సబ్బులు, న్యాప్ కీన్లు, నర్సింగ్ సేవలు. ఆపరేషన్ థియేటర్ ఖర్చులు వాళ్ళు వాడిన థియేటర్ సరంజామా,సూదులు, వగైరా, టిష్యూ పేపర్ లు సైతం వాడినా వా డక పోయినా వాటి కీ బిల్లులో అసలు బిల్లు కంటే కాస్త ఎక్కువే వడ్డిస్తా రని బాదితులు వాపోతున్నారు. చివరన డిశ్చార్జ్ బిల్లు చూస్తే గుండె  ఘుబెల్  మంటుంది ఆంతా మీ ఇన్సూరెన్స్ కు తగ్గట్టు గానే మొత్తం బిల్లు క్లెయిమ్ చేస్తారు అప్ప్రూవల్ కు ఇన్సూరెన్స్ కంపనీకి పంపి అప్రూవల్ రాగానే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు. ఒక్కోసారి మీ ఇన్సూరెన్స్ బిల్లు కన్నా కొంత అదనం గా వచ్చిన్నా ఆశ్చర్యం లేకపోలేదు. సొ మీరు ఇలాంటి సమస్య ఎదురయ్యిందా, అయితే కాస్త  జాగ్రత్తగా వినండి.  మీరు పెట్టిన క్లెయిమ్ ఇవ్వక పోయినా అదనంగా వచ్చే స్మస్యలకు ఎవరు పరిష్కరిస్తారు వాళ్ళు ఎవరు అన్న సమ ధనం మానిపుణులు మీకు వివరిస్తారు.                                                           
------ఈ అం శం లోనే అసలు  ఆసుపత్రుల పై వస్తున్న ఆరోపణలు  వాస్తవమా కాదా ,అన్న విష యాన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యజ మన్యాల సంఘం ప్రతినిధులు చెప్పాలి----  బైట్---                                                                                                                                  సమస్య  వచ్చిందంటే ఆసమయంలో ఎవరు దగ్గర లేకున్నా నిర్ణయం తీసుకోడం కష్టం దగ్గరలౌన్న నర్సింగ్ హోం కి వెళ్లలా లేక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాల అన్నదే మీమాంస ఆసమయంలో నే తక్షణం చేయాల్సిన పరిస్తితి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్తితి అదే సమయంలో కార్పొరేట్ ఆసుపత్రికి వేలాడమన్నా నిర్ణయం తీసుకుంటే మాత్రం మీకు రోగం బెత్తెడు బిల్లు  జా నేడు అన్నట్టుగా ఉంటుంది. అసలు సమస్య కు ట్రీట్మెంట్ ఇచ్చాం అంటారు. వాడినా వాడని వస్తువు బిల్లు నానా నెత్తి మీద రుద్ది బిల్లు తడిపి మోపెడు చేసి బిల్లీ కత్తి వెల్ల మంటూ సలహా ఇస్తార్. జర  జాగ్థే రహో అంటున్నాయి స్వీయ  అనుభవం వింటే మీకే ఆర్ధం అవుతుంది  ఆసుపత్రుల ఇన్సూరెన్స్ మాయ.                                                                                         

వాయిస్ ఓవర్ 7) మాయా మయా మాయా ఇదేంటి మాయ అనుకుంటున్నారు క దూ. ఒక్క సారి ఈమాయలో పడ్డారో మీకు లేనిరోగం తో పాటు అన్నీ గుర్తుకు వస్తాయి. .  ఇవిగో ఇవన్నీ నగరంలో పేరెన్నిక గన్న ఆసుపత్రు లే ఇక్కడ కాళ్ళు, కీళ్ళు, తల, వెన్నెముఖ, గుండె, కిడ్నీ, పురీషనాళం, ఊపిరి తిత్తులు, ఇలా ఒకటి పన్ను ,కన్నువెన్ను, ఆన్ని టికి ప్లాంట్లు, ఇన్ ప్లాంట్లు , చేయడంలో ప్రపంచంలో పేరు ఎన్నిక గన్న డాక్టర్ లే ఉంటారు. సేవలు అందిస్తారు. ఒక డాక్టర్ కన్సల్టెన్సీ 300/ నుంచి 800/ కు తక్కువగా ఉండదు.  అసలు వచ్చిన  సమస్య  ఏమిటి అంటే దబ్భు పెడితే    ట్రీట్ మెంట్ కాస్ట్ తక్కువ,  ఇన్సూరెన్స్ తో అయితే ఎక్కువ ఇదేమి లాజిక్ అని అనుకుంటున్నారు? పాలసీ దారులు. ఇంకొందరు ఏదో ఒకటి ముందు  బయట పడ్డాం  కదా ఈ మీమాంస అవసరమా? అని అనుకుంటున్నారు. యెస్ అవసరమే ఎందుకంటే పాలసీ దారుల రక్షణ అవసరం కనుక  ఇరిడా నిర్దేశించిన ప్రమాణం ప్రకారం ఇన్సూరెన్స్ పెట్టుబడికి మనకు దక్కే లాభం ఎంత అని పెట్టుబడి దారులు అనుకుంటే పెట్టుబడి దారులు ఆలోచించేవాళ్లు. అటు ప్రైవేట్ , ఇటు ప్రభుత్వ రంగం లో పెట్టుబడులు కుప్పలు తెప్పలుగా ఒస్తోంటే ఇంకా  ప్రైవెట్ రంగంలో మరిన్ని విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తే ఆసుపత్రు లకు పండగ మాకు ఎందుకు ఇన్సూరెన్స్ దండగా అని సామాన్యుడు ఫీల్ అవుతున్నాడు. ఆడండి మనం కడుతున్న ఇన్సూరెన్స్లు మనకు కలిగే లాభం. మీ ఇన్సూరెన్స్ సంస్యలగురించి మాకు రాయండి  నేరుగా మా నిపుణులతో మాట్లా డండి . ఇన్సూరెన్లు క్లైములు వాటి పరిష్కారాలు వివిధ ర కా ల కేసులు ఇన్సూరెన్స్ పరిష్కారంలో అంబుట్స్మెన్ ఇచ్చే తీర్పులు న్యాయనిపుణుల   సలహా లు తదితర ఆంశాలు మరో ఎపిసోడ్ లో చర్చిద్దాం   అంటిల్ దేన్ కీప్  వాచింగ్ రాజ్ న్యూస్. 

