టీడీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా శ్రీకృష్ణదేవరాయలు
posted on Jun 22, 2024 @ 10:44PM
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, బైరెడ్డి శబరిలను నియమించారు. కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని, పార్లమెంట్ విప్‌గా గంటి హరీష్‌లను ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం గురించి, రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు ఏం చేయాలన్న దాని మీద చర్చ జరిగింది.