23 రాష్ట్రాలకు విస్తరించిన తబ్లీగి జమాత్ కేసులు
posted on Apr 18, 2020 @ 7:55PM
దేశవ్యాప్తంగా 14,378 పాజిటివ్ కేసులు నమోదు కాగా,480 మంది మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. గడచిన 24 గంటల్లో 991 కొత్త కేసులు నమోదు అయ్యాయని, 43 మంది మృతి చెందారని అయన చెప్పారు.
దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 1992 మంది కోలులున్నారని ఆయన పేర్కొన్నారు. 14,378 పాజిటివ్ కేసులలో 4,291 కేసులు29.8 శాతం తబ్లిఘి జమాత్ వల్ల నమోదయ్యాయని ఆయన చెప్పారు.
23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తబ్లిఘి జమాత్ తాలూకు కేసులు నమోదయ్యాయని లవ్ అగర్వాల్ వివరించారు. తమిళనాడులో 84 శాతం కేసులు,ఢిల్లీలో 63శాతం కేసులు,తెలంగాణాలో 79 శాతం కేసులు,ఉత్తరప్రదేశ్ లో 59 శాతం కేసులు,ఏపీలో 61 శాతం కేసులు శాతం తబ్లిఘి జమాత్ వల్ల నమోదయ్యాయన్న ఆయన పేర్కొన్నారు. 67 జిల్లాల నుండి 14 రోజులుగా కొత్త కరోనా కేసులు నమోదుకాలేదు. 23 రాష్ట్రాల్లోని 47 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి RT-PCR పరీక్ష అనేది COVID-19 నిర్ధారణకు ప్రామాణిక ఫ్రంట్‌లైన్ పరీక్ష,కరోనా నిఘా కోసం ఉపయోగించాల్సిన వేగవంతమైన యాంటీబాడీ పరీక్షఅని కూడా లవ్ అగర్వాల్ చెప్పారు. మన దేశంలో మరణాల రేటు సుమారు 3.3 శాతం ఉందన్నారు. 0-45 సంవత్సరాల మధ్య 14.4% మరణాలు, 45-60 సంవత్సరాల మధ్య 10.3% మరణాలు, 60-75 సంవత్సరాల మధ్య 33.1% మరణాలు, 75 సంవత్సరాలు ఆపైన 42.2% మరణాలు నమోదు అయ్యాయని ఆయన వివరించారు. సామాజిక దూరం అమలులో రాష్ట్రాలు బాధ్యత వహించాలని, హాట్‌స్పాట్ ప్రాంతాల్లోని ప్రజలకు ఎక్కువ సంఖ్యలో ర్యాపిడ్ టెస్టులు చేయాలని లవ్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.