రెడీ టూ యూజ్ ఫుడ్స్.. ఈ నిజం తెలిస్తే అస్సలు ముట్టరు..!

ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు.  సమయాభావం కారణంగా చాలా సార్లు వండుకోవడం కష్టంగా మారుతుంది.  ఇలాంటి సందర్బాలలో బయట ఆహారం తినాలని  అనుకున్నా అవి ఖర్చుతో కూడుకుని ఉండటం తో వాటి వైపు వెళ్లాలన్నా కూడా భయపడతారు. ఇలాంటి వాళ్లను టార్గెట్ చేసుకుని వచ్చినవే ప్యాకేజ్డ్ ఫుడ్స్.. వీటిలో రెడీ టూ యూజ్  ఫుడ్స్ చాలా ఉంటున్నాయి.  సింపుల్ గా వేడి నీరు పోయడం లేదా వేడి చేయడం ద్వారా నిమిషాలలో ఆహారం రెడీ అవుతుంది.  పైగా మంచి మసాలాలతో రుచిగా ఉండటంతో రెడీ టూ యూజ్  పుడ్స్ కు మంచి డిమాండ్ కూడా ఉంది.  చిన్న పిల్లలు,  యువత ఎక్కువగా ఈ రెడీ టూ యూజ్ ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు.  అయితే ఈ ఫుడ్స్ గురించి చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అసలు రెడీ టు యూజ్ ఫుడ్స్ అంత రుచిగా ఎందుకుంటాయి? వీటిని తినడం వల్ల కలిగే ప్రమాదం ఏంటి? తెలుసుకుంటే.. రెడీ టూ యూజ్ ఫుడ్స్.. అల్యూమినియం సాల్ట్.. సాధారణంగా రెఢీ టూ యూజ్ ఫుడ్స్ అన్నీ ప్యాక్డ్ ఫుడ్స్ గానే ఉంటాయి. ఈ ప్యాక్స్ లోని ఆహారాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా వాటిలో హానికర రసాయనాలు కలుపుతారు. మరీ ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉపయోగించే కారం, పసుపు, మసాలలో అల్యూమినియం సాల్ట్స్ ను కలుపుతున్నారు. వీటివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని,  వీటిని వాడటం వల్ల చిన్నపిల్లలు , వృద్దులు,  అప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెడీ టు యూజ్ ఫుడ్స్ తో వచ్చే వ్యాధులు.. రెడీ టూ యూజ్ ఫుడ్స్ లో ఆలమ్ స్పైస్ కలుపుతారు.  ఇది కలిపిన మసాలాలు ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని నరాల బలహీనత, మతిమరుపు లాంటి సమస్యలు వస్తున్నాయి.  50ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు రావడం ఈ ఆలమ్ స్పైస్ వాడటం వల్లే అని స్పష్టం చేస్తున్నారు. అసలేంటీ ఆలమ్ స్పైస్..   అల్యూమినియం సాల్ట్ నే ఆలమ్ స్పైస్ అని అంటారు. అల్యూమినియం పొటాషియం సల్పేట్ నే అల్యూమినియం సాల్ట్ అని అంటారు.  మసాలా దినుసులు పాడవకుండా దీన్ని కలుపుతుంటారు. దీని వల్ల మసాలా దినులు ఎక్కువ కాలం పాటూ రుచి,  స్వభావం,  రంగు  మారకుండా పురుగులు పట్టకుండా, అలాగే మసాలాలు ఉండలు కట్టకుండా సహాయపడుతుంది. ప్యాకింగ్ ఫుడ్స్ లో దీన్ని మోతాదుకు మించి వాడుతుండటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.  అందుకే వీలైనంత వరకు మసాలా పొడులను కూడా బయటి నుండి తెచ్చుకోవడం కంటే.. ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఇనుప పాత్రలో  ఈ ఆహారాలను వండితే చాలా డేంజర్..!

