ప్రేమ పాఠాల పంతులమ్మ.. స్టూడెంట్ తో జంప్..
posted on Jun 9, 2021 @ 12:19PM
గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనకలు ముంగిట వదిలి.. ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి.. తప్పు ఒప్పులు తాతలకొదిలి సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి..గడులుని వదిలి ముడులని వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి..ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఈ పాట వినే ఉంటారు.. తాజాగా ఓ టీచర్ కూడా ఎవరు ఏమనుకున్నా సరే అని ఎగిరిపోయింది.. ఎగిరిపోవడం కామన్ అందులో కొత్తదనం ఏముంది అని అనుకుంటున్నారా..? అవును ఈ వార్తలో కొత్తదనం ఉంది అదేంటో మీరే తెలుసుకోండి..?
ఈ మధ్య కాలంలో పంతులమ్మలు బడిలో పాఠాలు చెప్పడం మానేశారు. ప్రేమ పాఠాలు చదువుతున్నారు.. ప్రేమపాఠాలు అంటే తోటి పంతులయ్యా తోనో.. పక్కింటి అంకుల్ తోలతోనో కాదు వాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకునే స్టూడెంట్స్ తో ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు.. ఈ మధ్య కాలంలో ఈ వార్తలు చాలానే ఉంటున్నాం.. కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు సరిగ్గా పుస్తకాలు పట్టుకుని ఏడాది దాటిపోయింది. స్కూళ్లు మూతపడటంతో పాఠాలన్నీ ఆన్‌లైన్‌లో సాగిపోతున్నాయి. అయితే తమ పిల్లలు చదువులో వెనకబడుతున్నారని అనుకుంటున్న కొందరు తల్లిదండ్రులు ట్యూషన్ టీచర్లను నియమించుకుని చదువు చెప్పిస్తున్నారు. అయితే ఇలా చేయడమే ఓ తల్లిదండ్రుల కొంప ముంచింది. విద్యార్థికి చదువు చెప్పాల్సిన ట్యూషన్ టీచర్ అతడికి ప్రేమ పాఠాలు చెప్పింది.. అక్కడితో ఆగక ఇంకో అడుగుముందుకు వేసి స్టూడెంట్ ని తనతో తీసుకొని ఎగిరిపోయింది..
ఓపెన్ చేస్తే.. అతను ఒక స్టూడెంట్. తొమ్మిదో తరగతి చదువుతున్నాడు ఆ అబ్బాయి వయసు 14 సంవత్సరాలు. కరోనా కావడం వల్ల స్కూల్స్ అన్ని మూత పడిన విషయం తెలిసిందే.. తమ కొడుకు చదువులో వెనకాపాడాడని ట్యూషన్ చెప్పడానికి ఓ యువతి (20)ని నియమించారు. ఆ స్టూడెంట్ తల్లిదండ్రులు. ఇక ఆ పంతులమ్మ గత మూడు నెలల నుంచి రోజూ వారి ఇంటికెళ్లి నాలుగు గంటల పాటు బాలుడికి ట్యూషన్ చెబుతోంది.
కట్ చేస్తే.. గత నెల 29న స్టూడెంట్ దేస్రాజ్ కాలనీలో ఉంటున్న ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లాడు. టైం గడుస్తుంది.. రాత్రి అయ్యింది అయిన కూడా కొడుకు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. అతడికి చాలా సార్లు ఫోన్ చేశారు.. ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు కంగారు మరింత పెరిగింది.. అసలే రోజులు బాగాలేవు తమ కొడుక్కి ఏం జరిగుంటుందని.. ఆలోచించడం మొదలు పెట్టారు ఆ తర్వాత నేరుగా ట్యూషన్ టీచర్ ఇంటికి చేరుకుని కుమారుడి కోసం వాకబు చేశారు. అయితే తమ కూతురు కూడా కనిపించడం లేదంటూ యువతి కుటుంబ సభ్యులు చెప్పడంతో షాకయ్యారు. దీంతో ఆ టీచర్పై మైనర్ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు టీచర్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేసి వారి కోసం గాలింపు చేపట్టారు. ఆ టీచర్‌కు గతంలోనే పెళ్లికాగా కొద్దిరోజులకే విడాకులు కూడా తీసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన హర్యానా లో జరిగింది.