నీటిలో నిరాహార దీక్ష..
posted on Jun 8, 2021 @ 9:35AM
నిరసన ఏవైనా ఏ రోడ్డు మీదో.. లేదంటే ప్రభుత్వ కార్యాలయం ముందో.. లేదంటే ధర్నా చౌక్ లోనో చేస్తారు.. కానీ వీళ్ళు మాత్రం చాలా కొత్తగా తమ నిరసనను తెలిపారు.. అది ఏంటో తెలిస్తే మీకు నిరసన ఇలా కూడా చేయొచ్చా అని అనుకుంటారు.. మాకెందుకు ఇలాంటి ఐడియా రాలేదని మరికొందరు అనుకోవడం కాయం.. ఇంతకీ ఆ నిరసన ఎందుకు చేశారో తెలుసా ఆ ప్రాంతంలో మద్యం నిలిపివేయాలని.. మాంసాహారాన్ని నిషేధించాలని.. దాదాపు 12 గంటలు నీరసం చేయడమే గగనం అంటే.. వాళ్ళు ఆ నిరసన ఎక్కడ చేశారో మీరే చూడండి..
అది లక్షద్వీప్. ఆ ప్రాంతంలో ప్రతిపాదిత కొత్త చట్టాలకు వ్యతిరేకంగా లక్షద్వీప్, కేరళలో నిరసనలు కొనసాగుతున్నాయి. లక్షద్వీప్ పరిపాలనాధికారి (అడ్మినిస్ట్రేటర్) ప్రఫుల్ పటేల్‌ను తొలగించడంతోపాటు వివాదాస్పద ఎల్డీఏఆర్ బిల్లును ఉపసంహరించుకోవాలని ‘సేవ్ లక్షద్వీప్ ఫోరం’ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. ఏకంగా వాళ్ళ నీరసం సెగలు సముద్ర గర్భంలో వినిపించాయి.. సముద్ర గర్భంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 12 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టారు.
ప్రఫుల్ పటేల్‌కు వ్యతిరేకంగా కేరళ ప్రతిపక్ష పార్టీలు కూడా నిరసన గళం వినిపిస్తున్నాయి. లక్షద్వీప్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్న దీవుల్లో మద్యాన్ని, మాంసాన్ని నిషేధించారని, తీర ప్రాంతాల్లో జాలర్ల గుడిసెలను కూల్చివేయించారని ఆరోపించాయి. ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఎంపీలు కొచ్చిలోని లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.