ఇనుప పాత్రలలో వండిన పదార్థాలు   ఆరోగ్యానికి ఎంతో మంచివి. నాన్ స్టిక్,  అల్యూమినియం తో ఇనుప పాత్రలలో వండిన ఆహారం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  ఇనుప పాత్రలలో వంట చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఆహారంలో సహజంగా ఐరన్  ఉత్పన్నం అవుతుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి,  రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. అయితే ఇనుప పాత్రలలో వండే ప్రతి ఆహారం  ఆరోగ్యానికి మంచి చేస్తుంది అనుకుంటే పొరపాటే. కొన్ని ఆహార పదార్థాలలో ఉండే  రసాయనాలు ఐరన్ తో  చర్య జరిపి, ఆహారం రుచి,  రంగును మార్చడమే కాకుండా, ఫుడ్ పాయిజనింగ్,  చర్మ వ్యాధుల వంటి తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుంది. అందువల్ల ఏ ఆహారాలను ఇనుప పాత్రలో వండకూడదు తెలుసుకోవడం ముఖ్యం. పుల్లని ఆహారాలు.. చింతపండు, టమోటా లేదా నిమ్మకాయ వంటి పుల్లని పదార్థాలు కలిగిన గ్రేవీలను ఎప్పుడూ ఇనుప పాత్రలో ఉడికించకూడదట. ఈ పదార్థాలలో సహజ ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఇనుముతో వెంటనే రియాక్ట్ అవుతాయి. ఆహారానికి ఇనుము రుచిని ఇస్తాయి.  జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తాయి. పుల్లగా ఉండటం వల్ల ఇనుము ఆహారంలోకి ఎక్కువ మొత్తంలో లీచ్ అవుతుంది, ఇది శరీరంలో పాయిజన్ గా కూడా మారవచ్చు. పాలు, పెరుగుతో తయారు  చేసే పదార్థాలు.. పాలు, పెరుగు జోడించి తయారు చేసే ఆహారాలు,  పాయసం, కస్టర్డ్ వంటి వంటకాలను ఇనుప పాత్రలలో వండటం నిల్వ చేయడం మంచిది కాదు.    ఇనుప పాత్రలు చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి, దీని వలన పెరుగు లేదా పాలు విరుగుతాయి. ఇనుము పాత్ర  ఈ తెల్లగా కనిపించే వంటకాలను నల్లగా లేదా నిస్తేజంగా మారుస్తాయి. దీని వలన వాటి రుచి,  పోషక విలువలు రెండూ ప్రభావితం అవుతాయి. రాజ్మా,  శనగలు..  తరచుగా ఇనుప పాత్రలో రాజ్మా  బీన్స్, శనగపప్పు వండుతుంటారు. ఇనుప పాత్రలు అన్ని వైపులా సమానంగా వేడెక్కవు, ఈ భారీ ధాన్యాలు కొన్ని ప్రాంతాలలో ఉడికిపోతాయి,  మరికొన్ని  తక్కువగా ఉడుకుతాయి. సరిగా ఉడకని బీన్స్ లేదా శనగపప్పు తినడం వల్ల తీవ్రమైన ఉబ్బరం,  గ్యాస్ వస్తుంది. వాటిని ప్రెజర్ కుక్కర్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కుండలో ఉడికించడం ఉత్తమం. వెనిగర్ తో చైనీస్ ఫుడ్స్.. ఈ రోజుల్లో వెనిగర్‌ను చౌ మెయిన్,  పాస్తా వంటి వంటకాల్లో  విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. వెనిగర్ అనేది బలమైన ఆమ్లం.  ఇది నిమ్మకాయ, చింతపండు లాగా ఐరన్ తో చాలా తొందరగా రియాక్ట్  అవుతుంది.  ఇలా వండే ఆహారం సేఫ్ కాదు. వెనిగర్ ఉన్న ఏదైనా వంటలకు ఐరన్  కంటే నాన్-స్టిక్ లేదా స్టీల్ పాత్రలను ఎంచుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా బయట చైనీస్ ఫుడ్స్ తినేటప్పుడు వెనిగర్ వాడుతున్నారా,  ఏ పాత్రలు వాడుతున్నారు  తెలుసుకోకుండా పొరపాటున కూడా తినకండి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

తిప్పతీగ.. ఇలా వాడి చూడండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!

తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్ లాంటివి కొనడం చేస్తుంటారు. అయితే తిప్పతీగను సరైన విధానంలో వాడటం ద్వారా చాలా రకాల ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అసలు తిప్పతీగలో ఉండే పోషకాలు ఏంటి? ఇది ఏ వ్యాధులకు ప్రయోజనకరంగా ఉంటుంది?తెలుసుకుంటే.. తిప్పతీగలో ఉండే పోషకాలు.. తిప్పతీగలో కాల్షియం,  భాస్వరం,  ఐరన్,  రాగి, మాంగనీస్,  జింక్, విటమిన్-సి,  బీటా-కెరోటిన్, ప్రోటీన్,  ఫైబర్,  కార్బోహేడ్రేట్లు, కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు అన్నీ ఉంటాయి. తిప్పతీగ ప్రయోజనాలు.. రక్తహీనత.. మహిళలలో రక్త హీనత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తిప్పతీగను తీసుకుంటే చాలా మంచి బెనిపిట్స్ ఉంటాయి.   తిప్పతీగలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది.  ఇది రక్త  నష్టాన్ని భర్తీ చేయడంలో సహాయపడుతుంది.   రోగనిరోధక శక్తి.. శీతాకాలంలో రోగనిరోధక శక్తి బాగా బలహీనం అవుతుంది. రోగనిరోధక శక్తి తిరిగి బలంగా మారడానికి, శీతాకాలపు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి రోజూ తిప్పతీగ తీసుకుంటే చాలా మంచిది.  తిప్పతీగ లోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని బలపరచడంలో సహాయపడుతుంది. పొట్ట సమస్యలు.. పొట్ట సమస్యలతో ఇబ్బంది పడేవారు తిప్పతీగ వాడితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. తిప్పతీగలో ఫైబర్ కంటెంట్ మెరుగ్గా ఉంటుంది.  ఇది పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.  రోజూ తిప్ప తీగ తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులోనే స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఎముకలు.. తిప్పతీగలో కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది.  ఇది ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది.  అందుకే ప్రతి రోజూ తిప్పతీగ తీసుకుంటే కాల్షియం మెరుగ్గా అందుతుంది.  ఎముకలు బలంగా మారతాయి. తిప్పతీగతో జాగ్రత్త.. తిప్పతీగ తినడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఏదైనా మితంగా తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది.  అలాగే తిప్పతీగ కూడా పరిమితంగా తీసుకోవాలి. ఎక్కువ తిప్ప తీగ తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలకు బదులు ఆరోగ్యానికి హాని ఎదురవుతుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

సయాటికా నొప్పి ఎందుకు వస్తుంది... ఎలా వస్తుంది తెలుసా?

శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి. వీటిని శరీరమే మెల్లిగా నయం చేసుకుంటుంది.  కానీ కొన్ని నొప్పులు శరీరాన్ని చాలా ఇబ్బంది పెడతాయి.  ఎక్కువకాలం అలాగే ఉండటం, రోజు వారి చేసుకునే పనులకు ఇబ్బంది కలిగించడం వంటివి జరుగుతాయి.  ఇలాంటి వాటిలో సయాటికా నొప్పి కూడా ప్రధానమైనది. సయాటికా నొప్పి నడుము నుండి పాదాల వరకు చాలా విపరీతంగా ఉంటుంది.  ఇది కూర్చోవడం,  నిలుచోవడం, నడవడం.. ఇలా అన్ని విషయాలలోనూ ఇబ్బంది పెడుతుంది. అసలు సయాటికా నొప్పి ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది.. తెలుసుకుంటే.. సయాటికా..  సయాటికా లక్షణాలలో నడుము నుండి పాదాల వరకు నొప్పి ఉంటుంది. ఇది ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటుంది. మన శరీరంలో అతి పొడవైన నాడి అయిన సయాటిక్ నాడి వాపు లేదా కుదించబడి నొప్పిని కలిగించినప్పుడు సయాటికా నొప్పి వస్తుంది. దీనిని చాలా మంది పట్టించుకోనట్టు నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఇది  చాలా ప్రమాదకరం.  దీన్ని ముందుగానే గుర్తించగలిగే ట్రీ ట్మెంట్ ద్వారా దీన్ని చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు.  లేదంటే తీవ్రంగా మారి చాలా ఇబ్బంది పెడుతుంది. సయాటికా నొప్పి ఎలా వస్తుంది.. మన శరీరంలో అతి పొడవైన నాడి  సయాటిక్ నాడి.  ఈ నాడి  వాపు లేదా కుదించబడినప్పుడు సయాటికా నొప్పి మొదలవుతుంది. సయాటిక్ నాడి మన వెన్నెముక బేస్ వద్ద మొదలై, కలిసిపోయినప్పుడు మందంగా మారే ఐదు వేర్వేరు నరాల మూలాల కలయిక ద్వారా ఏర్పడుతుంది. ఇవి  మన శరీరం  రెండు వైపులా నడుస్తాయి. మన వెన్నెముక బేస్ నుండి మన తుంటి ద్వారా మన కాళ్ళ వెనుక వరకు విస్తరించి ఉంటాయి. సయాటికా నొప్పి లక్షణాలు.. సయాటికా నొప్పి సాధారణంగా శరీరంలోని ఒక ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా కాళ్ళు,  వీపు ప్రాంతాలలో  నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. కొంతమందిలో ఈ  నొప్పి గట్టిగా తగిలే  విద్యుత్ షాక్ లాగా అనిపిస్తుంది. కాళ్ళలో తిమ్మిరి,  బలహీనత కూడా  ఉంటుంది. సయాటికా నొప్పికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి హెర్నియేటెడ్ డిస్క్. గాయం లేదా ఒత్తిడి కారణంగా వెన్నెముకలోని అనేక డిస్క్‌లలో ఒకటి  పగిలిపోయినప్పుడు ఇది వస్తుంది. దీనివల్ల డిస్క్ లోపల ద్రవం బయటకు లీక్ అవుతుంది. దీని వల్ల హెర్నియేటెడ్ డిస్క్ ఏర్పడుతుంది. ఇది వెన్నుపాము, దాని నరాలపై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల నొప్పి,  బలహీనత ఏర్పడుతుంది. సయాటికా నొప్పికి ఒక సాధారణ కారణం వెన్నెముక కింది భాగంలో గాయం కావడం.  ప్రమాదంలో గాయపడి, ఆ గాయం వెన్నెముక కింది భాగంలో ప్రభావం చూపినప్పుడు సయాటికా నొప్పి రావచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ కూడా సయాటికా నొప్పికి కారణం అవుతుంది.  మన కీళ్లలో కార్టిలేజ్ అనే మృదువైన పొర ఉంటుంది. ఇది ఎముకలు ఒకదానికొకటి రుద్దకుండా కాపాడుతుంది. ఈ పొర క్షీణించడం లేదా బలహీనపడటం మొదలైనప్పుడు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతాయి. సాధారణంగా ఆర్థరైటిస్ అని పిలువబడే ఆస్టియో ఆర్థరైటిస్‌ను ఆర్థరైటిస్ అని కూడా అంటారు.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

బాదం పప్పు తినే వారికి అలర్ట్.. ఈ నిజాలు తెలుసుకోకుండా తినకండి..!

డ్రై ప్రూట్స్ కోవలో చాలామంది తమకు తెలియకుండానే నట్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో బాదం,  వాల్నట్ వంటివి ప్రధానంగా ఉంటాయి.  ఇవి  ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవని అనుకుంటారు. చాలా రకాల వ్యాధులు రాకుండా చేయడంలో ఈ  డ్రై నట్స్ చాలా సహాయపడతాయి.   బాదం పప్పులు అటువంటి డ్రై నట్స్ లో ఒకటి. బాదం పప్పులు శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందించే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు,  ఫైబర్ వంటివి కలిగి ఉంటాయి.  ప్రతిరోజూ రాత్రి బాదం పప్పులు నీటిలో నానబెట్టుకుని వాటిని ఉదయాన్నే  తినేవారు అధికంగా ఉంటున్నారు. అయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని  రోజూ అధికంగా బాదం పప్పు తినేవారు కొందరు ఉంటారు.  అసలు బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం?  ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే.. బాదం తో ఆరోగ్యం.. బాదం అధికంగా తినడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.   కొంతమందిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను కూడా కలిగిస్తుందని కూడా చెబుతున్నారు. ఇది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులపై  ప్రతికూల ప్రభావాలను చూపుతుందట. కాబట్టి బాదం పప్పులు ఎన్ని తీసుకోవాలి అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. బాదం పప్పుతో నష్టాలు.. బాదం పప్పును అధికంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, బరువు పెరగడం,  మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు వస్తాయి. రోజువారీ సిఫార్సు చేయబడిన బాదం పప్పు తీసుకోవడం వ్యక్తిగత ఆరోగ్యాన్ని బట్టి మారుతుంది. అయితే వీటిని తక్కువగానే తీసుకోవాలి. బాదం పప్పును అధికంగా తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు కనుగొన్నారు. బాదం పప్పులో కరిగే ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఈ సమ్మేళనం అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల వైఫల్యం,  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అందువల్ల బాదం పప్పును అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బాదం ఎక్కువగా తినేవారికి  బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. సాధారణ ఆహారంతో పాటు పెద్ద మొత్తంలో బాదం (20 కంటే ఎక్కువ) తీసుకుంటే, అదనపు కేలరీలు చేరి వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. బరువు పెరగడం వల్ల శరీరంలో అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఫైబర్  ఎక్కువ ఉండటం వల్ల ఇతర ఖనిజాలైన కాల్షియం, మెగ్నీషియం, జింక్,  ఐరన్  వంటి ఖనిజాల  శోషణకు ఆటంకం కలిగిస్తుంది.  బాదంను పెద్ద మొత్తంలో తీసుకుంటే అది శరీరంలోని ఇతర పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. దీని కారణంగా అలసట, బలహీనత,  అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. -రూపశ్రీ

కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసా?

ల్యాప్ టాప్  వాడకం ప్రస్తుతం జనరేషన్ లో చేసే ఉద్యోగాలలో సర్వసాధారణం అయిపోయింది.   కార్పొరేట్ ఉద్యోగాల నుండి సాధారణ ఆఫీసుల వరకు ప్రతి ఒక చోట కంప్యూటర్ వాడకం తప్పనిసరిగా మారిపోయింది.  అలాగే ఇటీవలి కాలంలో వర్క్ ఫ్రం హోం కూడా ఎక్కువ అయ్యింది. దీంతో  సౌలభ్యం కోసం లాప్ టాప్ వినియోగించడానికి అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. అయితే  లాప్ టాప్  ఎక్కువగా వినియోగించేవారిలో  కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనే సమస్య వస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ లో ఉండే లక్షణాలు ఏంటి? ఇది ఎంత వరకు ప్రమాదం? దీన్ని ఎలా నివారించాలి?  అంటే..   కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది  ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు,  స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి  చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం,  వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం,  రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం,  పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.   ఎప్పుడూ  కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌తో పని చేయడం వల్ల    మెడ కండరాలు,  మణికట్టు నరాలపై ఒత్తిడి పడుతుంది. రోజంతా టైప్ చేయడం వల్ల కలిగే ఒత్తిడి కార్పల్ టన్నెల్‌లోని కణజాల వాపు,  మధ్యస్థ నాడి కుదింపునకు కారణమవుతుంది. ఆఫీసులో పనిచేయడం మాత్రమే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌కు కారణం కాదు,  వయస్సు,  జన్యుశాస్త్రం కూడా పాత్ర పోషిస్తాయి.  కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  ఎర్గోనామిక్‌గా రూపొందించబడిన కంప్యూటర్ మౌస్ కార్పల్ టన్నెల్‌లోని నరాలపై ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పని చేస్తున్నప్పుడు మౌస్  మణికట్టుపై ఒత్తిడి పెట్టకుండా చూసుకోవాలి. అలాగే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ మీద వంగి పని చేయడం వల్ల మెడ,  వీపుపై  ఒత్తిడి పడుతుంది.  ఇది మీ చేతులు,  మణికట్టును ప్రభావితం చేస్తుంది. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌ను నివారించడానికి, లాప్ టాప్ పై పని చేసేటప్పుడు కూర్చునే   భంగిమపై  శ్రద్ధ వహించాలి. ఇక మణికట్టు ఆరోగ్యంగా ఉండాలంటే  సరైన టైపింగ్ పొజిషన్  చాలా ముఖ్యం.  మణికట్టును ఎక్కువగా పైకి లేదా క్రిందికి వంచకుండా ఉండాలి.  కీబోర్డ్‌ను  మోచేతుల వద్ద లేదా కొద్దిగా క్రింద ఉంచడానికి ప్రయత్నించాలి. అదే విధంగా  కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌ను  ప్రతి గంటకు ఒకసారి  డెస్క్ నుండి లేవడం చాలా ముఖ్యం. బ్రేక్  సమయంలో  మణికట్టు,  చేతులను సాగదీయాలి. ఇది నరాల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆఫీసులో పనిచేయడం అంటే కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌ల గురించి మాత్రమే కాదు, చేతివ్రాత గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.  మంచి పట్టు ఉన్న పెద్ద పెన్నులను ఎంచుకోవాలి. మణికట్టు మీద ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి.  -రూపశ్రీ

ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగితే మ్యాజిక్కే!

భారతీయుల వంటింట్లో బోలెడు దినుసులు ఉంటాయి.  వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు మెరుగ్గా ఉంటాయి.  అటు మౌత్ ఫ్రెషనర్ గా, ఇటు వంటల్లో రుచిని పెంచడానికి ఉపయోగించే దినుసుల్లో సోంపు అగ్ర స్థానంలో ఉంటుంది.  సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు  వైద్యులు,  ఆహార నిపుణులు.  అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? సోంపు నీరు ఎలా తయారు చేసుకుని తాగాలి? ఇవన్నీ తెలుసుకుంటే సోంపుతో కలిగే బెనిఫిట్స్  ను అందరూ పొందవచ్చు. సోంపు నీటి ప్రాధాన్యత..  సోంపు నీటిని శక్తివంతమైన,  ఆరోగ్యకరమైన పానీయంగా ఉపయోగిస్తున్నారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  తరచుగా సోంపును మౌత్ ఫ్రెషనర్‌గా మాత్రమే ఉపయోగిస్తుంటారు.  కానీ సోంపు దీని కంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక వ్యాధులను నయం చేయడంలో శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది. సోంపు నీరు ఎలా తయారు చేయాలి? సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది కడుపు సంబంధిత వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది,  జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. సోంపు నీరు ప్రయోజనాలు..  ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నీటిని తాగితే, శరీరంలో అనేక సానుకూల మార్పులు కలుగుతాయి. సోంపు నీరు బరువు తగ్గడానికి  సహాయపడుతుంది.  ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. సోంపు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు సంబంద వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది యాసిడ్ కారణంగా  ఏర్పడే ఎసిడిటీ,  యాసిడ్ రిప్లక్స్ వంటి ఉదర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కడుపు చికాకును తగ్గిస్తుంది,  కడుపును మంటను తగ్గించి కడుపును శాంతపరుస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కుంటున్న అతి ఆకలి సమస్యకు సోంపు చెక్ పెడుతుందట.   కడుపు నిండినప్పటికీ పదే పదే  ఆహారం  తినాలని అనిపించడం, ఆకలి వేయడం వంటి లక్షణాలు ఆరోగ్యానికి హానికరం. సోంపు నీరు తాగడం వల్ల అనవసరంగా అతిగా ఆకలి వేయడం అనే సమస్య తగ్గుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే సొంపు నీరు తాగడం వల్ల  శరీరం డిటాక్స్ అవుతుంది.  ఇది  కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులు,  సమస్యలను తగ్గిస్తుంది. సోంపు నీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే సోంపులో ఉండే పొటాషియం,  మెగ్నీషియం వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. సొంపు నీరు మహిళలకు ఋతుస్రావ సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.  పాలిచ్చే స్త్రీలలో పాలు పెరగడానికి కూడా సహాయపడుతుంది. -రూప

శీతాకాలంలో ఉసిరికాయతో ఈ కాంబినేషన్లు ట్రై చేయండి.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!

ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి.  అలాంటి వాటిలో ఉసిరి కాయ ప్రధానమైనది.  ఉసిరికాయను ఆయుర్వేదం అమృత ఫలం అని అంటుంది. ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది,  జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.  శీతాకాలంలో ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం జలుబు, దగ్గు,  ఫ్లూ వంచివి దరిచేరవు. కేవలం సీజనల్ ఇన్పెక్షన్లు నివారించడమే కాదు.. ఫ్యాట్ బర్నర్ గా కూడా సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిని మెరుగుపరుస్తుంది,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. విటమిన్ స,  యాంటీఆక్సిడెంట్లు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయి.   ధమనులలో ఫలకం పేరుకుపోకుండా ఉండటానికి , ధమనులలో ఫలకం సమస్య తగ్గించడానికి సహాయపడుతుంది.  కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను కూడా తగ్గిస్తుంది.  మొత్తం రోగనిరోధక శక్తి,  హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరిని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. కానీ శీతాకాలంలో ఉసిరికాయలు సమృద్దిగా దొరుకుతాయి.  ఉసిరికాయలను కొన్ని కాంబినేషన్లలో తీసుకుంటే ఇమ్యూనిటీ మరింత పెరుగుతుంది. ఇంతకూ ఉసిరికాయతో బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసుకుంటే.. ఉసిరి-తేనె.. తేనె కాంబినేషన్ లో  ఉసిరి తీసుకుంటే ఉసిరిలో ఉండే విపరీతమైన పులుపు, వగరు రుచి తగ్గుతుంది. పైగా బోలెడు    ప్రయోజనాలను కూడా అందిస్తుంది.  ఉసిరి ఇమ్యూనిటీని పెంచుతుంది., మరోవైపు తేనె గొంతు సమస్యలు తగ్గిస్తుంది. గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.   శరీరానికి శక్తిని అందిస్తుంది. తేనె-ఉసిరి కాంబినేషన్ ఇన్ఫెక్షన్లతో  పోరాడటానికి సహాయపడుతుంది, మంటను తగ్గిస్తుంది,  శ్వాసకోశ ఆరోగ్యానికి సపోర్ట్  ఇస్తుంది. ఎలా తినాలి.. టీస్పూన్ ఉసిరి పొడి లేదా తాజా ఉసిరి రసం 1 టీస్పూన్ తీసుకోవాలి.  దీన్ని సమాన పరిమాణంలో  తేనెతో ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఉసిరి-పసుపు.. ఉసిరిలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.   పసుపులో  కర్కుమిన్ ఉంటుంది. ఇవి రెండు  కలిసినప్పుడు రోగనిరోధక శక్తి సూపర్ గా  పెరుగుతుంది, మంటను తగ్గిస్తుంది,  శరీరాన్ని  డిటాక్స్  చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, తెల్ల రక్త కణాల పనితీరును పెంచడానికి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని సహాయపడతుంది ఎలా తీసుకోవాలి.. స్పూన్ ఉసిరి రసాన్ని గ్లాసు  నీటిలో వేసి అందులో కాసింత మంచి పసుపును కలిపి తాగాలి. లేదంటే ఒక ఉసిరికాయ,  ఒక  ఒక ఇంచ్ తాజా పచ్చి పసుపును మిక్సీ వేసి జ్యూస్ చేసుకుని తాగాలి. ఇందులో కాసింత కరివేపాకు కూడా వేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు. అలాగే క్యారెట్ లాంటివి వేసుకోవచ్చు. ఉసిరి-అల్లం..  అల్లంను ఉసిరితో కలపి తీసుకున్నా ఇమ్యూనిటీ మెరుగవుతుంది.  అల్లం శరీరంలో వేడిని  పెంచుతుంది. ఉసిరి  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరరానికి వేడిని అందించడం ద్వారా  అల్లం రక్త  ప్రసరణను పెంచుతుంది,  ఇన్ప్లమేషన్లతో పోరాడుతుంది.   ఉసిరిలో ఉండే  విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్ల కంటెంట్ శరీర సహజ రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి.. 2 టేబుల్ స్పూన్ల తాజా ఉసిరి రసాన్ని 1/2 టీస్పూన్ తురిమిన అల్లం రసం తీసుకోవాలి. వీటిని  1/2 కప్పు నీటితో కలిపి తీసుకోవచ్చు. కొన్ని చుక్కల తేనె జోడిస్తే మరీ మంచిది. దీన్ని  ఉదయాన్నే తీసుకోవాలి. ఉసిరి-బెల్లం.. ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకోవచ్చు.  ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా మెరుగైన ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది.  ఉసిరి-బెల్లం కలిపి మురబ్బా తయారు  చేసుకోవచ్చు.ఈ కాంబో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఐరన్  శోషణను పెంచుతుంది.  శరీరానికి  వెచ్చదనాన్ని అందిస్తుంది. ఎలా తీసుకోవాలి.. ఉసిరిని ఆవిరి పట్టి వాటిని విత్తనాలు తీసివేసి , ఆపై వాటిని బెల్లం సిరప్ లో ఉడికించి, ఉప్పు, మిరియాలు,  జీలకర్ర పొడితో కలిపి తీసుకోవాలి.  చాలా మంచి ఇమ్యునిటీ ఇస్తుంది.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వాల్నట్స్ తింటే ఈ వ్యాధులు అన్నీ మాయం..!

ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి.  ధర కాస్త ఎక్కువ అనే కారణంగా సాధారణ ప్రజలు వాల్నట్స్ కు దూరంగా ఉంటారు. అయితే వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా బెస్ట్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు సులువుగా నయం  అవుతాయని అంటున్నారు. ఇంతకూ వాల్నట్స్ ను తినడం వల్ల తగ్గే వ్యాధులు ఏంటి? వాల్నట్స్ లో ఉండే పోషకాలు ఏంటి? తెలుసుకుంటే.. వాల్నట్స్ లో పోషకాలు.. వాల్నట్స్ లో  అత్యంత ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి.  వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి.  వాల్నట్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. వాల్నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని చాలామంది చెబుతారు. అయితే ఇది మాత్రమే కాకుండా చాలా రకాల వ్యాధులు కూడా నయం అవుతాయి. గుండె ఆరోగ్యం.. వాల్నట్స్ ను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందట.  అంతేకాదు ఇది చెడు కోలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుందట. రక్తపోటు.. రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు రోజు వాల్నట్స్ ను తీసుకుంటూ ఉంటే చాలా మంచిది.  రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. బరువు.. బరువు తగ్గడానికి ట్రై చేసేవారు వాల్నట్స్ తింటే చాలా మేలు. వాల్నట్స్ లో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగకుండా నిరోధిస్తాయి. తర్వాత బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. మానసిక ఆరోగ్యం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటితో పాటు వాల్నట్స్ ను కూడా తింటూ ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది.  ఇది మెదడు పనితీరుకు అవసరమైన ఒమెగా-3 ఆమ్లాలను కలిగి ఉండటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.  అలాగే అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ.. జీర్ణవ్యవస్థ సరిగా లేకున్నా, జీర్ణాశయం పనితీరు మందగించినా చాలా సమస్యగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను సరిచేసి తిరిగి ఆరోగ్యంగా చేయడంలో వాల్నట్స్ కీలకపాత్ర పోషస్తాయి.  వాల్నట్స్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.  మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది. వాపులు, నొప్పులు.. వాల్నట్స్ లో ఉంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ల7ణాలు వాపులను, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.  ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

గ్యాస్ సమస్యను పెంచే స్నాక్స్.. సాయంత్రం 6గంటల తర్వాత వీటిని అస్సలు తినకూడదు..!

సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఇంట్లో కుదరక పోతే కనీసం బయట అయినా స్నాక్స్ లాగించేవారు ఉంటారు. అయితే కొన్ని రకాల స్నాక్స్ ను సాయంత్రం 6గంటల తర్వాత అస్సలు తినవద్దని చెబుతున్నారు ఆహార నిపుణులు.  దీని వల్ల గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుందని,  రాత్రంతా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండాల్సిందే అని అంటున్నారు. ఇంతకీ సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడని స్నాక్స్ ఏంటో తెలుసుకుంటే.. సాయంత్రం 6 గంటల తర్వాత కొన్ని స్నాక్స్ తినకూడదని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లు చెబుతున్నారు.  సమోసాలు, జిలేబీలు, పానీపురి, వడ పావ్, కచోరీలు, వేయించిన మోమోలు,  నామ్కీన్‌లను సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడదట. ఎక్కువ బటర్ తో కూడిన  బర్గర్‌లు, పావ్ భాజీలు కూడా సాయంత్రం 6 తరువాత తినకూడదని అంటున్నారు. పైన చెప్పుకున్న  ఆహారాలను అప్పుడప్పుడు తినడం వల్ల ఏమీ కాదని అనుకుంటారు. కానీ అప్పుడ్పుడు తినడం అనేది అలవాటు అయితే చాలా కష్టమట.  ఈ అలవాటు శరీరానికి ఎక్కువ కేలరీలు, కొవ్వు,  చక్కెరను ఇస్తాయి. ఇది బరువు పెరగడం, గ్యాస్, ఎసిడిటీ,  రక్తంలో  చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. వేయించిన ఆహారాలు,  టైప్ 2 డయాబెటిస్ మధ్య సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వేయించిన ఆహారాలు తినేవారిలో రక్తంలో చక్కెర నియంత్రణ తక్కువగా ఉంటుంది.  ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగే ప్రమాదం ఉంది. వేయించిన ఆహారాలు పేగు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తాయి, వాపును పెంచుతాయి.   ఆకలిని, షుగర్ క్రేవింగ్స్ ను నియంత్రించే హార్మోన్లు కూడా తగ్గుతాయి.  దీని వల్ల వీటిని పదేపదే తినాలని అనిపిస్తుంది. ఇది బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందట. కాబట్టి  పైన పేర్కొన్న ఆహారాలను అప్పుడప్పుడు తినడం కూడా కాస్త ఇబ్బందే. అలాగే కొన్ని ఆహారాలను 6 గంటల తర్వాత అస్సలు తినకూడదు కూడా.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...